Sivaji Comments : 'అందం సామాన్లు కనిపించే దానిలో ఉండదు' - హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ సెన్సేషనల్ కామెంట్స్
Sivjai : హీరోయిన్లకు చీర కట్టులోనే అందం ఉంటుందని.. వారు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలని సీనియర్ హీరో శివాజీ అన్నారు. గ్లామర్ అనేది ఓ దశ వరకే ఉండాలని చెప్పారు.

Actor Sivaji Comments About Heroines : హీరోయిన్ల అందం చీరలో, వారు నిండుగా కప్పుకొనే బట్టల్లో ఉంటుందని హీరో శివాజీ అన్నారు. 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'సామాను కనపడే దాంట్లో ఉండదు'
హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలని అన్నారు శివాజీ. ఈ ఈవెంట్‌లో యాంకర్ డ్రెస్ సెన్స్ బాగుందని చెప్పారు. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. అనుకున్నా పోయేదేం లేదు. అందం చీరలో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనపడే దాంట్లో ఏమీ ఉండదు. అవి వేసుకున్నప్పుడు చాలా మంది చూసి నవ్వుతారు. కానీ దరిద్రపు ము****, ఇలాంటి బట్టలెందుకు వేసుకుంది. కాస్త మంచివి వేసుకోవచ్చుగా. బాగుంటావ్ కదా అని అనాలనిపిస్తుంది లోపల. అనలేం.
అంటే మళ్లీ స్త్రీ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ లేదా అంటారు. స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఓ సావిత్రి కానీ సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్‌లో రష్మిక ఇలా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీరందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ ఓ దశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. అది కోల్పోవద్దు. మన వేష, భాషల నుంచే మన గౌరవం పెరుగుతుంది. ప్రపంచ వేదికల మీదైనా చీర కట్టుకున్న వారికే విశ్వ సుందరి కిరీటాలు వచ్చాయి.' అంటూ కామెంట్స్ చేశారు.
Heroines eey Battalu Padithe Aa Battalu Esukokandi. Cheeralone Andham, Gouravam Vundhi. Samanlu Kanipinche battalo kaadhu
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 22, 2025
- #Sivaji at #Dhandoraa Pre Release
pic.twitter.com/ACriYpvhxd
Also Read : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
శివాజీ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన కామెంట్స్ సపోర్ట్ చేస్తుండగా... మరికొందరు విమర్శిస్తున్నారు. సామాన్లు, దరిద్రపు ము***** అనే పదాలు వాడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై తన అభిప్రాయం చెప్పాలంటే మామూలుగా అయినా చెప్పొచ్చని ఇలాంటి పదాలు వాడడం సరికాదని అంటున్నారు.
శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన సోషల్ ఓరియెంటెడ్ మూవీ 'దండోరా'. ఈ మూవీకి మురళీ కాంత్ దర్శకత్వం వహించగా... కలర్ ఫోటో, బెదురులంక 2012 మూవీస్ నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మించారు. సమాజంలో అసమానతలు, కులం అనే సెన్సిటివ్ అంశాన్ని టచ్ చేస్తూ మూవీని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేస్తుండగా క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















