Premante Idera: 'ప్రేమంటే ఇదేరా'లో ఫస్ట్ అనుకున్నది ఐశ్వర్యనా? మరి ప్రీతి జింటా ఎలా వచ్చింది?
Aishwarya Rai - Preity Zinta: విక్టరీ వెంకటేష్ హిట్ సినిమాల్లో 'ప్రేమంటే ఇదేరా' ఒకటి. అందులో ప్రీతి జింటా హీరోయిన్. అయితే ఆమెకు ముందు ఐశ్వర్య రాయ్ ను అనుకున్నారట. మరి ప్రీతి ఎలా వచ్చిందో తెలుసా?

విక్టరీ వెంకటేష్ వరుసగా సూపర్ హిట్లు కొడుతున్న రోజులవి. అలాంటి సమయంలో తనతో 'ప్రేమించుకుందాం రా 'లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు జయంతి సి. పరాంజీ తో కలిసి చేసిన మరో సినిమా 'ప్రేమతో రా'. ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల అందించిన మ్యూజిక్ యువతరాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాతోనే 'లిరిల్ గర్ల్' ప్రీతి జింటా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నిజానికి ఈ సినిమాకి మొదట హీరోయిన్ గా అనుకున్నది 'ఐశ్వర్య రాయ్'ను అని చాలా మందికి తెలియదు. మరి 'ప్రపంచ సుందరి'ని పక్కన పెట్టి మరీ 'లిరిల్ గర్ల్'గా పేరుబడ్డ ప్రీతి జింటా వైపే ఎందుకు మేకర్స్ మొగ్గు చూపారు అనేదానిపై దర్శకుడు జయంత్ ఒక ఇంటర్వూ లో భలే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
కథ విని ఒప్పేసుకున్న ఐశ్వర్య... కానీ
రచయిత దీనరాజు చెప్పిన కథ నచ్చిన దర్శకుడు జయంత్ ని పిలిపించి సినిమాకి రంగం సిద్ధం చేశారు వెంకటేష్. నిర్మాతలు అశోక్ కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రొడ్యూస్ చేశారు. కథలో కీలకమైన హీరోయిన్ పాత్రకు ఒక ఫ్రెష్ లుక్ ఉండాలని జయంత్ భావించారు. దానికి అప్పటికే ప్రపంచ సుందరిగా పేరు పొందిన ఐశ్వర్య రాయ్ ను తన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేయాలని ఆయన చాలా ప్రయత్నించారు. ఐశ్వర్యరాయ్ కూడా ఈ కథ వినగానే వెంటనే ఓకే చెప్పేసింది. అయితే నిర్మాతల రూపంలో మాత్రం ఒక చిన్న అడ్డంకి ఏర్పడింది. జయంత్ చెప్పిన వివరాల ప్రకారం...
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి ఐశ్వర్య రాయ్ తెలుగు ఎంట్రీ అప్పట్లో అడ్డుపడ్డాయి. ఐశ్వర్య హీరోయిన్ గా అప్పటికి రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఒకటి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇరువర్'. ఇంకొకటి హిందీలో ' ఔర్ ప్యార్ హోగయా'. తమిళ్ లో 'ఇరువర్'కి క్లాసిక్ అని పేరు వచ్చినా తెలుగులో (ఇద్దరు ) మాత్రం డిజాస్టర్ అయింది. ఔర్ ప్యార్ హోగయా అయితే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా జనాలకి తెలియలేదు. దానితో ఐశ్వర్య రాయ్ ఐరన్ లెగ్ అని ముద్ర పడింది. దానితో ఆమెను తెలుగు సినిమాలో తీసుకోవడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడ్డట్టు జయంత్ తెలిపారు. నిజానికి అప్పటికి ఐశ్వర్యారాయ్ డైరెక్టర్ శంకర్ తో 'జీన్స్' సినిమా చేస్తోంది. కానీ ఆమెను 'ప్రేమంటే ఇదేరా' సినిమాలో తీసుకుందాం అనుకునే టైమ్ కి 'జీన్స్' రిలీజ్ కాలేదు. తాను తీవ్రంగా ఐశ్వర్య కోసం ప్రయత్నించినా చివరికి వర్కౌట్ కాకపోవడంతో మరో 15- 20 మంది మోడల్స్ ను ఆడిషన్ చేశామని కానీ ఎవరూ నచ్చలేదని జయంత్ అన్నారు.
Also Read: Ram Charan: దేవిని పక్కన పెట్టిన సుక్కు... రామ్ చరణ్ కోసం కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్?
అనిల్ కపూర్ రిఫరెన్స్ తో ప్రీతి జింటా ఎంట్రీ
యాడ్ ఫిలిం డైరెక్టర్ గా చాలా మంచి పేరు ఉన్న జయంత్ పరాంజీ కి బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మందితో మంచి ర్యాపో ఉంది. అలాంటి వారిలో స్టార్ హీరో అనిల్ కపూర్ ఒకరు. జయంత్ కి ఎదురైన హీరోయిన్ సమస్య గురించి విన్న ఆయన అప్పటికే 'లిరిల్ సోప్ 'యాడ్ తో దేశవ్యాప్తంగా సంచలనమైన ప్రీతి జింటా గురించి తెలిపారు. అప్పటికామె మణిరత్నం సినిమా 'దిల్ సే'లో సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. ముంబైలో ఆమెను కలిసి మాట్లాడిన తర్వాత తన సినిమాకు ప్రీతి నే కరెక్ట్ అని భావించి షూటింగ్ కి వెళ్ళిపోయారు జయంత్. 30 అక్టోబర్ 1998లో రిలీజ్ అయిన 'ప్రేమంటే ఇదేరా' చాలా పెద్ద హిట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగులకి ఇదే తొలి సినిమా. అప్పట్లో ఈ సినిమా పాటలన్నీ పెద్ద హిట్. అలాగే ఈ సినిమాలో వెంకటేష్ వేసిన డ్రెస్ లన్నీ కొత్త ట్రెండ్ సృష్టించాయి. ప్రీతి జింటా కూడా యూత్ కి బాగా నచ్చేయడంతో ఆ తరువాతి సంవత్సరమే మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'రాజకుమారుడు' సినిమాలో హీరోయిన్ గా ఆమెనే ఎంచుకున్నారు దర్శకుడు కే రాఘవేంద్రరావు.
Photo Gallery: Ramya Pasupuleti: జూనియర్ మిల్కీ బ్యూటీ... తెలుగమ్మాయ్ రమ్య పసుపులేటి మార్చి ఫోటో డంప్ చూశారా?
జయంత్ next మూవీలో ఐశ్వర్య స్పెషల్ సాంగ్!'ప్రేమంటే ఇదేరా' తరువాత అక్కినేని నాగార్జునతో 'రావోయి చందమామ'ను డైరెక్ట్ చేశారు జయంత్. ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయాలని ఐశ్వర్యా రాయ్ ని అడగ్గానే గత విషయాలు ఏవీ మనసులో పెట్టుకోకుండా ఆమె యాడ్ చేసి వెళ్లారని జయంత్ తెలిపారు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా మ్యూజికల్ గా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. 2017లో వచ్చిన 'జయదేవ్' తర్వాత ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు జయంత్. ఆయన తీసింది కొన్ని సినిమాలే అయినా వాటిలో చాలా వరకూ పెద్ద హిట్లు, పెద్ద హీరోల సినిమాలు కావడం విశేషం. ముఖ్యంగా ఆయన సినిమాల్లో మ్యూజిక్, సినిమాటోగ్రఫీకి ఎప్పుడూ మంచి మార్కులే పడుతూ వచ్చాయి. టాలీవుడ్ ప్రేక్షకులు కం బ్యాక్ కోసం ఎదురుచూసే డైరెక్టర్లలో జయంత్ సి పరాంజీ కూడా ఒకరు.
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
ట్రెండింగ్ వార్తలు






















