అన్వేషించండి

Madhavi Latha : పిల్లోడు దొరకలేదని మా అమ్మానాన్న నీ కాళ్ళు పట్టుకున్నారా? - పెళ్లి వార్తలపై హీరోయిన్ ఫైర్

పెళ్లి వార్తలపై నటి మాధవీ లత ఘాటుగా స్పందించింది. నాకు తెలీకుండా నా పెళ్లి అవుతుందా? నాకు ఏజ్ అయిపోతే పిల్లోడు దొరకలే అని మా అమ్మానాన్న నీ కాళ్ళు పట్టుకున్నారా? అంటూ ఫైర్ అయింది. 

తెలుగు హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'నచ్చావులే', 'స్నేహితుడా' వంటి సినిమాతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సినీ రాజకీయ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తనకు నచ్చని విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్తుంటుంది. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే మాధవి.. తనను కించపరిచేలా న్యూస్ రాశారంటూ ఓ వెబ్ పోర్టల్ పై విరుచుకుపడింది. తన గురించి ఎలాంటి గాసిప్‌లు వచ్చినా పట్టించుకోననని.. తనను అవమానించేలా వార్త రాసినందుకునే హర్ట్ అయ్యానని పేర్కొంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. 

మాధవీ లత త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, ఆమెకు కాబోయే భర్త కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాడని కొన్ని వెబ్ సైట్స్ లో కథనాలు వచ్చాయి. వీటిల్లో ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి, రాజకీయాల్లోకి వెళ్లడం గురించి ప్రస్తావించారు. దీనిపై మాధవి సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఘాటు వ్యాఖ్యలు చేసింది. 'నాకు తెలీకుండా నా పెళ్లి అవుతుందా? ఎవడురా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వెధవ' అంటూ పౌరుష పదజాలంతో దూషించింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం గురించి మాట్లాడుతూ.. ''ఓడిపోవడం నేరం కాదు, అందులో కూడా నీలాంటి నీతి లేని ముండలే ఉంటారుగా. నాలాంటి నిక్కచ్చిగా ఉన్నవాళ్లు బతకలేరు'' అని తెలిపింది. 

''నాకు ఆఫర్స్ లేవు అన్నం పెట్టు అని నిన్ను అడిగానా? నేను పుట్టుకతో యువరాణి. ఎక్కడుకున్న యువరాణి.. నీలాంటి యదవలని అడుక్కునే రోజు నా కృష్ణుడు నాకు ఇవ్వడులే. నీలాంటి నికృష్టులకి నన్ను దిగజార్చే అవకాశం ఇవ్వడు'' అని మాధవీ లత తన పోస్ట్ లో పేర్కొంది. తాను ఫెయిల్యూర్ ఐతే 2008-2023 వరకు తన మీద న్యూస్ రాయలేదని.. ఇప్పుడు రాస్తున్నారంటే తాను సక్సెస్ అయినట్లేనని తెలిపింది. ఇప్పటికి అన్నిటికి సరే అంటే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. డబ్బులు నిండుగా ఉంటాయని రాసుకొచ్చింది. తన గురించి మొత్తం వెటకారంగా తక్కువ చేసి రాసారని, రాసేది సరిగా రాయాలని సూచించింది. 

Also Read: విశ్వక్ సేన్ 'నో' చెప్పిన విధానం నచ్చలేదు.. వివాదంపై నోరువిప్పిన 'బేబీ' డైరెక్టర్!

పెళ్లి గురించి రాస్తే అది అబద్దమైనా, అబ్బా అనిపించేలా రాయాలి కానీ.. మూవీస్ చేసింది పాలిటిక్స్ చేసింది, గతిలేక పెళ్లి చేస్కుంటుంది అంటూ అంతలా దిగజార్చి వార్త రాయడం ఎందుకని మాధవీలత ప్రశ్నించింది. ''నాకు ఏజ్ అయిపోతే మా అమ్మానాన్న నీ కాళ్ళు పట్టుకున్నారా పిల్లోడు దొరకలే అని?? పిల్లోడు దొరక్క ఏజ్ అవలేదురా. నాకు నచ్చలేదు కనుక చేస్కోలే. కళ్యాణం నువ్ అనుకుంటే అయ్యేది ఆగేది కాదు. నాకు నచ్చాలి'' అంటూ  ఫైర్ అయింది.

''నా క్యారెక్టర్ తక్కువగా మాట్లాడావ్. నా కెరీర్ తక్కువగా మాట్లాడావ్. నా ఏజ్ మీద తప్పుగా షేమింగ్ గా రాసావ్. న్యూస్ రాయి న్యూసెన్స్ రాయకు. పద్దతిగా రాయి పందిలా చేయకు'' అంటూ కొన్ని అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించింది మాధవి లత. 'ష్.. మధు ఈమధ్య కోపం ఎక్కువైంది నీకు.. కంట్రోల్ కంట్రోల్' అంటూ కాస్త వ్యగ్యంగా రాసుకొచ్చింది. పనిలో పనిగా పోస్ట్ కింద కామెంట్లు పెట్టే నెటిజన్లకు కూడా వార్నింగ్ ఇచ్చింది. 

''కామెంట్స్ లో నీతి లేని రాతలు రాసే వీధి కుక్కలకు చెప్తున్నా.. పెళ్లి అంటే నేను అనుకుంటే అయ్యేది. నువ్ అనుకుంటే ఆగేది కాదు. పెళ్లి పుట్టుక చావు.. ఈ మూడు మనిషి చేతిలో ఉన్నాయ్ అనుకుంటారు. అది పిచ్చి భ్రమ. అలా ఐతే లైఫ్ లో ఏ లవర్స్ కూడా విడిపోరు.. మొగుడు పెళ్ళాం విడిపోరు. అదంతా ఫేట్ అని తెలుసుకోండి. మన చేతుల్లో ఉంది అనుకుంటే, మీ అంత మూర్ఖపు ముండలు ఎవరూ ఉండరు. నాకు పెళ్లి కాకపోతే దేశానికి నష్టం లేదు. మీరు నష్టంగా ఫీల్ ఐతే 10 చేస్కోండి. నాకేంది రోజూ ఈ గోల
సోది... నాకెవడు దొరకకపోతే, సంతోషం ఒక మగవాడి జీవితం సేఫ్ జోన్ లో ఉన్నట్లు ఫీల్ అవ్వండి. నాకు మగ జాతి మీద జాలీ దయ ఎక్కువ. ఎందుకే చేస్కోలేదు'' అంటూ మాధవీ లత హిత బోధ చేసింది. 

పెళ్లి వార్తలతో మాధవీ లత బాగా హర్ట్ అయినట్లు ఆమె పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికీ అన్నిటికి సరే అంటే అవకాశాలు మెండుగా ఉన్నాయని అనడంపైనా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మాధవి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తుంటే, మరికొందరు మాత్రం సెటైర్స్ వేస్తున్నారు. 

కాగా, 'అతిథి' సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన తెలుగమ్మాయి మాధవీలత.. 'నచ్చావులే' మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత 'స్నేహితుడు' 'అరవింద్ 2' లాంటి అడపాదడపా సినిమాల్లో నటించినా, ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. చివరగా ఆమె 'మదురై మణికురవర్' అనే తమిళ్ చిత్రంలో కనిపించింది. సినిమాలు తగ్గించిన తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీ లత.. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయింది.

Also Read: క్రేజీ అప్డేట్స్‌తో రాబోతున్న స్టార్ హీరోలు, ఈ నెల ఫ్యాన్స్‌కు పండగే పండగ!


Madhavi Latha : పిల్లోడు దొరకలేదని మా అమ్మానాన్న నీ కాళ్ళు పట్టుకున్నారా? - పెళ్లి వార్తలపై హీరోయిన్ ఫైర్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget