అన్వేషించండి

Raaka First Look : నా 18 ఏళ్ల డ్రీమ్... ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే - రాకా ఫస్ట్ లుక్‌పై డైరెక్టర్ అట్లీ రియాక్షన్

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకా ఫస్ట్ లుక్ నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని... ఫస్ట్ లుక్‌పై డైరెక్టర్ అట్లీ రియాక్ట్ అయ్యారు.

Director Atlee Reaction About Raaka First Look : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ 'AA22xA6' మూవీ సర్ప్రైజ్ ఫ్యాన్స్‌కు నిజంగానే ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తోడేలు చేయి, గుండుతో బన్నీ ఫెరోసియస్ లుక్ క్షణాల్లోనే ట్రెండ్ అయ్యింది. ఇప్పటివరకూ చూడని ఓ ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్‌పై అట్లీ తాజాగా స్పందించారు.

18 ఏళ్లుగా...

రాకా కేవలం ఒక సినిమా మాత్రమే కాదని... తాను ఎన్నో ఏళ్లుగా మోస్తున్న ఓ భాగమని చెప్పారు అట్లీ. 'ఇది నేను ఎన్నో ఏళ్లుగా నాలో మోస్తున్న ఒక భాగం. 18 ఏళ్లుగా ఒకే ఆలోచనను వదలకుండా, దాన్ని మసక బారనివ్వకుండా పట్టుకున్నా. అది నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. అన్నింటిలోనూ నాతోనే ఉంది. నిజం చెప్పాలంటే ఇది ఆరంభం మాత్రమే. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్' అంటూ రాసుకొచ్చారు.

Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ బిగ్ సర్ప్రైజ్ - ఎవరూ ఊహించని టైటిల్... ఏంటో తెలుసా?

ప్రీ పోస్టర్‌తోనే బిగ్ హైప్ క్రియేట్ చేయగా... బుధవారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో ఆ హైప్ మరింత పెంచేశారు. సమాంతర ప్రపంచం, పునర్జన్మల బ్యాక్ డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా... ఒక్క లుక్‌తోనే ఓ విజువల్ వండర్ క్రియేట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. మూడు జనరేషన్స్‌లో మూడు డిఫరెంట్ రోల్స్‌లో బన్నీ నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రిలీజ్ చేసిన లుక్ రాక్షసుడి రూపంలో ఓ నెగిటివ్ రోల్‌కు సంబంధించినదని తెలుస్తోంది.

అసలేంటీ 'రాకా'

టైటిల్ కూడా డిఫరెంట్‌గా ఉండడంతో అసలేంటీ రాకా అంటూ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రాకా అంటే ఫినిష్ లాంగ్వేజ్‌లో 'రా' లేదా బ్రూటల్ అని అర్థం. ఫస్ట్ లుక్ సరిగ్గా గమనిస్తే బన్నీ నుదుటిపై చిన్న చిన్న గాయాలున్నాయి. దీన్ని బట్టి యుద్ధ భూమిలో గాయపడ్డ సింహం శక్తి పుంజుకుని మళ్లీ తిరిగి వచ్చినట్లు చూపించారు.

ప్రజల కోసం ఓ వారియర్‌గా మారిన వ్యక్తిని రా ఫోర్స్ అని అనవచ్చు. ఈ మూవీలో అల్లు అర్జున్ ఓ యోధుడిగా కనిపించనున్నారా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మరో పరంగా చూస్తే... 'రాకా' అంటే పూర్ణిమ, పున్నమి చంద్రుడు అని అర్థం. చీకట్లను తరిమి వెలుగులు నింపే శక్తిగానూ దీన్ని పరిగణిస్తారు. 

ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే, నేషనల్ క్రష్ రష్మిక నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ స్థాయిలో రాకా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget