News
News
వీడియోలు ఆటలు
X

Ashu Reddy Surprise Gift : అమ్మకు అషూరెడ్డి సర్ ప్రైజ్, అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Ashu Reddy Gifts Car To Mother : బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి తన తల్లి బర్త్ డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సరికొత్త కారును అదించింది. కూతురు ఇచ్చిన సర్ ప్రైజ్ కు తల్లి ఆనందంలో మునిగిపోయింది.

FOLLOW US: 
Share:

అషూరెడ్డి, సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. టిక్ టాక్ ద్వారా పాగా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాటు, ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ నటించింది. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి ఓ రేంజిలో పాపులారిటీ సంపాదించుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చాక, ఈమె క్రేజ్ ఇంకాస్తా పెరిగింది. వరుసగా టీవీ షోలలో అవకాశాలు దక్కించుకోవడంతో పాటు ఆర్జీవీతో ఇంటర్వ్యూలు చేసింది. ఫోటోలు, వీడియోలతో నెట్టింట్లో హల్ చల్ చేసింది. ప్రస్తుతం తెలుగునాట ఈమె పాపులర్ ఫిగర్ గా మారిపోయింది.

తల్లికి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన అషూరెడ్డి

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన తల్లి బర్త్ డే సందర్భంగా, అదిరిపోయే గిఫ్ట్ అందించింది. సరికొత్త సుజూకీ కారును పుట్టిన రోజు కానుకగా అమ్మకు అందించింది. కూతురు గిఫ్ట్ చూసి తల్లి అనందంలో మునిగితేలింది. ముందుగా తన తల్లి కోసం మూడు ఆప్షన్స్ పేపర్స్ మీద రాసింది. అందులో ఒకటి కొత్తకారు కాగా, మరొకటి జ్వెల్లరీ, ఇంకోటి నో గిఫ్ట్స్. వాళ్ల మమ్మీకి ఈ మూడింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పింది. ఈ మూడు ఆప్షన్స్ లో ఆమె కొత్త కారును సెలెక్ట్ చేసుకుంది. వెంటనే తన కోసం కొత్త సుజుకీ కారును తీసుకొచ్చింది. ఇంట్లో నుంచి తన తల్లి కళ్లు మూసి బయటకు తీసుకొచ్చి కారును చూపించింది. బిడ్డ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆమె తల్లి ఆనందంలో మునిగి తేలింది. అషూను హగ్ చేసుకుని తన సంతోషాన్ని వెల్లడించింది. సోషల్ మీడియాలో నెటిజన్లు అషూరెడ్డిని అభినందిస్తున్నారు. తన తల్లికి చక్కటి గిఫ్ట్ ఇచ్చిందని కొనియాడుతున్నారు. మరోవైపు ఆమె తల్లికి బర్త్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

అషూకు లగ్జరీ కారు గిఫ్టుగా ఇచ్చిన తండ్రి

గత సెప్టెంబర్ లో అషూ బర్డ్ డే జరుపుకోగా, ఆమె తండ్రి కళ్లు చెదిరే గిఫ్ట్ ఇచ్చారు. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన C200D మోడల్ కారును కూతురికి బహుమతిగా అందించారు. ఈ కారు ధర సుమారు రూ. 70 లక్షల వరకు ఉంటుంది. ఈ గిఫ్ట్ అందుకున్న అషూ సోషల్ మీడియా వేదికగా కారు ఫోటోలను షేర్ చేసింది. తన తండ్రికి ధన్యవాదాలు చెప్పింది. ఆమెకు నెటిజన్లు జోరుగా బర్త్ డే విషెష్ చెప్పారు. బర్త్ డే రోజున కూతురుకు ఖరీదైన బహుమతిని ఇచ్చిన ఆమె తండ్రిని అభినందించారు.  

ఇక అషూరెడ్డి ప్రస్తుతం  పలు టీవీ షోలలో పాల్గొంటుంది. గతంలో కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. ఇటు బుల్లితెర, అటు వెండి తెర ప్రేక్షకులను తన అందం, అభినయం, చలాకీతనంతో ఆకట్టుకుంటోంది.  

Read Also: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

Published at : 02 Apr 2023 09:39 AM (IST) Tags: ashu reddy bigg boss ashu reddy Ashu Mother Birthday Ashu Reddy Gifts Car

సంబంధిత కథనాలు

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !