News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ketika Sharma Bro Movie : ఎంత పనిచేసావ్ 'బ్రో' - రొమాంటిక్ బ్యూటీకి మళ్ళీ నిరాశే మిగిలిందా?

పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న అమ్మడికి నిరాశే ఎదురైందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

FOLLOW US: 
Share:

'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ.  అంతకు ముందు మోడలింగ్ చేసిన ఈ భామ, డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ కు జోడీగా నటించే అవకాశం అందుకుంది. ఏ మాత్రం హద్దులు పెట్టుకోకుండా, లిప్ లాక్ కిస్సింగ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. అయితే ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినప్పటికీ అమ్మడి అందాల ఆరబోతకు యువ హృదయాలు దాసోహం అన్నాయి. 

నిజానికి 'రొమాంటిక్' రిలీజ్ అవ్వకముందే నాగ శౌర్య సరసన 'లక్ష్య' సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది కేతికా. ఈ మూవీ కూడా ఆశించిన సక్సెస్ అందించలేకపోయింది. అలాంటి టైంలోనే యంగ్ బ్యూటీకి మెగా కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. అయితే ఈసారీ అమ్మడికి నిరాశే ఎదురైంది. మెగా మేనల్లుడి రొమాంటిక్ ఎంటర్టైనర్ డిజాస్టర్ గా మిగిలింది. 

ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కేతిక శర్మ, దురదృష్టవశాత్తూ హ్యాట్రిక్ డిజాస్టర్‌లు అందుకోవాల్సి వచ్చింది. వరుసగా మూడు ప్లాపులు పడటంతో అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. అప్పుడే 'బ్రో' సినిమాలో సాయి ధరమ్ తేజ్ ప్రేయసిగా నటించే అవకాశం అమ్మడిని వెతుక్కుంటూ వచ్చింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో లీడ్ రోల్ ప్లే చేసారనే సంగతి తెలిసిందే. 

Also Read: తమిళ దర్శకులతో పవన్ కళ్యాణ్ - హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ ఉన్నాయి బ్రో!

'బ్రో' అనేది కేతికకు ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్. ఆమె ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం పవన్‌ కల్యాణ్‌. ఆయన పేరు వినగానే ఇంకేమీ ఆలోచించకుండా ఓకే చేశానని స్వయంగా తెలిపింది. తనది నటనకి ఆస్కారం ఉన్న కీలకమైన పాత్ర అని చెప్పింది. మేనమామ మేనల్లుడు తొలిసారి కలిసి నటిస్తున్న మెగా మూవీ కావడం, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి అగ్ర దర్శకుడు భాగమైన సినిమా అవ్వడంతో.. ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. తీరా మూవీ రిలీజ్ అయ్యాక, ఇది కుర్ర భామకు ఏవిధంగానూ ఉపయోగపడేలా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న కేతిక శర్మ.. 'బో' సినిమా తన కెరీర్ కు బూస్ట్ లా పనిచేస్తుందని భావించింది. కానీ మూవీలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఫస్ట్ హాఫ్‌లో సాయి తేజ్ తో లవ్ ట్రాక్‌ తో పాటుగా ఒక పాటలో కనిపించింది. ఇక సెకండాఫ్‌లో దర్శకుడు కేతిక క్యారక్టర్ ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. దీంతో మెగా ప్రాజెక్ట్ లో నటించే అవకాశం వచ్చిందని సంతోషపడిన ఈ బ్యూటీకి, మరోసారి లక్ కలిసి రాలేదు. 

కేతిక శర్మ ఇటీవలే ఆహా స్టూడియోస్‌లో ఓ ప్రాజెక్ట్‌ సైన్ చేసిందని సమాచారం. ప్రస్తుతానికైతే ఇదొక్కటే ఆమె చేతిలో ఉంది. స్వతహాగా స్విమ్మర్‌ అయిన ఈ హాట్ భామ.. స్విమ్మింగ్‌ నేపథ్యంలో అవకాశం వస్తే నటించాలని ఆశ పడుతోంది. అలానే బయోపిక్స్ లో నటించాలని కోరుకుంటోంది. మరి రానున్న రోజుల్లో రొమాంటిక్ బ్యూటీకి అలాంటి ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. 

ఇక 'బ్రో సినిమా విషయానికొస్తే, గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సూపర్ నేచురల్ ఫాంటసీ డ్రామాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. నాలుగో రోజే బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫైనల్ రన్ ముగిసే నాటికి ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి. 

Also Read: డిసెంబర్‌లో ఈసారి తగ్గేదేలే.. బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్న క్రేజీ చిత్రాలు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 01 Aug 2023 07:56 PM (IST) Tags: tollywood heroines Sai Dharam Tej actress ketika sharma ketika PKSDT BRO Movie Romantic Heroine

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !