News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న 'తలైవర్ 170' సినిమాలో పలువురు టాలెంటెడ్ యాక్టర్స్ భాగం అవుతున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

FOLLOW US: 
Share:

ఇద్దరు దిగ్గజ నటులను ఒకే స్క్రీన్ మీద చూడటం సినీ అభిమానులకు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇద్దరు 'సూపర్ స్టార్స్'ను ఒకే సినిమాలో చూసే అవకాశం భారతీయ ప్రేక్షకులకు దక్కుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. మూడు దశాబ్దాల తర్వాత ఈ అరుదైన కలయికకు 'తలైవర్ 170' చిత్రం వేదిక కాబోతోంది. 

'జైలర్' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన రజనీకాంత్.. రెట్టింపు ఉత్సాహంతో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలకు సైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న #Thalaivar170 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ తన తదుపరి మూవీ చేయనున్నారు. ఈ సినిమాలో తలైవాతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే నటీనటుల జాబితాను మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బిగ్ బీ అమితాబ్ భాగం అవుతున్నట్లు ప్రకటించారు. 

''ది షాహెన్‌షా ఆఫ్ ఇండియన్ సినిమాకి స్వాగతం. మిస్టర్ అమితాబ్ బచ్చన్ #Thalaivar170 సినిమాలో నటిస్తున్నారు. మహోన్నతమైన ప్రతిభ కలిగిన అమితాబ్ చేరికతో ఈ టీమ్ కొత్త శిఖరాలకు చేరుకుంది'' అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీన్ని బట్టి ఇందులో బిగ్ బీ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

ఏదేమైనా 'తలైవర్ 170' సినిమా కోసం రజనీకాంత్, అమితాబ్ లాంటి సీనియర్ నటులు చేతులు కలపడం అభిమానులు మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి వీరిద్దరూ కలిసి నటించడం ఇదేమీ తొలిసారి కాదు. చివరిగా 1991లో 'హమ్' అనే హిందీ ఫ్యామిలీ డ్రామాలో కలిసి పనిచేశారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు లెజండరీ నటులిద్దరూ జట్టు కట్టబోతున్నారు. మరి ఈ కలయిక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. 

ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ చిత్రంలో రజనీకాంత్‌, అమితాబ్ బచ్చన్ లతో పాటుగా పలు ఇండస్ట్రీల నుంచి అనేక మంది టాలెంటెడ్ యాక్టర్స్ భాగం అవుతున్నారు. ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. 

ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుతం తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలామ్‌' అనే సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలానే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నారు. మరోవైపు అమితాబ్ బచ్చన్ నటించిన 'గణపత్' సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD' చిత్రంలోనూ బిగ్ బీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 03 Oct 2023 10:03 PM (IST) Tags: Rana Daggubati Amitabh bachchan Fahadh Faasil Rajinikanth Manju Warrier Thalaivar 170 Gnanavel Thalaivar Feast

ఇవి కూడా చూడండి

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Prabhas Marriage: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!

Prabhas Marriage: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!

Aditi Govitrikar: అందుకు ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేశారు - క్యాస్టింగ్ కౌచ్‌పై నోరువిప్పిన ‘తమ్ముడు’ బ్యూటీ

Aditi Govitrikar: అందుకు ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేశారు - క్యాస్టింగ్ కౌచ్‌పై నోరువిప్పిన ‘తమ్ముడు’ బ్యూటీ

Aravind Krishna Actor: ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ హీరో

Aravind Krishna Actor: ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ హీరో

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ