అన్వేషించండి

Director B Gopal: బాలయ్య డూప్ లేకుండా చేసేవారు, మోక్షజ్ఞ తండ్రికి మించిన కొడుకు అవుతాడు - డైరెక్టర్ బి గోపాల్

Director B Gopal: బి గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ దర్శకుడు.. బాలయ్యపై, మోక్షజ్ఞపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Director B Gopal About Balakrishna And Mokshagna: టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు ఎంతోమంది ఉన్నా వారిలో ఫ్యాక్షనిజం అనే కాన్సెప్ట్‌తో సినిమాలు తీసి బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ సాధించిన హీరో బాలకృష్ణ మాత్రమే. బాలకృష్ణతో అలాంటి జోనర్‌లో సినిమాలు చేస్తూ పలువురు దర్శకులు, నిర్మాతలు మంచి సక్సెస్‌ను అందుకున్నారు. అందులో డైరెక్టర్ బి గోపాల్ కూడా ఒకరు. బి గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్ ఇప్పటికీ క్లాసిక్‌గా నిలిచిపోయింది. తాజాగా ఆయన పాల్గొన్న ఇంటర్వ్యూలో బాలయ్యతో గురించి గొప్పగా మాట్లాడుతూ.. ఆయన వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బి గోపాల్.

బంగారుకొండ బాలయ్య..

‘‘బాలయ్య బాబు ఒక అద్భుతం. ఆయన ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే ఒక గొప్ప అనుభూతిలాగా అనిపిస్తోంది. 109 సినిమాలు పూర్తి చేయడం చాలా గొప్ప విషయం. 110వ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగస్ట్ 30కు 50 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఆయన లెగసీ కంటిన్యూ అవ్వాలి, గొప్ప గొప్ప సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. బాలయ్య బాబు ఎప్పుడూ మనస్ఫూర్తిగా చేశారు. నిర్మాతలు అందరూ బాగుండాలి అని కోరుకునే బంగారుకొండ. మంచి మనసున్న వ్యక్తి’’ అంటూ బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు బి గోపాల్. తన వారసుడు మోక్షజ్ఞ తేజ గురించి కూడా ఆయన మాట్లాడారు.

బాలయ్యను మించిపోవాలి..

‘‘మోక్షజ్ఞ అద్భుతంగా ఉన్నాడు. కళ్లజోడు, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్.. అన్నీ చాలా అందంగా ఉన్నాయి. ముందు నుంచి మోక్షజ్ఞ అందగాడే. తను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. షూటింగ్స్‌కు వచ్చేవాడు. సమరసింహారెడ్డికి రాత్రి సాంగ్ షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు మోక్షజ్ఞకు 4,5 ఏళ్లు ఉంటాయనుకుంటా. వచ్చి వాళ్ల నాన్న ఒడిలో కూర్చున్నాడు. అది తన ఆస్తి కాబట్టి ఆ కాళ్లు తీసుకొచ్చి బాలయ్య బాబు గుండెలపై పెట్టి ఏవో ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు. తనను చూపిస్తూ బాలయ్య ఎంతో ముచ్చటపడిపోయారు. చిన్నప్పటి నుంచి మోక్షజ్ఞ అంటే బాలయ్య బాబుకు ప్రాణం. మోక్షజ్ఞ చాలా పెద్ద హీరో అవుతాడు. బాలయ్య బాబును మించిపోయిన సక్సెస్ కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని మనసులోని మాటలను బయటపెట్టారు గోపాల్.

డూప్ లేకుండానే..

ఎన్‌టీఆర్ వారసుడు అయినా కూడా కష్టపడే గుణం బాలయ్యలో ఉందని ప్రశంసించారు బి గోపాల్. లంచ్ తర్వాత అరగంట పాటు రెస్ట్ తీసుకునే అలవాటు బాలకృష్ణకు ఉందని, అలాంటి సమయంలో కూడా క్యారవ్యాన్‌లోకి వెళ్లకుండా చెట్టు కింద మంచం వేస్తే అక్కడే పడుకునేవారని గుర్తుచేసుకున్నారు. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ సినిమాలోని ఒక సీన్‌ను గుర్తుచేసుకుంటూ.. ‘‘ఫస్ట్ ఫ్లోర్ నుంచి లారీపైకి దూకాలి. డూప్‌ను పెడతాను అన్నా వినలేదు. నేను చేస్తా అని చేసేశాడు. చేయాలని ఫిక్స్ అయితే చేసేస్తాడు. బోయపాటి సినిమాలో కూడా గ్లాస్ పగలగొట్టుకొని రావాలంటే డూప్ వద్దని ఆయనే చేశాడు’’ అంటూ బాలయ్య గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు గోపాల్.

Also Read: అనంత్ అంబానీ పెళ్ళిలో మెగా కపుల్ - ముఖేష్ అంబానీకి అభివాదం చేస్తున్న రామ్ చరణ్ ఫోటో వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget