Kajal Aggarwal: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్, సంతోషంలో కిచ్లూ - అగర్వాల్ ఫ్యామిలీ
కాజల్ అగర్వాల్‌కు ఈ రోజు డెలివరీ అయ్యింది.
![Kajal Aggarwal: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్, సంతోషంలో కిచ్లూ - అగర్వాల్ ఫ్యామిలీ Kajal Aggarwal And Her Hubby, Gautam Kitchlu Embrace Parenthood, Blessed With A Baby Boy Kajal Aggarwal: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్, సంతోషంలో కిచ్లూ - అగర్వాల్ ఫ్యామిలీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/de1eb59f4b75b654f2a02c837322d92b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కాజల్ అగర్వాల్ తల్లి అయ్యారు. ఈ రోజు ఆమెకు డెలివరీ అయ్యింది. పండంటి మగబిడ్డకు తెలుగు ప్రేక్షకుల మిత్రవింద, చందమామ జన్మనిచ్చారని సమాచారం. అయితే... కాజల్ కుటుంబ సభ్యులు గానీ, ఆమె భర్త గౌతమ్ కిచ్లూ గానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
మంగళవారం ఉదయం కాజల్ చెల్లెలు, ఒకప్పటి కథానాయిక నిషా అగర్వాల్ అక్క డెలివరీ గురించి హింట్ ఇచ్చారు. "స్పెషల్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను" అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నిషా అగర్వాల్ పోస్ట్ చేశారు. అయితే... అసలు విషయం చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచారు.
Also Read: బిగ్ బాస్ బ్యూటీపై ప్రెగ్నెన్సీ వార్తలు - వీడియో రిలీజ్ చేసిన శివజ్యోతి
గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. అప్పుడు లాక్ డౌన్ కావడంతో కొంత మందిని మాత్రమే పెళ్ళికి ఆహ్వానించారు. పెళ్లి తర్వాత నుంచి కాజల్ గర్భవతి అని వినిపించింది. అయితే... ఈ ఏడాది జనవరిలో తాను ప్రెగ్నెంట్ అని కాజల్ వెల్లడించారు. అయితే... బిడ్డ జన్మించిన విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. కానీ, పలువురు సినిమా తారలు కాజల్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రెగ్నెంట్ అయిన తర్వాత మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ, కాజల్ అగర్వాల్ కొన్ని వీడియోలు చేశారు. తనపై వచ్చిన విమర్శల పట్ల కూడా స్పందించారు. గర్భం దాల్చిన సమయంలో మహిళలు ధైర్యంగా ఉండాలని చెప్పారు.
Also Read: కీర్తీ సురేష్‌కు లోయర్ బ్యాక్ మజిల్ స్పాజమ్! ఇప్పుడు ఎలా ఉందంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)