Rohini Theatre Issue: రజనీ కాంత్ ఫ్యామిలీకి వర్తించని రూల్స్, వారికి ఎందుకు? ఆ థియేటర్ నిర్వాకంపై నెటిజన్ల ఆగ్రహం
తమిళనాడులోని ప్రముఖ రోహిణి థియేటర్ యాజమాన్యంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. టికెట్ తీసుకున్నా ట్రైబల్ ఫ్యామిలీని లోనికి అనుమతించకపోవడంపై మండిపడుతున్నారు.
తమిళ స్టార్ హీరో శింబు నటించిన తాజా సినిమా ‘పత్తు తల‘. శ్రీరామ నవమి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చెన్నైలోని ప్రముఖ థియేటర్ రోహిణిలోనూ ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు అందరిలాగే ఓ ట్రైబల్ ఫ్యామిలీ కూడా వచ్చింది. వారు టికెట్ కొనుగోలు చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, థియేటర్ యాజమాన్యం వారిని లోపలికి పంపించేందుకు అనుమతించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
காசு கொடுத்து டிக்கெட் வாங்கினப்புறம் என்னடா இது @RohiniSilverScr pic.twitter.com/bWcxyn8Yg5
— Sonia Arunkumar (@rajakumaari) March 30, 2023
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు - వివరణ ఇచ్చిన యాజమాన్యం
ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గిరిజన కుటుంబంపై ఎందుకు వివక్ష అంటూ నెటిజన్లు మండిపడ్డారు. యాజమాన్యం తీరు తూర్పారబడుతూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. సోషల్ మీడియాలో వస్తున్న తీవ్ర ఆగ్రహాన్ని పరిగణలోకి తీసుకుని రోహిణి థియేటర్ యాజమాన్యం వివరణ ఇచ్చింది "‘పత్తు తల‘ సినిమా ప్రదర్శనకు ముందు మా థియేటర్ ప్రాంగణంలో జరిగిన పరిస్థితిని మేము గమనించాం. వారి దగ్గర సినిమా చూసేందుకు టికెట్లు ఉన్నాయి. ఓ తల్లి తన పిల్లలతో కలిసి సినిమా చూడాలి అనుకుంది. కానీ, ఈ చిత్రాన్ని అధికారులు U/A సెన్సార్ చేశారు. చట్టం ప్రకారం U/A సర్టిఫికేట్ పొందిన ఏ సినిమాని 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చూడటానికి అనుమతించరు. టిక్కెట్ తనిఖీ సిబ్బంది దీని ఆధారంగా ప్రవేశాన్ని నిరాకరించారు. 2,6,8,10 సంవత్సరాల పిల్లలతో వచ్చిన కుటుంబానికి సైతం అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత వారిని అనుమతించాం" అని చెప్పుకొచ్చింది. గిరిజనులు సినిమా చూస్తున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది.
— Rohini SilverScreens (@RohiniSilverScr) March 30, 2023
— Rohini SilverScreens (@RohiniSilverScr) March 30, 2023
రజనీకాంత్ ఫ్యామిలీకి లేని రూల్స్ వారికెందుకు?
రోహిణి థియేటర్ ఇచ్చిన వివరణపైనా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం జనాలను మభ్య పెట్టేందుకే ఈ ప్రకటన జారీ చేశారని మండిపడుతున్నారు. 2020లో విడుదలైన రజనీకాంత్ ‘దర్బార్’ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారని, అయినా సూపర్ స్టార్ తన 10 ఏళ్ల వయసున్న మనవడు లింగను సినిమా చూడ్డానికి తీసుకొచ్చారని చెప్పారు. రజనీ ఫ్యామిలీ సినిమా చూసిన ఫోటోలను షేర్ చేశారు. అప్పుడు రజనీ కాంత్ ఫ్యామిలీకి అడ్డురాని రూల్స్, గిరిజన కుటుంబ వచ్చే సరికి గుర్తుకు వచ్చాయా? అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. యు/ఏ సర్టిఫికేట్ ఉన్నా, 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో చూసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా పిచ్చి వివరణలు ఇవ్వడం మానుకోవాలని రోహిణి థియేటర్ యాజమాన్యానికి హితవు పలికారు.
Let me come to your point. Dhanush 2nd son age was 9 or 10 during the release of darbar movie which is UA certified. Then how you can allow them ? #RohiniTheatre@RohiniSilverScr ? https://t.co/PcgNXXyqw1 pic.twitter.com/Rwn0dSFiRq
— V i v e k _ 🦜 (@vivek18b_) March 30, 2023
గిరిజన ఫ్యామిలీని అనుమతించకపోవడం తప్పు - జీవీ ప్రకాష్
రోహిణి థియేటర్ ఘటనపై మ్యూజిక్ కంపోజర్ జీవీ ప్రకాష్ ట్విట్టర్‌లో స్పందించారు. “ఆ బ్రదర్స్, సిస్టర్స్ ను సినిమా థియేటర్ లోకి అనుమతించినట్లు తెలిసింది. మొదట వారిని అనుమతించకపోవడం సరికాదు. కళ అనేది అందరికీ సమానం, అందరికీ చెందుతుంది కూడా” అని ఆయన తమిళంలో ట్వీట్ చేశారు.
அந்த சகோதரியும் சகோதரர்களும் பின் தாமதமாக அனுமதிக்கப்பட்டதாக விவரம் தெரிகிறது , எனினும் முதலில் அனுமதிக்க மறுத்தததை எவ்விதத்திலும் ஏற்றுக்கொள்ள இயலாது. கலைகள் அனைவருக்கும் சொந்தமானது. https://t.co/IjGBzxLkJT
— G.V.Prakash Kumar (@gvprakash) March 30, 2023
అజిత్ కుమార్, తలపతి విజయ్, రజనీకాంత్ అనేక ఇతర ప్రముఖ సూపర్ స్టార్‌ల చిత్రాల ఫస్ట్ డే ఫస్ట్ షోలకు చెన్నై రోహిణి థియేటర్ చాలా ఫేమస్. అలాగే తాజాగా శింబు ‘పత్తు తల‘ కూడా ఇక్కడ విడుదలైంది. ఇసుక మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శింబు ఏజీఆర్‌గా నటించారు. ఇది శివరాకుమార్ కన్నడ చిత్రం ‘మఫ్తీ’కి రీమేక్. ఒబేలి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్ కృష్ణ, ప్రియా భవాని ప్రధాన పాత్రలు పోషించారు.
Read Also: ‘సిటాడెల్’ కొత్త ట్రైలర్ వచ్చేసింది, అదిరిపోయే యాక్షన్స్ సీన్లు, ప్రియాంక చోప్రా అందాల విందు