Atlee Movies - Heroine Death : ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?
Atlee Movies - Rare Similarity : అట్లీ దర్శకత్వం వహించిన సినిమాల సంఖ్య తక్కువ. కానీ, ఆయన సక్సెస్ రేట్ ఎక్కువ. అట్లీ సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే... హీరోయిన్ మర్డర్స్!
తమిళ దర్శకుడు అట్లీ (Atlee)కి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తొలి సినిమా 'రాజా రాణీ'తో పాటు విజయ్ హీరోగా తీసిన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించాయి. బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan) హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్'కు అయితే తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు ఎక్కువ.
కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా అట్లీ పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల సంఖ్య చాలా తక్కువ. కానీ, సక్సెస్ రేట్ మాత్రం ఎక్కువ. ఆ మాటకు వస్తే అన్నీ హిట్ సినిమాలే. ఆ సినిమాలు అన్నిటిలోనూ ఒక సిమిలారిటీ ఉంది. ఆయన తీసినవి అన్నీ కమర్షియల్ సినిమాలే! మరో కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? హీరోయిన్ మర్డర్స్!
'రాజా రాణీ'లో నజ్రియాకు యాక్సిడెంట్!
అట్లీ సినిమాల్లో హీరోయిన్ మరణించడం అనే కాన్సెప్ట్ ఆయన మొదటి సినిమా నుంచి మొదలైంది. 'రాజా రాణీ' గుర్తు ఉంది కదా? ఆ సినిమాలో హీరోయిన్ నజ్రియాకు యాక్సిడెంట్ అవుతుంది. కార్ మీద ఆమె పడే సన్నివేశం సిల్వర్ స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా మందికి ఒళ్ళు జలదరించింది. ఒక్కసారిగా షాక్ అయ్యారు.
'తెరి'లో సమంత... 'మెర్సల్'లో నిత్యా మీనన్!
అట్లీ దర్శకత్వం వహించిన రెండో సినిమా 'తెరి'. 'పోలీస్' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో హీరో విజయ్ ఇంటి మీద విలన్స్ ఎటాక్ చేసినప్పుడు తుపాకీ తూటాకు సమంత బలి అవుతారు. తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదలైన 'మెర్సల్'లో నిత్యా మీనన్ పాత్ర మరణిస్తుంది.
హీరోయిన్ చావలేదు కానీ విజయ్, అట్లీ కలయికలో వచ్చిన మూడో సినిమా 'బిగిల్' (తెలుగులో 'విజిల్' పేరుతో విడుదలైంది)లో తండ్రి పాత్రను చంపేశారు. అందులో విజయ్ డ్యూయల్ రోల్ చేశారు. ఇద్దరిలో సీనియర్ విజయ్ క్యారెక్టర్ మరణిస్తుంది.
ఇప్పుడు 'జవాన్'లో దీపికా పదుకోన్ వంతు!
అట్లీ తీసిన లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'జవాన్' (Jawan Movie)కి వస్తే... దీపికా పదుకోన్ పాత్రను చంపేశారు. ఇందులోనూ హీరోది డ్యూయల్ రోల్. షారుఖ్ ఖాన్ తండ్రి కుమారులుగా కనిపించారు. యంగ్ షారుఖ్ తల్లిగా, సీనియర్ షారుఖ్ భార్యగా దీపికా పదుకోన్ కనిపించారు. ఆమెది అతిథి పాత్ర కంటే కాస్త నిడివి ఎక్కువ ఉన్న రోల్. మరణంతో ఆ పాత్రకు ముగింపు పలికారు.
Also Read : 300 కోట్లు కాదు, అంత కంటే ఎక్కువే - ‘జవాన్‘ బడ్జెట్ ఎంతో రివీల్ చేసిన అట్లీ
కమర్షియల్ సినిమాల్లో కథానాయికల పాత్రలకు ట్రాజెడీ ఎండింగ్ ఇవ్వడం అట్లీ స్టైల్. కథకు, ప్రేక్షకులకు మధ్య ఎమోషనల్ కనెక్ట్ కోసం హీరోయిన్లను ఆయన చంపేస్తున్నారని అనుకోవాలి. 'జవాన్' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అట్లీ... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో ఎవరిని కథానాయికగా ఎంపిక చేస్తారో? మరణించే నాయికగా ఎవరు ఉంటారో? లెట్స్ వెయిట్ అండ్ సి. హీరోయిన్ క్యారెక్టర్ ఖతం అయ్యే కాన్సెప్ట్ కంటిన్యూ అవుతుందో? లేదో?
Also Read : నా ప్రతి కన్నీటి చుక్కకూ బాధ పడ్డారు, ఫ్యాన్స్‌కు పాదాభివందనం - 'సైమా'లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial