Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి
తెలంగాణ ప్రజల ఆత్మీయతలను హృద్యంగా తెరెక్కించిన చిత్రం ‘బలగం’. ఈ చిత్రంలోని కొన్ని సీన్లను సెన్సార్ చేశారు. వాటి స్థానంలో కొత్త సీన్లు పెట్టారు. సెన్సార్ కు గురైన ఓ డైలాగ్ ను ప్రియదర్శి షేర్ చేశాడు.
చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం ‘బలగం’. మార్చి 3న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న ఈ సినిమా ఓటీటీలోనూ అలరిస్తోంది. పెద్ద సినిమాలకు దీటుగా ఈ చిత్రం వసూళ్లను రాబడుతోంది. టాలీవుడ్ నటుడు, జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సక్సెస్‌ఫుల్ టాక్ థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ఈ మూవీపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత
తాజాగా ఈ సినిమాలోని ఓ డెలిటెడ్ డైలాగ్ ను నటుడు ప్రియదర్శి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఇంట్లో కూర్చుని తన మరదలు సంధ్యతో మాట్లాడుతున్న సమయంలో ఫ్రెండ్ నుంచి ప్రియదర్శికి కాల్ వస్తుంది. అప్పుడు అమ్మాయి ముందు బిల్డప్ ఇచ్చేందుకు ‘ఐ ఫోన్ మేక్ యు’ అంటాడు. ఆయన మాటలకు మరదలు ముసిముసిగా నవ్వుతుంది. అయితే, ఒరినల్ గా ఈ డైల్ గా స్థానంలో ‘పెట్టెయ్ బాడ్కవ్ మల్లజేస్త’, ‘పెట్టెయ్ హౌలగా మల్లజేస్త’ అనే డైలాగులు ఉండేవి. వాటిని సెన్సార్ చేయడంతో ‘ఐ ఫోన్ మేక్ యు’ అనే డైలాగ్ ను పెట్టారు. సెన్సార్ కు ముందు, సెన్సార్ కు తర్వాత అంటూ ప్రియదర్శి ఈ డైలాగ్ ను ఇన్ స్టాలో షేర్ చేశారు.
View this post on Instagram
‘బలగం’ చిత్రానికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
తాజాగా ‘బలగం’ చిత్రం అంతర్జాతీయ అవార్డుల వేడుకలో సత్తా చాటింది. ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డు వేడుకలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను దోచుకోవడంతో పాటు అవార్డులను సైతం గెల్చుకుంటోంది. చక్కటి కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తెరకెక్కిస్తే ఆడియెన్స్ తప్పకుండా అండగా నిలుస్తారని ఈ సినిమా నిరూపించింది.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందంటున్నారు. పల్లెటూరి ప్రేమలను, ఆప్యాయతలను ఈ చిత్రంలో బాగా చూపించారని చెప్తున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ నటించకపోయినా, కథలోని బలం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చక్కటి మౌత్ పబ్లిసిటీతో మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. రోజు రోజుకు ఈ సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది.
Read Also: రజనీ కాంత్ ఫ్యామిలీకి వర్తించని రూల్స్, వారికి ఎందుకు? ఆ థియేటర్ నిర్వాకంపై నెటిజన్ల ఆగ్రహం