అన్వేషించండి

Suma Adda Latest Promo: సుమ షోలో షర్మిళపై పంచ్‌లు - సుదర్శన్ అంతమాట అనేశాడేంటి?

ఈవారం కూడా ‘సుమ అడ్డా’ కామెడీతో కిర్రాక్ పుట్టించనుంది. తాజా ఎపిసోడ్ లో అభి, సుజాత, విద్యుల్లేఖ, సుదర్శన్‌ పాల్గొన్నారు. సుదర్శన్ పంచులు, సుమ కౌంటర్లతో షో ఫన్నీ ఫన్నీగా కొనసాగింది.

ప్రతి శనివారం బుల్లితెర అభిమానలకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ పంచుతున్న షో ‘సుమ అడ్డా’. ఈ వారం ఎపిసోడ్‌ లో అభి, సుజాత, విద్యుల్లేఖ, సుదర్శన్‌ పాల్గొని సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల అయ్యింది. సుమకు అభి ఐస్ వేయడం, విద్యుల్లేఖ కలల గురించి చెప్పడం, సుదర్శన్ పెళ్లి చూపుల ముచ్చట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.

సుమకు ఐస్ వేసిన అభి

ప్రోమో ప్రారంభం కాగానే “మీరు గత కొద్ది కాలంగా హీరోయిన్ త్రిషలా కనిపిస్తున్నారు” అని చెప్తారు. అభి మాటలకు సుమ తెగ సిగ్గు పడుతుంది. “నువ్ ఎంత ఐస్ వేసినా పాయింట్ పాయింటే!” అంటూ విద్యుల్లేఖ అభికి కౌంటర్ ఇస్తుంది. సుమ స్పందిస్తూ, “ఆయన ఐస్ వేశాడు కాబట్టే నేను త్రిషలా కనిపిస్తున్నా” అంటుంది. “అనవసరంగా వేశానండీ” అని అభి అనడంతో అందరూ నవ్వుతారు. ఇక రాకేష్ పెళ్లికి ముందు సుజాతను చేసుకుంటున్నావా? అని అడిగితే అలాంటిదేమీ లేదు అని చెప్పాడన్నది. ఎప్పుడు అడిగినా ఇంట్రెస్ట్ లేదు, ఆ ఉద్దేశం లేదు అని చాలా సార్లు తనతో గట్టిగా చెప్పాడన్నది. అన్నిసార్లు చెప్పాడు కాబట్టే రాకేష్ మీద తనకు డౌట్ వచ్చిందటాడు సుదర్శన్.

సుదర్శన్ ఫన్నీ పెళ్లి చూపులు

ఇక సుదర్శన్ తన పెళ్లి చూపుల గురించి చెప్పిన కథ అందరినీ నవ్వుల్లో మునిగిపోయేలా చేసింది. “పెళ్లి చూపులు చూసి వచ్చాం. ఇప్పుడే కెరీర్ మొదలైంది, పెళ్లి ఇప్పుడే వద్దని నాన్నకు చెప్పాను. పెద్ద అందంగా ఉండవు. పెద్ద చదువు లేదు. సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయావు. నీకున్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది నా కొడుకుగా పుట్టడమే అని చెప్పాడు” అంటూ గుర్తు చేసుకున్నాడు. ఇక విద్యుల్లేఖ తన కలల గురించి చెప్పి అందరినీ నవ్వించింది. నీకు ఎలాంటి కలలు వస్తాయో చెప్పాలని సుమ అడగడంతో “నాకు ఆస్కార్ అవార్డు గెలిచినట్లు, హాలీవుడ్ కు వెళ్లినట్లు” కలలు వస్తాయని చెప్పింది. అయితే, నువ్వు నిద్రపోవద్దు అంటూ సుదర్శన్ ఆమెకు చెప్పడంతో షో అంతా నవ్వులతో నిండిపోయింది. ఇక ‘బావలు సయ్యా’ అనే పాటకు అభి, విద్యుల్లేఖ ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ అలరించారు.

‘సుమ అడ్డా’లో షర్మిళపై పంచ్ లు

ఇక స్టూడెంట్స్ గురించి సుమ మాట్లాడుతున్న సమయంలో “స్టూడెంట్స్ ను స్టూడెంట్స్ అని ఎందుకు అంటారో తెలుసా?” అని అభి అడుగుతాడు. వెంటనే సుజాత “వాళ్లు స్టూడెంట్స్ కాబట్టి” అంటూ షర్మిళ మాదిరి పంచ్ వేయడంతో అందరూ నవ్వుతారు. ఇక సుమ, సుజాత, విద్యుల్లేఖ ఫన్నీ కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.  సుమ ప్రశ్నలకు సుదర్శను చెప్పిన సమాధానాలు నవ్వుల పువ్వులు పూయించాయి. ‘సుమ అడ్డా’ పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 12న  ప్రసారం కానుంది.  

Read Also: దెయ్యాలకే క్లాసులు, ‘బేబీ’తో ఆటలు, చంద్రముఖి రచ్చ - నవ్వులు పూయిస్తున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ప్రోమో

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo 3: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో 3: రోహిత్‌ వర్సెస్‌ షాలిని, త్రిగుణ్! బాండ్‌ బ్రేక్‌ చేశారా? దద్దరిల్లిన హౌస్‌!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో 3: రోహిత్‌ వర్సెస్‌ షాలిని, త్రిగుణ్! బాండ్‌ బ్రేక్‌ చేశారా? దద్దరిల్లిన హౌస్‌!
Mayookha Telugu Trailer: ముక్కలుగా గుర్తు తెలియని శవం... ఊళ్ళో కోళ్లు మాయం... పాయల్ చెంగప్ప 'మయూఖ' ట్రైలర్ ఎలా ఉందంటే?
ముక్కలుగా గుర్తు తెలియని శవం... ఊళ్ళో కోళ్లు మాయం... పాయల్ చెంగప్ప 'మయూఖ' ట్రైలర్ ఎలా ఉందంటే?
Dorothy Controversy: ఎల్‌జీబీటీక్యూ యాంగిల్‌లో చూడొద్దు... కీర్తీ సురేష్ సినిమా క్లైమాక్స్‌ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్
ఎల్‌జీబీటీక్యూ యాంగిల్‌లో చూడొద్దు... కీర్తీ సురేష్ సినిమా క్లైమాక్స్‌ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: రెండు కత్తులు దక్కించుకునేదెవరు? కొట్టుకుంటున్న రెండు టీమ్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: రెండు కత్తులు దక్కించుకునేదెవరు? కొట్టుకుంటున్న రెండు టీమ్స్!

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget