News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

30 Years Prudhvi - Bhramara Movie : '30 ఇయర్స్' పృథ్వీతో డార్క్ క్రైమ్ కామెడీ - కొత్త సినిమా గురూ!

'30 ఇయర్స్' పృథ్వీ ప్రధాన పాత్రలో డార్క్ క్రైమ్ కామెడీ సినిమా 'భ్రమర' ప్రారంభమైంది.

FOLLOW US: 
Share:

'30 ఇయర్స్' పృథ్వీ తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించారు. నవ్విస్తూ ఉన్నారు. కొన్ని సినిమాల్లో  హీరోలతో సమానమైన పాత్రలు ఆయన పోషించారు. హీరో కంటే ఆయన కామెడీ హైలైట్ అయిన సినిమాలు ఉన్నాయి. బట్ ఫర్ ఏ ఛేంజ్... ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతోంది. పూజా కార్యక్రమాలతో బుధవారం ఆ సినిమా ప్రారంభమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

పృథ్వీ ప్రధాన పాత్రలో డార్క్ కామెడీ 'భ్రమర'   
సీనియర్ నటులు '30 ఇయర్స్' పృథ్వీ రాజ్, నిఖితా శ్రీ, 'పెళ్లి' ఫేమ్ పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో జీయంకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో రూపొందుతున్న సినిమా 'భ్రమర' (Bhramara Movie). టీవీ రవి నారాయణన్ దర్శకుడు. జి మురళీ కృష్ణ నిర్మాత. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కం వేణుగోపాల్ క్లాప్ ఇవ్వగా... తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ అనిల్ కుర్మచలం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి  రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం  వహించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రమిదని దర్శక నిర్మాతలు తెలిపారు.  

'భ్రమర' చిత్ర ప్రారంభోత్సవంలో దర్శకుడు టీవీ రవి నారాయణన్ మాట్లాడుతూ... ''డార్క్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రమిది. కథ వినగానే నచ్చిందని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు మురళీకృష్ణ గారు. తొలుత ఊటీ నేపథ్యంలో తీయాలని అనుకున్నా... ఢిల్లీ, కలకత్తా, చిక్ మంగుళూరు నేపథ్యంలో తీస్తున్నాం. సీనియర్ నటులు '30 ఇయర్స్' పృథ్వీరాజ్, 'పెళ్లి' ఫేమ్ పృథ్వీరాజ్... ఇద్దరూ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. వాళ్ళతో పాటు నిఖితా శ్రీ లీడ్ రోల్ చేస్తున్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా'' అని చెప్పారు. 

Also Read బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?  

'భ్రమర' సహ నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ... ''దర్శకుడు రవి నాకు బెస్ట్ ఫ్రెండ్. మంచి కాన్సెప్ట్ ఉన్న కథ చెప్పడంతో సినిమా తీద్దామని అనుకున్నా. మా నిర్మాత మురళీ కృష్ణ గారు మద్దతుగా రావడంతో సెట్స్ మీదకు సినిమా వెళుతోంది. ఈ ఏడాదిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. 

Also Read ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?

'30 ఇయర్స్' పృథ్వీ రాజ్, నిఖితా శ్రీ, 'పెళ్లి' ఫేమ్ పృథ్వీ రాజ్, 'రంగస్థలం' నాగ మహేష్, జయవాణి, 'జబర్దస్త్' అప్పారావు, ఆకెళ్ళ, మీసాల లక్ష్మణ్, మాణిక్యం, పసునూరి శ్రీనివాస్, దువ్వాసి మోహన్, టార్జాన్ తదితరులు నటిస్తున్న 'భ్రమర' చిత్రానికి కళా దర్శకత్వం : సుమిత్ పటేల్, కూర్పు : శివ బొడ్డు, మాటలు : బి. వెంకటేష్ కనక, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీ వాత్సవ్, సంగీతం : కార్తీక్ బి. కొడగండ్ల, సహ నిర్మాత :  కల్యాణ్ చక్రవర్తి, నిర్మాణ సంస్థ : జీయంకే ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత : జి. మురళీ కృష్ణ, దర్శకత్వం : టీవీ రవి నారాయణన్. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 21 Sep 2023 10:02 AM (IST) Tags: New Movie latest telugu news 30 Years Prudhvi Bhramara Movie Nikitha Sri

ఇవి కూడా చూడండి

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్

Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి