Janaki Kalaganaledu March 24th: మనోహర్ కంట పడకుండా తప్పించుకున్న జానకి- హనీమూన్ సంగతి తెలిసి కుళ్ళుకున్న మల్లిక
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి రామాని తీసుకుని షాపింగ్ వెళ్తుంది. రామాకి బట్టలు తీసుకున్న తర్వాత జానకి ట్రెండీ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుంది. మల్లిక చెవిలో పువ్వు పెట్టుకుని రావడం చూసి అదేంటి అలా పెట్టుకుని వస్తున్నారని మలయాళం అంటాడు. రెండు రోజుల పాటు ఇంట్లో ప్రశాంతంగా ఉండవచ్చని మలయాళం మల్లికకి చెప్తాడు. ఎందుకని అంటే జానకి, రామా వాళ్ళు రెండు రోజులు షికారుకి వెళ్లారని చెప్పేసరికి మల్లిక ఏడుపు మొదలుపెడుతుంది. పూజలు నేను చేస్తుంటే వరాలు దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడని కుళ్ళుకుంటుంది. వాళ్ళకి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయంటే పెద్దయ్య ఇచ్చారని చెప్పేసరికి దోచి పెడుతున్నారా అని తిట్టుకుంటుంది. సంతోషపడుతుందని చెప్తే టపాకాయలా చిందులేస్తుందేంటని అక్కడి నుంచి జారుకుంటాడు. శనీశ్వరా వాళ్ళని సంతోషంగా ఉండనివ్వకు ఏదో ఒక సమస్యలు తీసుకోస్తూనే ఉండమని మల్లిక కోరుకుంటుంది.
Also Read: ప్రియని మోసం చేసిన సంజయ్- రాజ్యలక్ష్మి నెత్తిన మరో పిడుగు వేయనున్న దివ్య
జానకి వాళ్ళు షాపింగ్ చేస్తున్న షాపు దగ్గరకి మనోహర్ వస్తాడు. అప్పుడే జానకి శారీ కట్టుకుని ట్రైల్ రూమ్ నుంచి బయటకి వచ్చి మనోహర్ ని చూసి షాక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తనని చూస్తే ప్రాబ్లం అవుతుందని జానకి మనోహర్ కి కనిపించకుండా చాటుగా నిలబడుతుంది. సరిగ్గా అప్పుడే రామా డ్రెస్ ట్రైల్ వేసుకుని బయటకి వస్తాడు. జానకి రామాని చూసి హీరోలాగా ఉన్నాడనుకుని విలన్ కి కనిపిస్తే ఇక అంతే సంగతులని అనుకుంటుంది. జానకి రామాని పిలిచి ఎస్సైని చూపిస్తుంది. ఒంట్లో బాగోలేదని సెలవు పెట్టాను ఇప్పుడు కంట పడితే బాగోదని అనుకుంటాడు. మనోహర్ జానకిని చూసేస్తాడు. సిక్ లీవ్ పెట్టి షాపింగ్ మాలలో ఏం చేస్తుందని వెళ్ళి ఒక అమ్మాయిని పట్టుకుని జానకి అని పిలుస్తాడు. రామా పక్కకి ఉండేసరికి మొహం కనిపించదు. గ్రీన్ కలర్ చీర అమ్మాయి ఎటువైపు వెళ్ళిందని రామానే అడుగుతాడు ఆటు వైపు వెళ్లిపోయిందని అబద్ధం చెప్పి తప్పించుకుని మనోహర్ కి కనిపించకుండా వెళ్లిపోతారు.
Also Read: హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మిసెస్ న్యూసెన్స్- వేదని యష్ దగ్గర లేకుండా చేసిన విన్నీ
ఎస్సైని భలే బురిడి కొట్టించారని రామా అంటాడు. ఇద్దరూ కలిసి బండి మీద సరదాగా వెళ్తు ఉంటారు. రామా భుజం మీద వాలిపోయి ఎంజాయ్ చేస్తుంది. అప్పుడే రామా ఫోన్ లో అలారం మోగుతుండే సరికి బండి పెట్టలేదు కదా కస్టమర్స్ ఫోన్ చేస్తారని అనేసరికి జానకి బుంగమూతి పెడుతుంది. పక్కన మిఠాయి లాంటి భార్యని పెట్టుకుని ఇంటి దగ్గర మిఠాయి బండి గురించి ఆలోచిస్తున్నారని తిట్టుకుంటుంది. ఇద్దరూ కలిసి ఒక రిసార్ట్ కి వస్తారు. అక్కడ కపుల్స్ ఉండటం చూసి రామా ఆశ్చర్యపోతాడు. రేపటి వరకు ఈ రిసార్ట్ లోనే గడపబోతున్నామని చెప్తుంది. ఇక్కడ మనవాళ్ళు ఎవరు ఉన్నారని వచ్చామని రామా అమాయకంగా అడుగుతాడు. ఎవరు ఉండకూడదనే వెతుక్కుంటూ వచ్చామని జానకి చెప్తుంది. మీకు నేను, నాకు మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ ఉండకూడదని అంటుంది.