అన్వేషించండి

Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్

Anupama Reaction : రీసెంట్‌గా అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వార్తలు, ఇన్ స్టా పోస్టులు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా క్రేజీ కల్యాణం టీజర్ ఈవెంట్‌లో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anupama Parameswaran Reaction About Her Insta Posts : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్‌గా లవ్ బ్రేకప్ రూమర్స్‌తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె చేసిన ఇన్ స్టా పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె క్రేజీ కల్యాణం టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. తన ఇన్ స్టా పోస్టులపై ఆమె రియాక్ట్ అయ్యారు.

'అది నా ఇష్టం'

తాను ఓ కష్టమైన సంవత్సరాన్ని గడిపానని.. ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నట్లు చెప్పారు అనుపమ. 'ప్రస్తుతం నేను అద్భుతంగా ఉన్నా. నేను ఓ కష్టమైన సంవత్సరాన్ని గడిపాను. కానీ ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నాను. నేను ఈ స్థితికి ఇంకొంచెం ముందుగానే చేరుకుని ఉంటే బాగుండేదని మాత్రమే కోరుకుంటున్నా.' అని చెప్పారు.

'తన గతం గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం అవసరమా?' అంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు... 'అది నా సోషల్ మీడియా. ఏది పోస్ట్ చేయాలో చేయకూడదో నేను నిర్ణయించుకుంటాను. ఏమైనా నేను పోస్ట్ చేసుకుంటాను. దాని గురించి అడిగే రైట్ ఎవరికీ లేదు. నా గురించి ఎవరికి ఏం తెలుసు.' అని తెలిపారు.

Also Read : Crime Thriller OTT : బాలుని బలి కోరే ఆచారం... మర్డర్ చుట్టూ మిస్టరీ - ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు

'ఆ హీరోతో బ్రేకప్'

కోలీవుడ్ హీరో ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే ప్రచారం సాగింది. బైసన్ మూవీ చేస్తున్న టైంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే టాక్ వినిపించింది. ఆ తర్వాత పలు ఈవెంట్స్‌లో ఇద్దరూ కలిసి కనిపించారు. దీంతో ఆ రూమర్స్‌కు మరింత ఆజ్యం పోసినట్లయింది. కొన్ని రోజుల తర్వాత అనుపమ రీసెంట్‌గా ఇన్ స్టాలో చేసిన పోస్టులు ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందా? అనే ఊహాగానాలకు తెర తీసినట్లయింది. 

'నాకు ఫ్రీడమ్ వచ్చింది. కొన్నిసార్లు మనశ్శాంతి పొందాలంటే మీరు నిస్సహాయమైన మార్గాలు వదిలేయాల్సిందే. ఈ రోజు నుంచి నా గొంతు నా లైఫ్ నేనే ఎంచుకుంటాను. ఇకపై అనుమతులు అక్కర్లేదు. భయం లేదు. నాది అని మర్చిపోయిన జీవితంలో ప్రేమలో పడుతున్నాను. ఇది స్వేచ్ఛకు స్వాగతం, నా జీవితానికి స్వాగతం.' అంటూ ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చారు. దీంతో ఇద్దరికీ బ్రేకప్ జరిగిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. తాజాగా అనుపమ రియాక్షన్‌తో అది కన్ఫర్మ్ అయినట్లేనని ఫ్యాన్స్, నెటిజన్స్ అంటున్నారు.

'క్రేజీ కల్యాణం' మూవీ విషయానికొస్తే... తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన విలేజ్ కామెడీ ఎంటర్టైనర్. బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తుండగా... అఖిల్ రాజ్, నరేష్ వీకే కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా అనుపమ లుక్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి చుట్టూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టీజర్‌ను బట్టి తెలుస్తోంది.

Also Read : Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget