అన్వేషించండి

Vishwak Sen Vs Sai Rajesh: విశ్వక్ సేన్ 'నో' చెప్పిన విధానం నచ్చలేదు, ఆ వివాదంపై కీలక విషయాలు చెప్పిన 'బేబీ' డైరెక్టర్!

హీరో విశ్వ‌క్‌ సేన్‌ తో వివాదంపై 'బేబీ' డైరెక్ట‌ర్ సాయిరాజేష్ స్పందించారు. విశ్వక్ మీద తనకేమీ కోపం లేదని, ఆయన 'నో' చెప్పిన విధానం మాత్రం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అన్నాడు.

'బేబీ' సినిమా విషయంలో టాలీవుడ్ విశ్వక్ సేన్ - దర్శకుడు సాయిరాజేష్ మధ్య వివాదం నెలకొంది. ఒక హీరో బేబీ కథ వినడానికి కూడా ఇష్టపడలేదని.. ఆ డైరెక్టర్ అయితే స్క్రిప్ట్ వినాల్సిన అవసరం లేదని తిరస్కరించాడని రాజేష్ చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై విశ్వక్ పరోక్షంగా స్పందించడం దీనికి ఆజ్యం పోసినట్లయింది. గత కొన్ని రోజులుగా ఈ గొడవపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, దీనిపై తాజాగా సాయిరాజేష్ స్పందించాడు.

సాయిరాజేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ కు కథ చెప్పాలనుకున్న మాట వాస్తవమేనని, అతను కథ వినలేదని తెలిపారు. తాను నేరుగా విశ్వక్ తో మాట్లాడలేదు కానీ.. గీతా ఆర్ట్స్ వారు సంప్రదించారని చెప్పారు. ''ఇటీవల ఓ ఈవెంట్ లో విశ్వక్ తన బిజీ షెడ్యూల్ కారణంగా నో చెప్పాను. మీరు ఇప్పుడు హిట్ కొట్టారు కాబట్టి సక్సెస్ ను ఎంజాయ్ చెయ్యండి కానీ అవతలి వాళ్ళను ఇన్సల్ట్ చెయ్యొద్దు అన్నాడు. ఏరోజు కూడా నేను విశ్వక్ సేన్ పేరు చెప్పలేదు. ఆయన పేరు ఎక్కడా బయట పెట్టలేదు. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆ హీరో విశ్వక్ సేన్ కాదని చెప్పాను. నేను ఆ విషయాన్ని కాంట్రవర్సీ చేయదల్చుకోలేదు'' అని అన్నారు. 

''బేసిక్ గా 'నో' చెప్పిన విధానం నాకు నచ్చలేదు. విశ్వక్ ఇలా అన్నాడు.. వేరే ఆప్సన్ కు వెళ్లిపోండి అని గీతా ఆర్ట్స్ వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పేసరికి బాధేసింది. ఇండస్ట్రీలో 1200 మంది దర్శకులకు స్టార్ హీరోలను పక్కన పెడితే పదో పదిహేను మందో హీరోలు మాత్రమే ఉన్నారు. 'హృదయ కాలేయం' లాంటి సినిమా తీసిన నాలాంటి డైరెక్టర్ లేదా మరేదైనా ప్లాప్ మూవీ తీసిన దర్శకుడో చాలా ఆకలి మీద ఉంటారు.. పెయిన్ తో ఉంటారు. తమని తాము ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే హీరోల రిజెక్ష‌న్ అనేది రెస్పెక్ట‌బుల్‌ గా ఉంటే బాగుంటుంద‌ని నేను ఫీల్ అవుతాను. ఒక్క ప్లాప్ తో ఒకరి ప్రతిభను జడ్జ్ చేస్తే, ఈరోజు మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడు ఉండేవారు కాదు'' అని 'బేబీ' దర్శకుడు అన్నారు. 

Also Read: ఎంత పనిచేసావ్ 'బ్రో' - రొమాంటిక్ బ్యూటీకి మళ్ళీ నిరాశే మిగిలిందా?

ఇంకా మాట్లాడుతూ.. ''ఏదైతేనేం నాకు మంచే జరిగింది. విశ్వక్ సేన్ ఎందుకు అలా అనుంటారని నేను అర్థం చేసుకోగలను. తన ప్రయారిటీ లిస్టులో నేను ఉండకపోవచ్చు. ఆనంద్ దేవరకొండ నన్ను నమ్మి ఎలా ఛాన్స్ ఇచ్చాడు అనేది చెప్పానే తప్ప, నేను ఏరోజూ విశ్వక్ ను ఇన్సల్ట్ చేయలేదు. అసలు విశ్వక్ సేన్ ను నాకు మధ్య గొడవేమీ లేదు. వాట్సాప్ గ్రూప్ లో కూడా మాట్లాడుకున్నాం. ఒక పార్టీకి వెళ్ళినప్పుడు 'బేబీ' ఫస్ట్ సాంగ్ అదరగొట్టిందని విశ్వక్ నాతో అన్నాడు. తన మైండ్ లో కూడా ఎలాంటి థాట్స్ లేవు. కానీ నేను ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ మాట అనడం వల్ల, మీమ్స్ పేజెస్ లో ఏదోదో వచ్చింది. ఆ తర్వాత విశ్వక్ ట్వీట్ వేయడం వల్ల ఇలా అయింది. ఏదేమైనా ఇదంతా జరిగి ఉండకూడదని నేను ఫీల్ అవుతున్నాను'' అని తెలిపారు.

''విశ్వక్ ఫస్ట్ సినిమా 'వెళ్ళిపోమాకే' ట్రైలర్ విపరీతంగా నచ్చి, నేనూ దిల్ రాజు అసిస్టెంట్ హరి కలిసి ఆ చిత్రాన్ని అల్లు అరవింద్, దిల్ రాజు వద్దకు తీసుకెళ్ళాం. ఆ సినిమా సెన్సార్ ఫస్ట్ కాఫీలో నాకు, హరి మరియు కత్తి మహేశ్ కు థ్యాంక్స్ కార్డ్స్ కూడా ఉంటాయి. డైరెక్టర్ దగ్గర ఒక్క రూపాయి కూడా లేక ఆ సినిమా ఆగిపోయింది. ట్రైలర్ బాగా నచ్చి దాన్ని ఎలాగోలా బయటపడేయాలని ప్రయత్నం చేసాం. ఈ విషయం విశ్వక్ సేన్ కు కూడా తెలియదు'' అని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు. 

విశ్వక్ సేన్ Vs సాయి రాజేష్ వివాదం ఏంటంటే..

'బేబీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఒక హీరో ఈ కథ వినడానికి కూడా ఇష్టపడలేదు. ఆ డైరెక్టర్ అయితే స్టోరీ కూడా వినాల్సిన అవసరం లేదని తిరస్కరించాడు. నా బెస్ట్ చూపించాలని ఆరోజు ఫిక్స్ అయ్యాను అని అన్నాడు. దీనికి విశ్వక్ సేన్ ఇన్ డైరెక్ట్ గా స్పందిస్తూ 'నో మీన్స్ నో. అది మగాళ్లకు కూడా వర్తిస్తుంది. మనం ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతున్నాం. అరవకుండా ఎంజాయ్ చేయండి' అని ట్వీట్ చేశాడు. దీంతో ఆ హీరో విశ్వక్ అని అందరికీ అర్థమైంది. 

ఈ క్రమంలో 'బేబీ' సక్సెస్ మీట్ లో హీరో అల్లు అర్జున్ కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. ఓ హీరో దగ్గరకు వెళ్లి కథ చెప్తానంటే వినకుండా పంపించేసారు. గంటలు గంటలు కూర్చోబెట్టడం కరెక్ట్ కాదని అయినా కూడా పట్టువదలకుండా, నిరాశపడకుండా సాయి రాజేష్ కథను నమ్మి సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు బన్నీ. దీంతో విశ్వక్ సేన్ పై ట్రోల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవ‌లే ఓ సినిమా ఈవెంట్ లో విశ్వక్ మాట్లాడుతూ.. పెద్ద హీరోని కాకపోయినా కొన్నిసార్లు బిజీగా ఉంటాం. ఎదుటివారి టైం వేస్ట్ చెయ్యొద్దని కథలు వినలేమని చెప్తుంటాం. దానికి కూడా ఫీల్ అయితే నేనేం చేయలేను. ఎందుకంటే అంద‌రిని ఆనందంగా ఉంచేందుకు నేనేం బిర్యానీని కాదు అన్నారు. 

''మన సినిమా బాగా నడిస్తే తలెత్తుకోవాలి.. తప్పులేదు. ఒక చిన్న సినిమా పెద్ద హిట్ అయిందని అందరూ సంతోషించే విషయం అది. వాట్సాప్ గ్రూప్ లో దానికి నేను అభినందనలు కూడా చెప్పాను. ఆ సినిమా ట్రైలర్ బాగుందని మొట్టమొదట మెసేజ్ చేసిన వ్యక్తిని కూడా నేనే. ఒకరిని పిలిచి నో చెప్పి వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేయడం ఎందుకని, ముందే నో చెప్పాను. మన సినిమా బాగుందని అవతలి వాళ్ళని కొంచపరచకూడదు. అది బాధ అనిపించింది'' అన్నారు విశ్వక్ సేన్.

Also Read: ముస్లింల మౌనాన్ని పిరికితనం అనుకోవద్దు - జైపూర్ రైలు కాల్పులపై ‘పందెం కోడి’ నటుడు వ్యాఖ్యలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
Embed widget