News
News
X

BiGG Boss 6 Telugu: నామినేషన్ డే - రెండో వారమే వేడెక్కిన వాతావరణం, ఏం ఇరగదీశావ్ అంటూ ఆరోహిపై ఆదిరెడ్డి ఫైర్

BiGG Boss 6 Telugu: బిగ్‌బాస్ ప్రేక్షకులు ఎదురుచూసే రోజు నామినేషన్ డే.

FOLLOW US: 
Share:

Bigg Boss 6 Telugu:  బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు ఎదురు చూసేది నామినేషన్ల కోసమే. ఆ రోజే ఇంటి సభ్యుల అసలు రూపాయలు బయటికి వస్తాయి. సీజన్ 6లో మొదటి వారమే చాలా వేడివేడి చర్చలు సాగాయి. గొడవలు, పంచాయతీలు కూడా మొదలైపోయాయి. ఇక రెండో వారం నామినేషన్స్ వచ్చేశాయి. ఈ ఎపిసోడ్ చాలా వేడిగా సాగబోతున్నట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఈ ప్రోమో చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూసేట్టుగా ఉంది. 

ఆదిరెడ్డి వర్సెస్ ఆరోహి 
బిగ్ బాస్ నామినేషన్లలో భాగంగా ఒక్కరిని మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. ప్రోమోను బట్టి ఆరోహి, ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. వెంటనే ఆదిరెడ్డి ఆరోహితో ‘ఆట ఆడని వాళ్లు వెళ్లిపోవాలా? నీతో బంధం ఏర్పరచుకోని వాళ్లు వెళ్లిపోవాలా?’ అని అడిగాడు ఆదిరెడ్డి. దానికి ఆరోహి ‘ఆట ఆడని వాళ్లే వెళ్లిపోవాలి’ అని సమాధానం ఇచ్చింది. ‘నా పర్ఫామెన్స్ కనిపించలేదా’ అని ఆది అడిగితే ‘నాకు కనిపించలేదు’ అని సమాధానం ఇచ్చింది ఆరోహి. దానికి ఆది రెడ్డి ‘మీకన్నా’ అనే సరికి ‘నాకంటే నాకంటే...?’ అంది ఆరోహి. అంటే ఆదిరెడ్డి, ఆరోహి కన్నా తన పర్ఫామెన్స్ ఎక్కువ అని అర్థం వచ్చేలా మాట్లాడాడు. దానికి ఆరోహి ‘సీరియస్లీ?’ అంది. ‘ఎందుకంత హైప్ అవుతున్నారు? ఏమి ఇరగదీశారని’ అన్నాడు ఆది.  అలాగే మెరీనా-రోహిత్ జంట గురించి మాట్లాడుతూ అన్ని చోట్లా ఒక బుర్ర పనిచేస్తే ఇక్కడ మాత్రం రెండు బుర్రలు పనిచేస్తున్నాయి అన్నాడు. దానికి రోహిత్ జంటగా రావడమన్నది తమ నిర్ణయం కాదని, అది బిగ్బాస్ నిర్ణయమని అన్నాడు. తాను బిగ్ బాస్ నిర్ణయాన్నే నామినేట్ చేస్తున్నానని అన్నాడు ఆదిరెడ్డి. 

అబ్బాయిలు బుద్ధి లేదు...
గీతూని శ్రీహాన్ నామినేట్ చేస్తూ...‘నిన్న నైట్ నువ్వు ఈ మగాళ్లకి బుద్ధి లేదు అన్నావ్, అందరూ ఏం చేశారు?’ అని అడిగాడు. ‘అది ఎవరు చేశారో తెలియదు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటే, నిజంగా కుక్కకి ఒకరోజు వస్తుందని కాదు, అదొక స్టేట్మెంట్ అంతే’ అని సమాధానం ఇచ్చింది. అలాగే నేహా కూడా గీతూనే నామినేట్ చేసింది. 

మళ్లీ అరిచిన రేవంత్...
ఎవరూ ఊహించనట్టుగా రేవంత్, కార్తీక దీపం హీరోయిన్ కీర్తి భట్ మధ్య వాగ్యద్ధం జరిగింది. గతేడాది కూడా వీరిమధ్య ఏం గొడవా జరిగినట్టు కనిపించలేదు. అయితే ఒక్కసారిగా వీరి మధ్య గొడవకి ఏది కారణమైందో తెలియదు. రేవంత్ మళ్లీ తన కూల్‌నెస్‌ను కోల్పోయాడు. రేవంత్ గొంతు ముందు కీర్తి ఏం చెబుతుందో కూడా అర్థం కాలేదు. ‘మీరు చెప్పేది నేను వింటున్నప్పుడు, నేను చెప్పేది మీరు వినాలి’ అంటూ రేవంట్ చాలా గట్టిగా ‘జస్ట్ వెయిట్’ అని అరిచాడు. కీర్తి వెంటనే ‘దిస్ ఈజ్ యువర్ నెగిటివ్ ఫాల్ట్’ అంటూ అరిచింది. రేవంత్ కోపంగా చూస్తుండగా... ప్రోమో ముగిసింది. 

వచ్చిన సమాచారం ప్రకారం ఈసారి నామినేషన్లలో ఉన్నది వీరేనని తెలుస్తోంది. 
1. రేవంత్
2. మెరీనా - రోహిత్ జంట
3. షానీ
4. ఫైమా
5. అభినయా
6. గీతూ
7. రాజశేఖర్
8. ఆదిరెడ్డి

Also read: ఈ వారం 'నో' ఎలిమినేషన్ - మరో ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్!

Also read: గీతూని నోరు అదుపులో పెట్టుకోమన్న నాగ్ - ఏడుగురిలో వారిద్దరూ సేఫ్!

Published at : 12 Sep 2022 12:35 PM (IST) Tags: Biggboss 6 telugu Biggboss 6 Telugu Latest promo Adireddy VS Arohi Revanth in Biggboss

సంబంధిత కథనాలు

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?

Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

టాప్ స్టోరీస్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన