News
News
వీడియోలు ఆటలు
X

Citadel New Telugu Trailer: ‘సిటాడెల్’ కొత్త ట్రైలర్ వచ్చేసింది, అదిరిపోయే యాక్షన్స్ సీన్లు, ప్రియాంక చోప్రా అందాల విందు

ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ కీలక పాత్రల్లో తెరెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మరో ట్రైలర్ ను వదిలింది అమెజాన్ ప్రైమ్.

FOLLOW US: 
Share:

హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకా నుంది. ఈ నేపథ్యంలో కొత్త ట్రైలర్ ను విడుదల చేసింది.

హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు, ప్రియాంక రొమాన్స్!

ఈ ట్రైలర్ ను తెలుగుతో పాటు హిందీ, తమిళం,  కన్నడ, మలయాళంలోనూ విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం హై యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. ‘సిటాడెల్’ స్పై ఏజెంట్లుగా ప్రియాంక, మాడన్ సూపర్ డూపర్ యాక్షన్ తో అదరగొట్టారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సైతం ఆకట్టుకున్నాయి. గన్స్, బాంబ్స్ మోతలతో భారీ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ నిండిపోయింది. ట్రైలర్ స్టార్టింగ్ మొదలుకుని చివరి వరకు కన్ను ఆర్పకుండా చూసేలా ఉంది.

తెలుగులోనూ అందుబాటులోకి హాలీవుడ్ ‘సిటాడెల్’

ఏప్రిల్ 28న ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ సిరీస్ ను తెలుగులోనూ అందుబాటులోకి తెలుస్తున్నట్లు వెల్లడించింది. అటు హిందీ, తమిళం,  కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  దీంతో తెలుగు ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ చూస్తామా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆకట్టుకుంటున్న హాలీవుడ్ ‘సిటాడెల్’ టీజర్లు, పోస్టర్లు

ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన కొన్ని టీజర్లను  అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్  చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చాలా టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన యాక్షన్ సీన్లతో నిండి ఉన్న టీజర్లు సిరీస్ పై ఓ రేంజిలో అంచనాలు పెంచుతున్నాయి.  ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సైతం ఆకట్టుకుంది. ప్రియాంక చేతిలో గన్ పట్టుకుని సైలెంట్ గా వార్నింగ్ ఇస్తున్నట్లు అందులో కనిపించింది. ‘సిటాడెల్‌’లో ప్రియాంక ఎలైట్ గూఢచారి నదియా సిన్ పాత్ర పోషిస్తుంది. రస్సో బ్రదర్స్ సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా మొదటి రెండు ఎపిసోడ్‌లు ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి.

బాలీవుడ్ లోనూ తెరకెక్కుతున్న ‘సిటాడెల్’ సిరీస్  

ఇదే ‘సిటాడెల్’ సిరీస్ బాలీవుడ్ లోనూ తెరకెక్కుతోంది. ఇక్కడి ప్రేక్షకులకు అనుకూలంగా  స్క్రిప్ట్ ని మార్చి దర్శకులు రాజ్, డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన సమంతాను ’సిటాడెల్’ ఇండియన్ వర్షన్ మెయిన్ లీడ్ గా తీసుకున్నారు. వరుణ్ ధావన్ సైతం ఇందులో మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. సమంత చేసే ఈ సిరీస్ పై కూడా ఇండియాలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ కూడా షూటింగ్ జరపుకుంటోంది.

Read Also: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు

Published at : 31 Mar 2023 09:52 AM (IST) Tags: Amazon Prime Video Citadel Web Series New Telugu Trailer

సంబంధిత కథనాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!