Harichandra Katha Series OTT : యాక్షన్ లేదు... రక్తపాతం కాదు - 11 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్... ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ సిరీస్
Harichandra Katha OTT Platform : యాక్షన్, హారర్, క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్‌కు కాస్త డిఫరెంట్‌గా సరికొత్త రొమాంటిక్ కామెడీ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. 11 రోజుల్లోనే ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేశారు.

Comedy Drama Series Harichandra Katha OTT Streaming : హారర్, క్రైమ్, థ్రిల్లింగ్ కంటెంట్ ట్రెండ్ అవుతున్న ప్రస్తుత టైంలో వాటి నుంచి కాస్త మారుతూ హాయిగా నవ్వుకునేలా సరికొత్త రొమాంటిక్ కామెడీ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకూ ఆ సిరీస్ ఏంటంటే...
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా హరిచంద్ర కథ (Harichandra Katha) ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ, ఫ్రెండ్షిప్, లవ్, ఫ్యామిలీ, ఎమోషన్ అంశాలతో 5 ఎపిసోడ్స్‌లో ఈ సిరీస్ రూపొందించారు. కేవలం 11 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. రక్తపాతం, బోల్డ్ కంటెంట్ లేని పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను తక్కువ టైంలోనే ప్రజెంట్ చేయడంతో ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్‌కు కార్తీక్ కృష్ణ దర్శకత్వం వహించగా... కార్తీక్ కృష్ణ, హేమ గొర్లె, గోపీచంద్ అల్లా, హరినాథ్ రాజ్, అర్జున్ శ్రీనివాస్, శివప్రసాద్, ప్రవీణ్ తదితరులు నటించారు.
స్టోరీ ఏంటంటే?
ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్, ఎమోషనల్ చుట్టూ ఈ కథ సాగుతుంది. మన చుట్టూ ఉండే మనుషులే ప్రధాన పాత్రల్లో నటించారా అన్నట్లుగా ప్రతీ మిడిల్ క్లాస్ యూత్‌కు కనెక్ట్ అవుతుంది హరిచంద్ర కథ. నేటి తరం యువత ఎదుర్కొనే ప్రధాన సమస్య నిరుద్యోగం. సరైన టైంలో జాబ్ తెచ్చుకోకుంటే యువత పడే వేదన వర్ణనాతీతం. అతి కష్టమ్మీద బ్యాక్ డోర్ ద్వారా సాఫ్ట్ వేర్ జాబ్ తెచ్చుకున్న యువకుడు ఉద్యోగంలో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తన జాబ్‌తో పాటు లవ్‌ను ఎలా కాపాడుకున్నాడు. అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























