Bollywood: కాబోయే అత్తగారికి తన పాత కారు ఇచ్చిన యంగ్ హీరో...?
కాబోయే అత్తగారికి బాలీవుడ్ యంగ్ హీరో తన పాత కారును ఇచ్చాడా? ప్రేక్షకులు చెప్పేదాన్ని ప్రకారం... హీరో పాత కారులో అత్తగారు తిరుగుతున్నారు.
పెళ్లి అన్నాక బోలెడు పనులు ఉంటాయి. పనులు మీద బయటకు వెళ్లడానికి కార్లు గట్రా అవసరం అవుతాయి. అందుకని, త్వరలో పెళ్లి చేసుకోబోయే బాలీవుడ్ హీరో కాబోయే అత్తగారికి తన పాత కారును ఇచ్చాడని టాక్. ఆ హీరో విక్కీ కౌశల్. అతడు పెళ్లి చేసుకోబోయేది స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌ను అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా!
View this post on Instagram
ఇప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీలో విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ పెళ్లి హాట్ టాపిక్. ఎవరి ఇంట్లోంచి ఎవరు బయటకు వస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? అని వెయ్యి కళ్లతో గమనిస్తున్నారు. పెళ్లి కోసం కత్రీన తల్లి సుజానే కొన్ని రోజుల క్రితమే ముంబై చేరుకున్నారు. పెళ్లి పనుల్లో ఆమె బిజీ బిజీగా ఉన్నారు. ఆదివారం ఆమె ముంబైలో కత్రీనా కైఫ్ ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లారు. అదీ బెంజ్ కారులో! ఆ వీడియోలు చూసిన ప్రేక్షకులు... ఆ కారు గతంలో విక్కీ కౌశల్ ఉపయోగించిన కారు అని చెబుతున్నారు. దీనిబట్టి... తన పాత కారును పెళ్లి పనుల కోసం కత్రీన ఇంటి దగ్గర విక్కీ కౌశల్ ఉంచారన్నమాట.
View this post on Instagram
ఇప్పటివరకూ పెళ్లి చేసుకోబోతున్నట్టు విక్కీ కౌశల్ గానీ, కత్రీనా కైఫ్ గానీ అధికారికంగా వెల్లడించలేదు. పెళ్లి పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. విక్కీ కౌశల్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కమెడియన్ కృష్ణ అభిషేక్ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, లిఫ్ట్‌లో విక్కీకి కంగ్రాట్స్ చెబుతానని 'ఏబీపీ న్యూస్'తో చెప్పారు.
Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన సమస్య... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: ఏందీ బ్యాడ్ లక్... మళ్లీ వాయిదా పడిన కీర్తీ సురేష్ సినిమా
Also Read: బాలయ్యతో ఆ సాయంత్రం అన్ స్టాపబుల్ అంటున్న ప్రిన్స్ మహేష్... ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
Also Read: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: ఎవరి కప్పులు వారే చెత్తబుట్టలో వేయమని కోరిన అల్లు అర్జున్! ఎందుకంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి