Vrushabha Shoot Begins : అసలు సిసలైన పాన్ ఇండియా కాస్ట్ - మోహన్ లాల్ 'వృషభ' షూటింగ్ మొదలు
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రోషన్, షనాయా కపూర్ జంటగా రూపొందుతున్న సినిమా 'వృషభ'. ఇందులో శ్రీకాంత్, రాగిణి ద్వివేది కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
ఇప్పుడు సినిమాకు హద్దులు, సరిహద్దులు తొలగిపోయాయి. సినిమాను ఏ భాషలో తీశారు? అనేది ముఖ్యం కాదు... అన్ని భాషల ప్రేక్షకుల ఆదరణ లభించిందా? లేదా? అనేది ముఖ్యం. అందుకని, పాన్ ఇండియా విడుదలపై అందరూ దృష్టి పెడుతున్నారు. 'వృషభ' సినిమా (Vrushabha Movie)కు వస్తే... అసలు సిసలైన పాన్ ఇండియా కాస్ట్ ఉన్న సినిమా అని చెప్పాలి.
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో...
రోషన్, షనాయా కపూర్ జంటగా!
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'వృషభ'. ఇందులో శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ మేకా కుమారుడు రోషన్, హిందీ హీరో సంజయ్ కపూర్ కుమార్తె షనాయా కపూర్ జంటగా నటిస్తున్నారు.
రోషన్, షనాయా జోడీ స్పెషాలిటీ ఏంటంటే... శ్రీకాంత్ హీరోగా నటించిన 'పెళ్లి సందడి' ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా హిందీ రీమేక్ 'మేరే సప్నోం కి రాణి'లో సంజయ్ కపూర్ హీరోగా నటించారు. ఇప్పుడు వాళ్ళిద్దరి పిల్లలు జంటగా నటిస్తున్నారు.
మోహన్ లాల్ (Mohanlal) మలయాళ హీరో అయితే... రోషన్ (Roshan Meka) తెలుగు అబ్బాయి, షనాయా (Shanaya Kapoor) హిందీ అమ్మాయి. వీళ్ళకు తోడు ఈ సినిమాలో శ్రీకాంత్, కన్నడ కథానాయిక రాగిణి ద్వివేది, ఒకప్పటి హిందీ నటి సల్మా కుమార్తె జహ్రా ఎస్ ఖాన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి? ఇది అసలు సిసలైన పాన్ ఇండియా తారాగణమే కదా!
'వృషభ' షూటింగ్ మొదలైంది
'వృషభ' చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏవీఎస్ స్టూడియోస్ అధినేతలు అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహీ పరేఖ్ మెహతా... ఫస్ట్ స్టెప్ మూవీస్ అధినేత శ్యామ్ సుందర్... బాలాజీ టెలీ ఫిలిమ్స్ అధినేతలు ఏక్తా కపూర్, శోభా కపూర్... కంటెంట్ మీడియా వరుణ్ మాథుర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూలై 22న (శనివారం) మొదలైంది.
వచ్చే ఏడాది విడుదల... 4500 స్క్రీన్లలో!
తెలుగు, మలయాళ భాషల్లో 'వృషభ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆ రెండు భాషలతో పాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 4500లకు పైగా స్క్రీన్లలో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. ఎపిక్ యాక్షన్ ఎంటరైనర్ (Vrushabha Movie Genre)గా 'వృషభ' తెరకెక్కుతోంది.
Also Read : 'మిషన్ తషాఫి'లో తిరువీర్ - యాక్షన్ స్పై థ్రిల్లర్ గురూ!
#VRUSHABHA Shoot Begins!!
— Vamsi Kaka (@vamsikaka) July 23, 2023
Filming of India’s most awaited Epic Action Entertainer began yesterday, 22nd July. The VRUSHABHA team are beyond elated and grateful to have the opportunity to bring to life this one of its kind Pan India epic adventure full of jaw-dropping action,… pic.twitter.com/E31AfSutgh
'వృషభ' సినిమాలో శ్రీకాంత్, రోషన్ నటిస్తుండటం ఓ విశేషం అయితే... చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ సతీమణి ఊహ కనిపించడం మరో విశేషం. సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా క్లాప్ బోర్డు పట్టుకుని కనిపించారు. మోహన్ లాల్, ఇతర ప్రధాన తారాగణం మీద ప్రస్తుతం సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. శ్రీకాంత్ విషయానికి వస్తే... ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్', 'దేవర' సినిమాల్లో నటిస్తున్నారు. ఇంకా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నారు. 'పెళ్లి సందD' తర్వాత రోషన్ నటిస్తున్న చిత్రమిది.
Also Read : ఆగస్టులో కాదు, లావణ్యతో వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడంటే? అదీ ఎక్కడంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial