Naga Chaitanya-Sobhita Dhulipala: నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితంపై వేణు స్వామి సంచలన కామెంట్స్ - మూడేళ్ల తర్వాత...
నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితంపై జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన కామెంట్స్ చేశాడు. సమంత, శోభిత జాతకాన్ని కూడా పోలుస్తూ షాకింగ్ విషయాలు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Astrologer Venu Swamy on Naga Chaitanya Sobhita Dhulipala Marriage: అక్కినేని హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళలు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరి ఆగష్టు 8న నిశ్చితార్థం ముహుర్తం పెట్టుకుని రింగులు మార్చుకున్నారు. ఈ శుభవార్తలను స్వయంగా నాగార్జున సోషల్ మీడియాలో ప్రకటించారు. గురువారం(ఆగష్టు 8) ఉదయం 9.42 నిమిషాలకు వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు నాగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. నాగా చైతన్య-శోభితల ఎంగేజ్‌మెంట్ జరిగిన కొన్ని గంటలకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి బాండు పెల్చారు.
నాగ చైతన్య-శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు అంటూ కొత్త జంటను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశాడు. చెప్పినట్టుగానే వీరి జాతకంపై విశ్లేషించిన వీడియో రిలీజ్ చేశాడు.ఇందులో నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితంపై సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాదు సమంత, శోభిత జాతకాన్ని కూడా పోలుస్తూ షాకింగ్ విషయాలు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో వేణు స్వామి ఏం చెప్పాడంటే.. "సమంతతో పోలిస్తే శోభిత జాతకం అసలు బాగా లేదు. కెరీర్ పరంగా సమంతకు వందశాతం బాగుంది.
శోభితకు 20 శాతం మాత్రమే ఉంది. సమంతది భరణి నక్షత్రం, శోభితది ధనుస్సు రాశి. ఇద్దరు అమావాశ్య రోజే పుట్టారు. సమంత జాతకం ప్రకారం ఏం జరిగిందో. శోభిత విషయంలో కూడా అదే జరగనుంది. సమంత,శోభిత ఇద్దరి జాతకాల్లోనూ శని దృష్టి కుజుడి మీద ఉంది. శోభితకు జాతకంలో అయితే కుజుడి మీదే కాదు శుక్రుడు మీద, గురుడు మీద కూడా శని దృష్టి ఉంది" అంటూ బాంబు పేల్చాడు. అలాగే నాగ చైతన్య, శోభిత జాతకం విశ్లేషిస్తూ ఇద్దర జాతకాల్లో షష్టాకాలు వచ్చాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
View this post on Instagram
"సమంతో పోలిస్తే శోభిత జాతకం అసలు బాగాలేదు. నాగార్జున గారు చెప్పిన ముహుర్తం ప్రకారం చూస్తే అసలు ఇది శుభకార్యాలకు పనికి రాదు. ఆగష్టు 8 ఉదయం 9:42 నిమిసాలు ఈ ముహుర్తం నిశ్చితార్థానికి పనికి రాదు. శుభకార్యాలకు ఇది నిషేద ముహుర్తం. అలాంటి ముహుర్తాన్ని ఎందుకు పట్టుకున్నారో వారికే తెలియాలి. ఇక వారిద్దరు జాతకాలు కూడా ఏమాత్రం కలవలేదు. నాగ చైతన్య రాశి కర్కాటక రాశి. శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి. నాగ చైతన్యకు 6, శోభితకు 8 వచ్చాయి. ఇద్దరి జాతకాల్లో షష్టాకాలు వచ్చాయి" అంటూ బాంబు పేల్చాడు. వీరిద్దరి జాతకం ప్రకారం చూస్తే మూడేళ్లు మించి వీరు కలిసి ఉండలేరు. 2027 వరకు వీరి వైవాహిక జీవితం బాగుటుంది. ఆ తర్వాత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఓ స్త్రీ వల్ల వీరి వైవాహిక జీవితంలో కలతలు వస్తాయి" అని పేర్కొన్నాడు.
అనంతరం తాను చెప్పేది తప్పుగా తీసుకోవద్దన్నారు. గతంలో సమంత, నాగచైతన్య జాతకం గురించి చెప్పినప్పుడు కూడా అంతా నన్ను తప్పుబట్టారు. ఇప్పుడు కూడా తిడతారని తెలుసు. కానీ ఓ జ్యోతిష్కుడిగా అందరి జీవితాలు బాగుండాలని కోరుకుంటాను. నాగ చైతన్య సమంతకు నేను 100కి 50 మార్కులు ఇచ్చాను. నాగ చైతన్య శోభితకు 10 మార్కులు ఇస్తాను. 50 మార్కులు వేసిన సమంత విషయంలో ఏం జరిగిందో చూశారు. శోభితకు 10 మార్కులే వేశాను అంటే ఆలోచించుకోండి. సమంత-నాగ చైతన్యల అప్పుడు కూడా నిశ్చితార్థం తర్వాతే చెప్పారు. ఇది వారి జాతకం, నిశ్చితార్థం ముహుర్తం చూసే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. అఖిల్ నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అవుతుందని చెప్పాను. నేను చెప్పినట్టే జరిగింది కదా. ఇప్పుడు కూడా ఆలోచించండి. ఇది నేను వారి మంచికే చెప్పాను. కాబట్టి నాగ చైతన్య, శోభితలు అప్రమత్తమై పెళ్లికి ముందే తమ జ్యోతిష్యులను కలిసి జాతక నివారణలు చేసుకుంటే మంచిది" అని వీడియో చివరిలో ఆయన సూచించాడు.
Also Read: పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన దూత హీరోయిన్- పదేళ్లుగా రాజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వెల్లడి