అన్వేషించండి

Chiranjeevi-Raja Ravindra: ఈడో పెద్ద దూలగాడు, ఆడ పిల్లలను అలా చూడకు దరిద్రంగా - రాజా రవీంద్రకు చిరంజీవి చురకలు

‘భోళా శంకర్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ లో ఆయన బిజీగా ఉన్నారు చిరంజీవి. తాజా ఇంటర్వ్యూలో నటుడు రాజా రవీంద్రపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపొందుతోంది. మిల్కీబ్యూటీ తమన్నా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయ్యింది.  

రాజా రవీంద్రపై చిరు హిలేరియస్ కామెంట్స్

తాజాగా చిత్రబృందంతో కలిసి చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో సినీ నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేశ్‌తో పాటు మూవీలో లీడ్ రోల్స్ చేసిన తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్, రాజా రవీంద్ర, యాంకర్ శ్రీముఖి, గెటప్ శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీముఖి రాజా రవీంద్ర గురించి చెప్పాలని అడిగింది. “నోటిదూల గాడు. మనసులో ఏం ఉండదు. బయటకు మాత్రం ఏదో ఒకటి వాగి, దొబ్బులు తింటుంటాడు. నన్ను చూస్తే చూశావయ్యా, ఆడపిల్లలను చూడకు. అంటే దరిద్రంగా అలాగే చూస్తాడు” అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అటు చిరంజీవితో తనది చాలా లాంగ్ జర్నీ అని చెప్పారు రాజా రవీంద్ర. “అన్నయ్యతో నాది లాంగ్ జర్నీ.  ఏ సినిమా చేసిన ఫస్ట్ డేలా ఉంటుంది. చాలాసార్లు తిట్లు కూడా తిన్న. నిజంగా అన్నయ్య పక్కనే ఉన్నానా? అని అప్పుడప్పుడూ చూస్తా. ఏంట్రా అలా చూస్తున్నావ్? చేతబడి చేసే వాడిలా ఆ చూపేంటి దరిద్రంగా. పో ఇక్కడి నుంచి అంటారు” అని చెప్పుకొచ్చారు.

‘భోళా శంకర్’ వరుస ఇంటర్వ్యూలు  

‘భోళా శంకర్’ టీమ్ మొత్తం అసలు విరామం లేకుండా సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. చిరంజీవి సైతం ఒకటి కూడా మిస్ అవ్వకుండా ప్రతీ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఇక దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్ సుంకర కూడా ‘భోళా శంకర్’ ప్రమోషన్స్ బాధ్యతను తమ భుజంపై వేసుకున్నారు. ప్రేక్షకులు ఎంత నెగిటివిటీ చూపించినా.. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినా.. మెహర్ మాత్రం తన సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని కచ్చితంగా చెప్తున్నాడు. ‘భోళా శంకర్’ మూవీలో అన్నా చెల్లెలి సెంటిమెంట్ అందరినీ ఆకట్టుకుంటుందన్నాడు. యాక్షన్, డ్రామా సహా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపాడు. చిరంజీవి సినిమా నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవన్నీ ఇందులో ఉన్నట్లు చెప్పాడు. పవన్ కల్యాణ్ మేనరిజంను చిరు ఇమిటేట్ చేయడం  ఫ్యాన్స్‌ కు మరింత ఊపునిస్తుందన్నాడు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

Read Also: సుమ షోలో షర్మిళపై పంచ్‌లు - సుదర్శన్ అంతమాట అనేశాడేంటి?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Embed widget