Crime Thriller OTT : బాలుని బలి కోరే ఆచారం... మర్డర్ చుట్టూ మిస్టరీ - ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు
Crime Investigation Thriller OTT : ఓవైపు వ్యాపారి ఇంట్లో యువతి దారుణ హత్య... మరోవైపు బాలుని బలి కోరే ఆచారం. థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో సాగే మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

Malayalam Crime Investigation Thriller Paithalattam OTT Streaming : మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒక పాయింట్ ఆధారంగా మర్డర్ మిస్టరీ చుట్టూ సాగే థ్రిల్లర్స్‌కు మరింత క్రేజ్ ఉంటుంది. తాజాగా అలాంటి లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ మూవీ ఏంటి... ఎందుకంత స్పెషల్ అనేది ఓసారి చూస్తే...
స్టోరీ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్?
కుటుంబంలో ఓ చిన్న వివాదం... చినికి చినికి గాలివానలా మారి ఓ యువతి హత్యకు దారి తీస్తుంది. ప్రముఖ వ్యాపారి కుటుంబంలో జరిగిన ఈ ఘటన ఆ నగరంలోనే సంచలనం సృష్టిస్తుంది. పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకదు. ఈ కేసును సాల్వ్ చేసే బాధ్యతను ఓ కీలక అధికారికి అప్పగిస్తారు. ఇన్వెస్టిగేషన్ లోతులోకి వెళ్లే కొద్దీ... హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులు, బాయ్ ఫ్రెండ్, ఇంట్లో పని వాళ్లు అందరి దగ్గర ఒక్కో రహస్యం బయటపడుతుంది.
ఇదే టైంలో క్లూ దొరికిందనుకున్న పోలీసులకు మరో ట్విస్ట్ ఎదురవుతుంది. ఓ ఆచారం ప్రకారం ఓ చిన్న బాలుడిని బలివ్వాలనుకునే సందర్భంలో అతని పేరెంట్స్ పోరాటం స్టోరీకి కీలక మలుపులా మారుతుంది. మరి పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు? విచారణలో పోలీసులకు తెలిసిన షాకింగ్ నిజాలేంటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆ మూవీనే పైథలాట్టం (Paithalattam).
ఏ ఓటీటీలో చూడొచ్చు?
మే 29న థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ సొంతం చేసుకున్న 'పైథలాట్టన్' శుక్రవారం నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' (SunNXT)లో ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి విబిన్ ఎన్ వేలాయుధన్ దర్శకత్వం వహించగా... ధన్య అనన్య, జయన్ చేర్తాల, మిథున్ చంబు, సునీల్ సుఖద తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















