Raaka Story : అల్లు అర్జున్ రాకా స్టోరీ ఏంటి? - సోషల్ మీడియాలో ట్రెండింగ్ థియరీస్ ఓసారి చూస్తే...
Allu Arjun Raaka : అల్లు అర్జున్ రాకా ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... మూవీపై బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలో టైటిల్, లుక్‌తోనే స్టోరీ ఏంటి అనే కొత్త థియరీస్ ట్రెండ్ అవుతున్నాయి.

Allu Arjun Atlee Raaka Movie Story Different Theories : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్‌గా ఫ్యాన్స్‌కు 'రాకా' రూపంలో బిగ్ ట్రీట్ వచ్చిన సంగతి తెలిసిందే. తోడేలు చేయి, గుండుతో, నుదుటిపై చిన్న గాయాలతో బన్నీ లుక్ వేరే లెవల్‌లో ఉంది. పునర్జన్మలు, సమాంతర ప్రపంచం అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోందని మొదటి నుంచీ ప్రచారం సాగింది.
ఇప్పుడు టైటిల్ రివీల్‌తో అదే స్టోరీ అయి ఉంటుందనేది కన్ఫర్మ్ అయ్యింది. ఈ క్రమంలో ఫస్ట్ లుక్, టైటిల్ ఆధారంగా స్టోరీ ఏంటి అనే దానిపై సోషల్ మీడియాలో కొన్ని థియరీస్ ట్రెండ్ అవుతున్నాయి. అసలు రాకా అంటే అర్థం ఏంటి? అనేది ఓసారి చూస్తే...
బ్లడ్ మూన్ - నిండు పున్నమి
'రాకా' అంటే సంస్కృత భాషలో నిండు పున్నమి అని అర్థం. చీకటి నుంచి వెలుగులు నింపే వారియర్‌గా అల్లు అర్జున్ కనిపించనున్నారని... అందుకే ఇలాంటి టైటిల్ ఫిక్స్ చేశారని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పాటే యుద్ధం లేదా ఏదైనా హింస జరిగినప్పుడు దాన్ని సూచిస్తూ చంద్రుడు ఎర్రగా మారాడా? అనే అర్థం వచ్చేలా హీరో విశ్వరూపం చూపిస్తాడనేది కూడా ఓ థియరీ.
మరణమే లేని 'రాకా'
కామిక్స్ బుక్స్ ప్రకారం... రాకా... అంటే మరణమే లేని ఓ వారియర్. హిందీ కామిక్స్ 'చాచా చౌదరి'లో రాకా అనే డెకాయిట్ ఉంటాడు. ఓ ఔషధం తాగిన తర్వాత మరణమే లేని చిరంజీవుడిగా మారతాడు. ఆ టైటిల్ అర్థం వచ్చేలా మూవీలో బన్నీ రోల్ ఉంటుందని ఒక టాక్.
Also Read : విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆలస్యంపై క్వశ్చన్ - తలైవా ఏం చెప్పారంటే?
రాక్షసుడిగా... నెగిటివ్ రోల్
అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ చూస్తుంటే తోడేలు చేయి, గుండుతో ఓ నెగిటివ్ షేడ్ ఉన్న వ్యక్తిగా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో బన్నీ మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఇది నెగిటివ్ రోల్‌కు సంబంధించిన లుక్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శత్రువుల పాలిట రాక్షసుడిలా మారే యాంటీ హీరో స్టోరీ అని అంటున్నారు.
ది వూల్ఫ్ థియరీ
'రాకా' అంటే పౌర్ణమి అని అర్థం. తోలేళ్లకు, పౌర్ణమికి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పౌర్ణమి వంటి ప్రత్యేక సందర్భాల్లో హీరో సూపర్ పవర్స్‌తో శక్తిమంతంగా మారి వారియర్‌గా తనను నమ్ముకున్న వారికి అండగా నిలబడతాడు అనేది కూడా ఓ థియరీ.
రాకాను ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లో తిరగేసి చదివితే ఆకార్. ఈ థియరీ కూడా కొందరు మూవీ స్టోరీకి అప్లై చేస్తున్నారు. ఓ రూపం లేని వ్యక్తి... తన ఉనికిని చాటుకునే కథ అంటూ ప్రచారం చేస్తున్నారు.
రా ఫోర్స్... 'రాకా'
'రాకా' అంటే ఫినిష్ లాంగ్వేజ్‌లో రా/ బ్రూటల్ అని అర్థం. యుద్ధ భూమిలో గాయపడిన సింహం తిరిగి శక్తి పుంజుకుని తన ప్రజల కోసం మారిన ఓ యోధుడి కథగానూ అభివర్ణిస్తున్నారు. రా ఫోర్స్‌గా బన్నీని చూపించనున్నారంటూ టాక్ వినిపించనుంది.
ఇది కేవలం ఆరంభం మాత్రమేనంటూ బిగ్ హైప్ క్రియేట్ చేశారు డైరెక్టర్ అట్లీ. దీంతో రాబోయే రోజుల్లో వచ్చే అప్డేట్స్ అంచనాలను మించి ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీని వచ్చే ఏడాది 7 భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు























