Keerthy Suresh: కీర్తీ సురేష్‌కు లోయర్ బ్యాక్ మజిల్ స్పాజమ్! ఇప్పుడు ఎలా ఉందంటే?
హీరోయిన్ కీర్తీ సురేష్‌కు ఓ సమస్య ఉంది. ఇప్పుడు ఆమెకు ఎలా ఉంది? ఏమిటి? అంటే...
హీరోయిన్ కీర్తీ సురేష్ (Keerthy Suresh) ఇటీవల ఓ షాప్ ప్రారంభోత్సవానికి అటెండ్ అయ్యారు. అలాగే, రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇస్తూ ఉన్నారు. అయితే... కొన్ని రోజులుగా ఆమె ఒక సమస్యతో బాధ పడ్డారు. అందువల్ల, యోగతో పాటు వర్కవుట్స్ వంటివి చేయలేకపోయారు. ఇంతకీ, ఆమె సమస్య ఏంటంటే...
కీర్తీ సురేష్ కొన్ని రోజులుగా లోయర్ బ్యాక్ మజిల్ స్పాజమ్ (Lower back muscle spasm)తో ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని ఆమె తెలియజేశారు. అయితే, ఇప్పుడు సమస్య లేదు. లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గిందని చెప్పుకొచ్చారు. మళ్ళీ యోగ చేయడం గొప్పగా అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.
Also Read: అమ్మాయిని కాపాడేందుకు అది కోసుకోవడానికి సిద్ధపడిన తండ్రి - 'జయేష్‌భాయ్ జోర్దార్'
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata Movie) సినిమాలో కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. 'భోళా శంకర్' (Bhola Shankar Movie) సినిమాలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చెల్లెలి పాత్ర చేస్తున్నారు. 'దసరా' (Dasara Movie) లో నాని (Nani) కి జోడీగా నటిస్తున్నారు. రెండు మూడు తమిళ, మలయాళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.