Ennenno Janmalabandham February 22nd: యష్ గురించి విన్నీకి చెడుగా చెప్పిన అభిమన్యు- విషమంగా వేద ఆరోగ్యం
యష్, వేద మధ్య విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Ennenno Janmalabandham February 22nd: యష్ గురించి విన్నీకి చెడుగా చెప్పిన అభిమన్యు- విషమంగా వేద ఆరోగ్యం Ennenno Janmalabandham Serial February 22nd Episode 353 Written Update Today EPisode Ennenno Janmalabandham February 22nd: యష్ గురించి విన్నీకి చెడుగా చెప్పిన అభిమన్యు- విషమంగా వేద ఆరోగ్యం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/22/c55e7e6e89808901ae58d755b79c70c91677043340822521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వేద కళ్ళు తిరిగి పడిపోయి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉండటంతో యష్ కంగారుగా హాస్పిటల్ కి తీసుకుని వస్తాడు. వెంటనే విన్నీ కూడా వెనుకే వస్తాడు. వేదని హాస్పిటల్ బెడ్ మీద చూసి యష్ విలవిల్లాడిపోతాడు. ‘ఏమైపోయావే..’ అని సాంగ్ వేసి సీన్ సూపర్ గా చూపించారు. వేద తల్లిదండ్రులని వసంత్ హాస్పిటల్ కి తీసుకుని వస్తాడు. వేద అలా అయిపోవడం ఏంటని సులోచన బాధపడుతుంది. సడెన్ గా ఎందుకు ఇలా అయ్యిందని రత్నం అడిగేసరికి వేద మాటలు గుర్తు చేసుకుని ఫీల్ అవుతాడు. చిత్ర కూడా విషయం తెలుసుకుని కంగారుగా వెళ్ళిపోతుంది. ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో చెప్పండి అని యష్ నర్స్ మీద అరుస్తాడు. డాక్టర్ వచ్చి ఏంటి గోల అని యష్ మీద సీరియస్ అవుతుంది. యష్ తరఫున విన్నీ డాక్టర్ కి సోరి చెప్తాడు. వేదకి ఎలా ఉందని అడుగుతాడు. తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నామని కాసేపు వెయిట్ చేయమని చెప్తుంది.
Also Read: దిండ్లు పెట్టి జంప్ అయిన స్వప్న, కనిపెట్టేసిన కావ్య- రాజ్ పెళ్లి ఎవరితో జరగనుంది?
చిత్ర రోడ్డు మీద నిలబడి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అటుగా అభిమన్యు వెళ్తు తనని చూసి కారు ఆపుతాడు. ఏంటి టెన్షన్ గా ఉన్నావ్ అని అభి ఆరా తీస్తాడు. వేద అక్కకి బాగోలేదు కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తుంది. హాస్పిటల్ లో డ్రాప్ చేస్తాను రమ్మని అడుగుతాడు. వెహికల్స్ ఏమి రావడం లేదని కారులో వెళ్లడమే బెటర్ అనుకుని చిత్ర అభి కారు ఎక్కుతుంది. ఐసీయూలో వేదని చూసి యః కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ‘వేద నిన్ను ఇలా చూడటం చాలా బాధగా ఉంది. నీకు ఇలా జరగడానికి కారణం నేనే కదా. నా ఆవేశం, కోపం వల్లే కదా నీకు ఈరోజు ఇలా జరిగింది. చాలా పెద్ద తప్పు చేశాను, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. నేను ఉండగా నీకు ఏమి కానివ్వను, నిన్ను ఇలా చూడటం నా వల్ల కావడం లేదు నువ్వు త్వరగా స్పృహలోకి రా నాతో గొడవపడు. ఖుషి నీకోసం ఎదురుచూస్తుంది. ప్లీజ్ వేద నీకు దూరంగా బతకడం నా వల్ల కాదు దయచేసి లే’ అని యష్ ఎమోషనల్ అవుతాడు.
Also Read: ఫుల్ ఖుషీగా తులసి కుటుంబం- లాస్యకి పెద్ద షాక్ ఇచ్చిన దివ్య
చిత్ర అభిమన్యు కారులో రావడం వసంత్ చూసి షాక్ అవుతాడు. అక్కడ విన్నీని చూసి అభి వెళ్ళి తనని పలకరిస్తాడు. తన ఫ్రెండ్ వేద హాస్పిటల్ లో ఉందని విన్నీ చెప్తాడు. కళ్ళు తిరిగిపడిపోయిందని విన్నీ అంటాడు. ‘స్ట్రెస్ వల్ల అలా అయి ఉంటుంది. యశోధర్ మాజీ భార్య మాళవికని నేను చేసుకోబోతున్నా. మాళవిక ఆరేళ్ళ క్రితం నా దగ్గరకి వచ్చింది. వేదని పెళ్లి చేసుకున్నాడు. యశోధర్ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. యష్ లాంటి భర్తతో కాపురం చేయడం చాలా కష్టం. వేద మంచిది కాబట్టే తనలాంటి యారగెంట్ ని భరిస్తుంది. తనకి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. కోపం, షార్ట్ టెంపర్. వేద యష్ ది ఒక ఫేక్ మ్యారేజ్. ఖుషి కస్టడీ కోసమే వేద తనని పెళ్లి చేసుకుంది. పాపం వేద యష్ ని నమ్మి ఇరుక్కుపోయింది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమే లేదు. దేవుడు తనకి మంచి భర్తని ఇవ్వకపోయిన నీలాంటి మంచి స్నేహితుడిని ఇచ్చాడని’ చెప్పి అభి వెళ్ళిపోతాడు. వేద యశోధర్ ని పెళ్లి చేసుకుంది కేవలం ఖుషి కోసమా. అలాంటప్పుడు వేదకి ఈ పెళ్లి అవసరమా. సంథింగ్ ఈజ్ రాంగ్ వేదకి న్యాయం జరగాలని విన్నీ అనుకుంటాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)