Brahmamudi March 24th: వామ్మో రాహుల్ మామూలు కేటుగాడు కాదుగా - స్వప్నని చూసేసిన కావ్య
రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రాజ్, కావ్య రిసెప్షన్ లో జోకర్ షో హైలెట్ గా నిలవనుందని అంటారు. స్టేజ్ మీదకి వచ్చిన కనకం ఏం చేయాలో అర్థం కాక నిలబడి చూస్తూ ఉండేసరికి మీనాక్షి వచ్చి తన షర్ట్ లో ఐస్ ముక్కలు వేస్తుంది. ఇక డాన్స్ వేస్తూ అందరినీ నవ్విస్తుంది. అది చూసి కావ్య చాలా బాధపడుతుంది. కనకం పెర్ఫామెన్స్ చూసి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కనకం డాన్స్ చేస్తూ కిందపడిపోతే కావ్య ఎమోషనల్ అవుతుంది. రాజ్, కావ్య అన్న మాటలు తలుచుకుని కనకం కన్నీళ్ళు పెట్టుకుంటుంది. జోకర్ సాంగ్ అంటూ వేసి ఆ సీన్ రక్తికట్టించారు. కనకం, కావ్య ఎమోషన్ గుండెల్ని పిండేస్తుంది. కావ్య వెంటనే అమ్మా అంటూ ఏడుస్తూ స్టేజ్ మీదకి వెళ్ళి కనకాన్ని కౌగలించుకున్నట్టు ఊహించుకుంటుంది. కనకం పెర్ఫామెన్స్ కి అందరూ చప్పట్లు కొడతారు. అందరూ నవ్వుతూంటే నీకు ఏమైందని రాజ్ అడుగుతాడు. మీకు నవ్వు మాత్రమే కనిపిస్తుంది నాకు అందులో నవ్వించడానికి పడే కష్టం కనిపిస్తుందని బాధగా చెప్తుంది.
Also Read: మనోహర్ కంట పడకుండా తప్పించుకున్న జానకి- హనీమూన్ సంగతి తెలిసి కుళ్ళుకున్న మల్లిక
కనకం పెర్ఫామెన్స్ చేసి వెళ్లిపోతుండగా రాజ్ తాతయ్య ఆగమని చెప్తాడు. తనని ఎక్కడ గుర్తు పట్టారోనని భయపడతారు. మనవడి రిసెప్షన్ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు పారితోషకం తీసుకోకుండా వెళ్తున్నారని ఆపుతాడు. కొత్త కోడలు చేతుల మీదగా ఇప్పించమని చిట్టి చెప్పడంతో కావ్య ఇబ్బందిగానే ఆ డబ్బులు ఇస్తుంది. మీ ప్రదర్శనలో అందరూ నవ్వు చూశారు కానీ దాని వెనుక దుఖం నాకు కనిపించిందని ఎమోషనల్ అవుతుంది. తల్లి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. కనకం బాధగా వెళ్ళిపోతుంది. రాహుల్ యాంకర్ కి బిస్కెట్స్ వేస్తూ ఉంటాడు. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ అని స్వప్నకి చెప్పిన మాటలే తనకి చెప్పి ఇంప్రెస్ చేస్తాడు. స్వప్నని వెనకి నుంచి చూసి ఫిగర్ బాగుంది ఫ్లట్ చేద్దామని తన వెనుకే వెళతాడు. తర్వాత తన ఫేస్ చూసి స్వప్న అని గుర్తు పట్టేస్తాడు. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా గెటప్ లు వేసుకుని బతుకుతున్నారని అనుకుంటూ తనకి కనిపించకుండా తప్పించుకుని వెళ్లిపోతుంటే స్వప్న చూసి పిలుస్తుంది.
ఇంటి దగ్గర కృష్ణమూర్తి కనకం ఎక్కడికి వెళ్లిందోనని టెన్షన్ పడుతూ ఉంటాడు. కావ్య ఇంటికి వెళ్ళి చూడమని చెప్తారు. కావ్యని తీసుకెళ్ళి బిజినెస్ పార్టనర్స్ కి పరిచయం చేయమని రాజ్ తాతయ్య సలహా ఇస్తాడు. తన దగ్గరకి వెళ్ళి రా అని వంకరగా పిలుస్తాడు. నిన్ను పరిచయం చేయాలంట అనేసరికి తాతయ్య చెప్పారా అయితే నేను రాను ఇక్కడే ఏడుస్తానని కావ్య రాజ్ ని ఆట ఆడుకుంటుంది. రెస్పెక్ట్ ఇచ్చి పిలిస్తే వస్తానని అనేసరికి రాజ్ నవ్వు మొహంతో కళావతి గారు పరిచయం చేయాలి అని పిలుస్తాడు. బిజినెస్ పార్టనర్స్ దగ్గరకి వెళ్ళి నా భార్య అని పరిచయం చేస్తాడు. పేరెంటని అడిగితే కళావతి అని చెప్తాడు. వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే ఇంగ్లీషులోనే బదులిస్తుంది. అదంతా అపర్ణ చూస్తూనే ఉంటుంది. స్వప్న రాహుల్ వెనుక వెళ్తూ వేరే వాళ్ళకి డాష్ ఇస్తుంది. తనని చూసి స్వప్న అక్కలాగే ఉందని తనవైపు వెళ్తుంది. కావ్య స్వప్న దగ్గరకి వచ్చే టైమ్ కి రాహుల్ వచ్చి అడ్డం నిలబడి తనని పంపించేస్తాడు.
Also Read: ప్రియని మోసం చేసిన సంజయ్- రాజ్యలక్ష్మి నెత్తిన మరో పిడుగు వేయనున్న దివ్య
రాహుల్ స్వప్నని పక్కకి తీసుకెళ్ళి ఏం చేస్తున్నావ్ ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని అంటాడు. అబద్ధాలు ఎందుకు చెప్పావని నిలదీస్తుంది. అబద్ధాలు చెప్పే అలవాటు మీ ఫ్యామిలీకి ఉందని రాహుల్ కోపంగా చెప్తాడు. ఆఫీసుకి అని చెప్పి ఇక్కడకి వస్తావా? ఈ పెళ్లి నుంచి కావాలనే నన్ను తప్పించావ్ కదా? రాజ్ విషయంలో తప్పు చేసి నీ దగ్గర నేను మోసపోయానా? అని నిలదీస్తుంది. ఇక్కడికి వచ్చి మన గురించి చెప్పాలని అనుకున్నా కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉందని అంటాడు. ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది ఇప్పుడు నువ్వు చెప్పకపోతే రాహుల్ తో లేచిపోయి వచ్చానని చెప్తానని స్వప్న బెదిరిస్తుంది. రాజ్ వైఫ్ నీ సొంత చెల్లెలు మీరందరూ ఆడిన నాటకం ఏంటో నాకు తెలిసింది. నిన్ను మనస్పూర్తిగా ప్రేమించాను. నీకు ఆస్తి ఉన్నా లేకపోయినా నిన్నే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్తాడు. ఆ మాట విని స్వప్న సంతోషపడుతుంది. నీ చెల్లెలు నీ గురించి బ్యాడ్ గా చెప్పింది. అందుకే నువ్వు వెళ్లిపోగానే ముసుగు వేసుకుని నీలా కూర్చుని తాళి కట్టించుకుందని కావ్య గురించి అబద్ధాలు చెప్తాడు.