Alia Bhatt Trolled: మంగళ సూత్రం ఏది? నుదుట సింధూరం ఎక్కడ? - ఆలియాపై ట్రోలింగ్ షురూ
కొత్త పెళ్లి కూతురు ఆలియాను నెటిజన్లు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. పెళ్లి తర్వాత మంగళ సూత్రం ధరించలేదని, నుదుట సింధూరం పెట్టుకోలేదని విమర్శించడం స్టార్ట్ చేశారు.
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి తర్వాత పట్టుమని పది రోజులు కూడా ఇంటి పట్టున లేరు. సినిమా పనుల్లో పడ్డారు. పెళ్లైన రెండు రోజులకు రణ్‌బీర్ ఓ సినిమా ఆఫీసు దగ్గర కనిపించారు. స్క్రిప్ట్ డిస్కషన్స్ కోసం ఆయన వెళ్లారని సమాచారం. ఇక, ఆలియా భట్ మంగళవారం ఒక సినిమా ఆఫీసుకు వచ్చారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'రాకీ ఆర్ రాణీ కి ప్రేమ్ కహాని'లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పనుల నిమిత్తం బయటకు వచ్చారు.
Alia Bhatt trolled for not wearing Mangalsutra: పెళ్లి తర్వాత తొలిసారి ఆలియా భట్ బయటకు రావడంతో ఫోటోగ్రాఫర్లు ఆమెను కెమెరాలో బంధించడానికి పోటీ పడ్డారు. ఆలియా సింపుల్ లుక్ ఆమె అభిమానులను ఆకట్టుకుంది. అయితే... కొందరు విమర్శలు చేయడానికి కారణం అయ్యింది. ఆలియా భట్ సంప్రదాయాలను పాటించడం లేదని కామెంట్స్ మొదలు అయ్యాయి.
Also Read: ఎన్టీఆర్ 'యమగోల' దర్శకుడు తాతినేని రామారావు మృతి
పెళ్లి తర్వాత నుదుట సింధూరం ఎక్కడ? మెడలో మంగళ సూత్రం ఏది? అంటూ సోషల్ మీడియాలో ఆలియా భట్ మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఆలియాకు ట్రోల్స్ కొత్త కాదు. గతంలో నేపోటిజం అని, సుశాంత్ మరణంపై సరిగా స్పందించలేదని, ఆమెకు బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేదని... వివిధ కారణాలు చూపించి ట్రోల్ చేశారు. ఈసారి సంప్రదాయాలను పాటించడం లేదని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఆమె ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ విషయంలో ఆలియాను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సింధూరం పెట్టుకోవాలా? వద్దా? మంగళ సూత్రం వేసుకోవాలా? వద్దా? అనేది ఆలియా వ్యక్తిగతమని అంటున్నారు.
View this post on Instagram