Shiva Jyothi: బిగ్ బాస్ బ్యూటీపై ప్రెగ్నెన్సీ వార్తలు - వీడియో రిలీజ్ చేసిన శివజ్యోతి 

రీసెంట్ గా శివజ్యోతి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె మామిడి కాయలను తింటున్నట్లుగా పోజులిచ్చింది.

FOLLOW US: 

బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి.. ఆ తరువాత బిగ్ బాస్ షోకి వెళ్లి మంచి పాపులారిటీ దక్కించుకుంది. తన గేమ్ తీరుతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేది. అదే సమయంలో ప్రతిదానికి ఏడుస్తూ కాస్త ఇరిటేట్ చేసేది. బిగ్ బాస్ సీజన్ 3లో టాప్ 6 కంటెస్టెంట్ గా నిలిచింది శివజ్యోతి. ఆ తరువాత యూట్యూబ్ లో సొంతంగా ఛానెల్ ఓపెన్ చేసి పలు వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. 

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా శివజ్యోతి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె మామిడి కాయలను తింటున్నట్లుగా పోజులిచ్చింది. అది చూసిన కొందరు శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు పుట్టించారు. దీంతో ఆమె స్పందించక తప్పలేదు. ఓ ఈవెంట్ కు వెళ్తూ.. మామిడికాయతో ఫొటో పెట్టానని, అప్పటినుంచి ప్రెగ్నెంట్ అంటూ ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నారని చెప్పింది. 

వ్యూస్ కోసం కక్కుర్తి పడి ఇష్టమొచ్చినట్లుగా థంబ్‌నైల్స్‌ వేస్తున్నారని మండిపడింది. ఈ వార్తలు పెర్సనల్ గా, ప్రొఫెషనల్ గా తనపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్పింది. తనకు పెళ్లై చాలా ఏళ్లు అవుతుందని.. పిల్లల కోసం తనతో పాటు తన కుటుంబం కూడా ఎదురుచూస్తుందని చెప్పింది. తను ప్రెగ్నెంట్ అనే ఫేక్ న్యూస్ ఎమోషనల్ గా ఎంతో బాధపెడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. 

అంతేకాదు.. ఈ వార్త చూసి కొన్ని ఈవెంట్స్ చేయనేమోనని అనుకుంటున్నారని.. అలా వర్క్ ని కూడా దెబ్బ తీస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ వార్తల్లో తన ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని.. అందుకే వీడియో రిలీజ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రెగ్నెన్సీ అనేది తన జీవితంలో చాలా పెద్ద విషయమని.. దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దని తెలిపింది. 

Also Read: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్, ఈ వారం థియేటర్లు, ఓటీటీ విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసా?

Also Read: అమ్మాయిని కాపాడేందుకు అది కోసుకోవడానికి సిద్ధపడిన తండ్రి - 'జ‌యేష్‌భాయ్‌ జోర్దార్'

View this post on Instagram
 
A post shared by Shiva Jyothi (@iam.savithri)

Published at : 19 Apr 2022 04:00 PM (IST) Tags: Bigg Boss Bigg Boss season 3 Shiva Jyothi Shiva Jyothi Pregnancy news

సంబంధిత కథనాలు

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!