By: Haritha | Updated at : 27 Sep 2022 01:29 PM (IST)
(Image credit: Star maa)
Bigg Boss 6 Telugu: సోమవారం నామినేషన్ డే. ఆ రోజు ఒక్కొక్కరు పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన ఫన్నీ టాస్కుతో ఇళ్లంతా కామెడీతో నిండిపోయింది. ఈ రోజు హోటల్స్ టాస్క్ ఇచ్చారు. అందులో కొంతమంది గెస్టులుగా, కొంతమంది హోటల్ సిబ్బందిగా వ్యవహరిస్తున్నారు. అంతా చాలా కామెడీ చేశారు. అర్జున్ కళ్యాణ్ ఇదే అదనుగా శ్రీసత్య చేత సేవలు చేయించుకున్నాడు. హోటల్ సిబ్బంది గెస్టులను మెప్పించి డబ్బులు ఎక్కువ సంపాదించాలి. చివరికి ఎవరు దగ్గర డబ్బులు ఉంటాయో వారు గెలిచినట్టు.
ఈ టాస్కులో ప్రోమో ప్రకారం బాలాదిత్య, గీతూ, మెరీనా, రేవంత్, సుదీప వీళ్లు హోటల్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. అర్జున్ కళ్యాన్, శ్రీహాన్, ఆదిరెడ్డి ఖరీదైన గెస్టులుగా కనిపిస్తున్నారు. ఇక శ్రీసత్య, వాసంతి, ఆరోహి, ఇనయా, ఫైమాల పాత్ర ఏమిటో ఎపిసోడ్ లో చూడాలి. ఆదిరెడ్డి రాగానే గీతూ నీళ్లు తాగుతారా అని అడిగింది. దానికి ఉచితంగా ఇస్తారా అని అడిగాడు ఆదిరెడ్డి. నీళ్లు కూడా అమ్ముతామని చెప్పింది గీతూ.
ఇక శ్రీహాన్ చుట్టూ హోటల్ సిబ్బంది గుమిగూడి పోయారు. శ్రీసత్య సేవలు చేసేందుకు సిద్ధంగా ఉంది. అర్జున్ కళ్యాణ్ ఆమ్లెట్ కావాలని అడిగాడు. దానికి వెయ్యి రూపాయలిస్తే చేస్తానని చెప్పింది. అన్నం కలిపి తినిపించాలని అడిగాడు అర్జున్ అందుకు కూడా ఒప్పుకుని శ్రీసత్య. అంతేకాదు తినిపించింది కూడా. ఇక సూర్య చిన్నపిల్లాడి నాకు మమ్మీ కావాలి అంటూ ఇనయాను పిలవడం నవ్వు తెప్పించింది. చివర్లో అమ్మాయిల డ్రెస్సు వేసుకుని ఎంట్రీ ఇచ్చాడు సూర్య. అది చూసి అందరూ నవ్వారు.
ఈ సారి నామినేషన్స్ లో ఎక్కువమందే ఉన్నారు. ఆదివారం కీర్తి, అర్జున్ కళ్యాణ్ నేరుగా నామినేట్ అయ్యారు.
1. సుదీప
2. కీర్తి
3. ఆరోహి
4. గీతూ
5. శ్రీహాన్
6. ఇనయా
7. రాజశేఖర్
8. సూర్య
9. అర్జున్
10. రేవంత్
ఆదివారం ఎపిసోడ్లో ఎవరూ ఊహించిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. నేహా చౌదరి ఎలిమినేట్ కావడం అందరికీ షాకిచ్చింది. ఈసారి కీర్తి కానీ, వాసంతి కానీ అవ్వచ్చని అంచనా. ఇనయాకు ఇల్లు మొత్తం యాంటీగా మారినా, ప్రేక్షకుల నుంచి మాత్రం మద్దతు దొరుకుతోంది.
The new Captaincy Contenders task is a riot of fun! Get ready for unlimited entertainment 🔥
— starmaa (@StarMaa) September 27, 2022
Watch today's fun-filled episode on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/RWXQbHii7y
Also read: హౌస్ టార్గెట్ ఇనయా, ఇలాగే అయితే ఇనయా ఆర్మీ రెడీ అవ్వడం ఖాయం, నామినేట్ అయింది వీళ్లే
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?
K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్
రాతిలోని శిల్పాన్ని గుర్తించగల మహా శిల్పి విశ్వనాథ్ - ఆయన సినిమాల్లో ఈ విషయాలను గుర్తించారా?
Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !
YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల