News
News
X

Brahmamudi February 23rd: మొదలైన పెళ్లి ఏర్పాట్లు - స్వప్నకి ఐలవ్యూ చెప్పిన రాహుల్, అక్కని నిలదీసిన కావ్య

దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

కావ్య స్వప్న గదికి వస్తుంది. అప్పుడే రాజ్ స్వప్నకి ఫోన్ చేస్తాడు. ఫోన్ వస్తుంది లెమ్మని కావ్య పిలిచి దుప్పటి తీసేసరికి అక్కడ దిండ్లు ఉండటం చూసి కావ్య షాక్ అవుతుంది. నువ్వు మనస్పూర్తిగా నాతో పెళ్లికి ఒప్పుకున్నావా లేదంటే ఇంట్లో వాళ్ళ బలవంతంతో పెళ్లికి ఒప్పుకున్నావో నీ నోటితోనే వినాలని రాజ్ అనుకుని మళ్ళీ స్వప్నకి కాల్ చేస్తాడు. ఇంత రాత్రి అందరి కళ్ళు కప్పి అక్క ఎక్కడికి వెళ్ళిందని కావ్య అనుకుంటుంది. స్వప్న, రాహుల్ ఒకచోట కలుస్తారు. మనం సంతోషంగా ఉండాలంటే నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని స్వప్న రాహుల్ తో అంటుంది. రాహుల్ స్వప్నకి ఐలవ్యూ చెప్తాడు. ఆ మాట విని స్వప్న సంతోషంగా తన దగ్గరకి వెళ్ళి ఐలవ్యూ టూ చెప్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను అలా అని రాజ్ ని మోసం చేయలేనని రాహుల్ కల్లబొల్లి మాటలు చెప్తాడు.

Also Read: 'గృహలక్ష్మి'లోకి కొత్త విలన్- దివ్య ఇంటర్వ్యూకి వెళ్ళిన హాస్పిటల్ ముందు ధర్నాకి దిగిన తులసి

ఇష్టాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం లేదు ఎవరి కోసమో త్యాగం చేయాలసిన అవసరం లేదు మనం పెళ్లి చేసుకుందామని స్వప్న అడుగుతుంది. పెళ్లి సరే మరి ఆస్తి ఎలా అని రాహుల్ మనసులో అనుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత  ఎవరు ఏమి చేయలేరని స్వప్న చెప్తుంది. ఒక్కతే కూతురు కాబట్టి ఆస్తి ఆలస్యంగా వస్తుందని, రాజ్ చేసుకోవాల్సిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న అని తెలిస్తే అవమానంతో చచ్చిపోతాడని రాహుల్ అనుకుంటాడు. అయితే మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామని స్వప్న అంటుంది. సరే ప్లాన్ చేస్తానని రాహుల్ చెప్తాడు. రాజ్ పదే పదే కాల్ చేయడంతో చేసేది లేక కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. పెళ్లి చూపులకి లేకపోవడం వచ్చిన తర్వాత నువ్వు ఇబ్బందిగా ఉండటం గమనించాను నీ మనసుకి నేను నచ్చానా ఆ ఒక్కటి చెప్పు చాలు అని రాజ్ మాట్లాడుతూనే ఉంటాడు.

నాతో పెళ్లికి నీకు ఇష్టమైనా అని రాజ్ అడుగుతాడు. ఇప్పుడు ఎస్ చెప్పకపోతే పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుందేమో అని కావ్య అనుకుని ఎస్ చెప్తుంది. అది విని రాజ్ సంతోషిస్తాడు. ఇంతగా ఇష్టపడే మనిషి గురించి పట్టించుకోకుండా అక్క ఎక్కడికి వెళ్ళిందని కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అటు రాజ్ స్వప్నతో తన పెళ్లి అని తెగ ఊహల్లో ఉంటాడు. కానీ ఇక్కడ స్వప్న రాహుల్ రోడ్డు మీద హగ్ చేసుకుని ఉంటారు. డబ్బున్న రాహుల్ ని తనవైపుకి తిప్పుకున్నానని స్వప్న తెగ సంబరపడుతుంది. కోట్ల ఆస్తి ఫారిన్ ట్రిప్స్, మోడలింగ్ అన్ని సొంతం అయినట్టే అని స్వప్న సంతోషపడుతుంది. రాజ్ ఇష్టపడిన అమ్మాయిని తనవైపుకి తిప్పుకున్నందుకు తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు రాహుల్ సంతోషిస్తాడు.

Also Read: యష్ గురించి విన్నీకి చెడుగా చెప్పిన అభిమన్యు- విషమంగా వేద ఆరోగ్యం

స్వప్న దొంగచాటుగా రావడం చూసి కావ్య వరుస ప్రశ్నలు వేసి నిలదీస్తుంది.. కానీ స్వప్న మాత్రం కావ్య ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తన మీద అరుస్తుంది. సమాధానం చెప్పాల్సిన అవసరం తనకి లేదని తన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కావ్యకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. రుద్రాణి కూతురు, కొడుకుతో కలిసి తాగుతూ తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు సంబరపడుతుంది. తను కూడా ఒక ప్లాన్ వేశానని అది తెలిసిన తర్వాత అందరూ షాక్ అవుతారని రాహుల్ అనుకుంటాడు. ఈ ఇంటి కోడలు బికారి అని తెలిస్తే రాజ్, తన తల్లి మొహం ఎలా ఉంటుందో చూడాలని రుద్రాణి అనుకుంటుంది. కనకం ఇంటిని తాకట్టు పెట్టడానికి రెడీ అవుతుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా భర్తకి తెలియకుండా వడ్డీ వ్యాపారి దగ్గరకి వచ్చి రూ.10 లక్షలకి ఇంటిని తాకట్టు పెట్టేస్తుంది.

Published at : 23 Feb 2023 08:05 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial February 23rd Episode

సంబంధిత కథనాలు

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !