News
News
X

Brahmamudi March 14th: ఇద్దరం కొండెర్రిపప్పలమేనన్న రాహుల్- కావ్య దుగ్గిరాల ఇంటికి సరైన కోడలన్న ధాన్యలక్ష్మి

రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

దుగ్గిరాల ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టిన కావ్య ఉండేందుకు స్టోర్ రూమ్ ఎంచుకుంటుంది. ఇంటి కోడలు అక్కడ ఉండటం బాగోదేమోనని ధాన్యలక్ష్మి అనేసరికి వాళ్ళ స్థాయి అదే కదా అక్కడ నుంచే కదా వచ్చిందని రేఖ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో కళ్యాణ్ తన మీద అరుస్తాడు. అబద్ధాలు చెప్పింది వాళ్ళ అమ్మ, పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయింది వాళ్ళ అక్క మధ్యలో ఈ అమ్మాయి బలైపోయిందని ఉండటానికి వేరే రూమ్ చూద్దామని అంటాడు. తానేమీ ఉండమనలేదని చేసిన తప్పుకి దేవుడు వేసిన శిక్ష అని అపర్ణ అంటుంది. స్వప్న అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటే రాహుల్ తను రోడ్డు మీద బొమ్మలు అమ్ముకుంటున్నట్టు ఊహించుకుంటాడు. నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది నీ మాటలన్నీ నిజమేనా అని అడుగుతాడు. ఎందుకు అలా అడిగావ్ అని లోలోపల భయపడుతుంది. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే డౌట్ వచ్చిందని అంటాడు.

Also Read: యష్, వేద విడాకులు- విలన్ గా తన అసలు రంగు బయటపెట్టిన విన్నీ

నువ్వు రిచ్, తెలివైన వాడివి కదా అని స్వప్న అంటుంది. నువ్వు, నేను రిచ్ కాదు. ఇద్దరం చాలా తెలివైన వాళ్ళం అనుకుని ఒకరినొకరం కలిసి మోసం చేసుకున్నాం. బహుశా మనలాంటి ఇడియట్స్ ఎవరూ ఉండరేమోనని రాహుల్ మనసులోనే తిట్టుకుంటాడు. గేమ్ బాగా ఆడావ్ కానీ ఇందులో గెలిచేది నేను ఒడిపోయేది నువ్వు అనుకుంటాడు. శాంతం కావ్యని స్టోర్ రూమ్ లోకి తీసుకొస్తుంది. ఈ గదిలో ఉండలేరని అంటుంది కానీ కావ్య మాత్రం తనకి కష్టాలు అలవాటేనని చెప్తుంది. కొత్త కోడలు ఇలాంటి గదిలో ఇలాంటి పరిస్థితిలో ఉంటుందని అనుకోలేదని శాంత కూడా బాధపడుతుంది. మా అమ్మ చేసిన పనికి ఈ గదిలో అయినా ఉండానిచ్చారు సంతోషమని కావ్య అనుకుంటుంది. గదిని చక్కగా శుభ్రం చేసుకుంటుంది. కనకం బాధగా కూర్చుని కావ్య కోసం బాధపడుతుంది.

కావ్యని ఎలా చూస్తున్నారో ఏమంటున్నారోనని ఏడుస్తుంది. రుద్రాణికి ఫోన్ చేసి కావ్య గురించి తెలుసుకోవచ్చని అప్పు చెప్తుంది. తన కూతురు ఎలా ఉందని కనకం అడుగుతుంది. రాజ్ రూమ్ లోనే ఉండమన్నారు మహారాణిలా ఉందని రుద్రాణి అబద్ధం చెప్తుంది. ఒక్కసారి తన కూతురితో మాట్లాడించమని కనకం అడుగుతుంది అందరూ ఉన్నారని తర్వాత మాట్లాడిస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అక్కని మహారాణిలా చూసుకుంటున్నప్పుడు మన మీద కోపం ఎందుకని అప్పు డౌట్ పడుతుంది. రాజ్ గదిలో స్వప్న ఫోటో చూసి తను చేసిన మోసం తలుచుకుని బాధపడతాడు. పెళ్లి విషయంలో మోసం చేసి తన పరువు తీసిందని రగిలిపోతాడు. స్వప్న ఫోటో వెంటనే చింపేసి డస్ట్ బిన్ లో వేసేస్తాడు. రాజ్, అపర్ణ కాసేపు స్వప్న చేసిన మోసం గురించి మాట్లాడుకుని బాధపడతారు.

Also Read: జానకి భజన చూసి చిరాకు పడిన అఖిల్- సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న రామ

స్వప్న పేపర్ లో రాజ్, కావ్య పెళ్లి జరిగినట్టు వచ్చిన వార్త చూసి షాక్ అవుతుంది. కావ్య నా చెల్లెలు అని తెలిసిపోయిందా? అంటే పెళ్లి మండపంలో ఏదో గొడవ జరిగింది. ఈ పేపర్ రాహుల్ చూశాడా నిజం తెలిసిపోయిందా అని స్వప్న టెన్షన్ పడుతుంది. ధాన్యలక్ష్మి కావ్య గదిలోకి వచ్చి చూసి అందంగా రెడీ చేశావ్, ఈ ఇంటికి నువ్వే సరైన కోడలివి ఆ విషయం అపర్ణ అక్క త్వరలోనే గుర్తిస్తుందని అంటుంది. నీ మంచితనంతో రాజ్ ని కూడా మార్చుకుంటావని అనిపిస్తుందని చెప్తుంది. తనని భోజనానికి కావ్యని తీసుకుని వెళ్తుంది.

Published at : 14 Mar 2023 09:41 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial March 14th Episode

సంబంధిత కథనాలు

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

టాప్ స్టోరీస్

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే