News
News
X

Bigg Boss Telugu 6: ఈ వారం 'నో' ఎలిమినేషన్ - మరో ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్!

ఆదివారం నాడు బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన హైలైట్స్ మీకోసం..

FOLLOW US: 

వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున స్టైలిష్ గా రెడీ అయి బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చేశారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు. వారితో 'ఎవరికి ఎంత తెలుసు..?' అనే గేమ్ ఆడించారు నాగార్జున. కంటెస్టెంట్స్ ఒకరి గురించి మరొకరికి ఎంత వరకు తెలుసుకున్నారని వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో ఎవరైతే గెలుస్తారో వారికి 'స్టార్ ఆఫ్ ది వీక్' అనే ట్యాగ్ వస్తుందని చెప్పారు. 'శ్రీహాన్ ఇంట్లో మొదట ఎక్స్ ప్లోర్ చేసిన ప్లేస్ ఏది?' అని అడిగారు నాగ్. దానికి నేహా బజర్ నొక్కి 'వాష్ రూమ్' అని చెప్పింది. అది కరెక్టేనని చెప్పారు నాగ్. 

రెండో ప్రశ్నగా 'ఆర్జే సూర్య ఎంత మందిని మిమిక్రీ చేయగలడు?' అని అడిగారు. దానికి ఇనయా అమాయకంగా 'చాలా మందిని చేయగలడు' అని ఆన్సర్ చెప్పింది. తరువాత ఆరోహి 20 అని కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది. 'షానీ పేరులో పూర్తి ఫామ్ ఏమిటో చెప్పమన్నారు' నాగార్జున. ఎవరూ చెప్పలేకపోవడంతో నాగార్జునే జవాబు చెప్పారు. శ్రీలత, హర్షిత, అనిత, నిషా, ఈషాల మొదటి అక్షరాలన్నీ కలిపి షానీ పేరు ఏర్పడింది. ఈ మొత్తం గేమ్ లో బాలాదిత్య గెలిచారు. ఆయనికి 'స్టార్ ఆఫ్ ది వీక్' ట్యాగ్ తో పాటు ఒక హ్యాంపర్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. 

ఫైమా సేఫ్:

నిన్నటి ఎపిసోడ్ లో శ్రీసత్య, చంటి సేఫ్ అవ్వగా.. అభినయ శ్రీ, ఆరోహి, ఇనయా, రేవంత్, ఫైమా నామినేషన్స్ లో మిగిలి ఉన్నారు. వీరికో టాస్క్ ఇవ్వగా.. అందులో ఫైమా సేఫ్ అయింది. 

ఐటెం నెంబర్ గేమ్:

హౌస్ మేట్స్ ని రెండు టీమ్ లుగా విడగొట్టి వారితో ఐటమ్ నెంబర్ అనే గేమ్ ఆడించారు నాగార్జున. తాను చూపించిన వస్తువును బట్టి ఐటెమ్ పాటలు పాడాలని చెప్పారు. మొదట పువ్వు చూపించగానే శ్రీహాన్ 'పూవుల్లో దాగున్న' అంటూ అందుకున్నాడు. కానీ అది ఐటెమ్ పాట కాకపోవడంతో, రేవంత్ కు వెళ్లింది ఛాన్సు. బంతి పూల జానకి అని పాడి విన్ అయ్యారు. తరువాత మహేష్ బాబు ఫోటో చూపించగానే 'మ మ మహేశా' పాటను పాడారు శ్రీహాన్. దీనికి ఆ టీమ్ మెంబర్స్ అంతా డ్యాన్సు వేశారు. ముఖ్యంగా ఆదిరెడ్డి డ్యాన్సు మాత్రం అందరికీ నవ్వు తెప్పించింది. నాగార్జున కూడా అందరినీ ఆపేయమని, తాను ఆదిరెడ్డి డ్యాన్సు చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. గోంగూరను చూపించగానే అర్జున్ కళ్యాణ్ 'గోంగూర తోటకాడ కాపు కాశా' అని పాడాడు. దీంతో వారు కాసేపు డ్యాన్సు వేశారు. అలానే బుట్టబొమ్మ సాంగ్ కూడా వచ్చింది. 

బుట్టబొమ్మ మెరీనా, రౌడీ అభినయ శ్రీ:

వెంటనే నాగ్.. బాలాదిత్యను 'ఈ హౌస్ లో ఉన్న బుట్టబొమ్మ ఎవరు?' అని అడిగారు. కాసేపు ఆలోచించిన బాలాదిత్య 'మెరీనా' పేరు చెప్పాడు. చాలా సేఫ్ గేమ్ ఆడావ్ అంటూ నాగ్ నవ్వేశారు. ఇక శ్రీ సత్య శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ అని చెప్పాడు. అభినయ శ్రీ.. రౌడీ అని, కీర్తి అయితే బంగారు తల్లి అని, నేహా.. స్ప్రింగ్ అని, ఇనయా.. మిస్ స్మైల్ అని, ఆరోహి.. సీమటపాకాయ్, వాసంతి.. గ్లామర్ ఆఫ్ బిగ్ బాస్, ఫైమా ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పారు. ఇక గీతూ గురించి చెబుతూ గీతక్క సీతక్క అని కామెంట్ చేశాడు బాలాదిత్య. దానికి గీతూ మాట్లాడుతూ 'నేను టెంకాయలాగా, బయట గట్టిగా ఉంటా, లోపల స్వీట్ గా ఉంటా' అంది. దానికి నాగ్ 'బేసిగ్గా పగులగొట్టాలంటావ్ నిన్ను' అనగానే అందరూ నవ్వేశారు. అందరూ నవ్వడం చూసి గీతూ 'మీరంతా హ్యాపీ కదా' అంటూ సెటైర్ వేసింది. 

రేవంత్ సేఫ్:

నామినేషన్స్ లో మిగిలిన రేవంత్, అభినయ శ్రీ, ఆరోహి, ఇనయాలకు బాక్స్ టాస్క్ ఇచ్చి రేవంత్ సేఫ్ అని వెల్లడించారు. 
మిగిలిన ముగ్గురు ఆరోహి, అభినయ, ఇనయాలతో హౌస్ మేట్స్ కి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా..? అని నాగార్జున అడిగారు. దానికి హౌస్ మేట్స్ లో 14 మంది ఇనయా మీదే కంప్లైంట్ చేశారు. గీతూ, చంటి మాత్రం ఆరోహి మీద కంప్లైంట్ చేశారు. అందరూ తననే టార్గెట్ చేయడంతో ఇనయా వెక్కి వెక్కి ఏడ్చేసింది. 

ఆరోహి సేఫ్:

నామినేషన్స్ ఉన్న అభినయ శ్రీ, ఆరోహి, ఇనయాలకు కొబ్బరికాయ టాస్క్ ఇచ్చి ఆరోహి సేఫ్ అయినట్లు చెప్పారు. 

ఈ వారం నో ఎలిమినేషన్:

అభినయ శ్రీ, ఇనయాలను గార్డెన్ ఏరియాలోకి పిలిచిన నాగార్జున.. వారికి సుత్తి టాస్క్ ఇచ్చారు. ఎవరైతే సుత్తిని ఎత్తగలరో వారు సేఫ్ అవుతారని చెప్పారు నాగార్జున. ఇద్దరూ సుత్తి ఎత్తడంతో ఇద్దరూ సేఫ్ అని ప్రకటించారు నాగార్జున. హౌస్ లోకి వచ్చి వారమే అయిందని.. కాబట్టి ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చారని నాగార్జున ప్రకటించారు.  

Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!

Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్ 

Published at : 11 Sep 2022 10:22 PM (IST) Tags: Bigg Boss Bigg Boss 6 Bigg Boss Telugu 6 Inaya abhinaya sree

సంబంధిత కథనాలు

GoodBye Movie Review - 'గుడ్ బై' రివ్యూ : రష్మిక ఫస్ట్ హిందీ సినిమా

GoodBye Movie Review - 'గుడ్ బై' రివ్యూ : రష్మిక ఫస్ట్ హిందీ సినిమా

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్ రీమేక్ చేయనున్నారా?

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్  రీమేక్ చేయనున్నారా?

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు