Bigg Boss 6 Telugu Episde 23: హౌస్ టార్గెట్ ఇనయా, ఇలాగే అయితే ఇనయా ఆర్మీ రెడీ అవ్వడం ఖాయం, నామినేట్ అయింది వీళ్లే
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్లో అందరూ ఇనయానే టార్గెట్ చేశారు.
Bigg Boss 6 Telugu: సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తారు ప్రేక్షకులు. వారి అంచనాకు తగ్గట్టే ఫైట్ చేస్తారు ఇంటి సభ్యులు కూడా. ఈసారి నామినేషన్లో అందరూ ఇనయానే టార్గెట్ చేశారు. ఇలాగే కొనసాగితే ఇనయా ఆర్మీ రెడీ అయ్యేలా ఉంది. తప్పులెన్నువారు తమతప్పులెరుగరు అన్నట్టు... అందరూ ఇనయాలోని చిన్నచిన్న తప్పులు కూడా వెతికి పట్టుకున్నారు. కానీ వారు చేసిన తప్పులను మాత్రం మరిచిపోయారు. ముఖ్యంగా శ్రీహాన్. తాను పిట్ట అనవచ్చట కానీ, ఇనయా వీడు అనకూడదట. ఆ విషయంలోనే ఇనయాను నామినేట్ చేశాడు.
శ్రీహాన్ ఏమైనా అనొచ్చా?
శ్రీహాన్ ఇనయాను తొలిగా నామినేట్ చేశాడు. పిట్ట గొడవను మళ్లీ లాగాడు. నాగార్జున క్లారిటీగా చెప్పినప్పటికీ ఆ టాపిక్ మీదే తిరిగి నామినేట్ చేయడం సిల్లీగా అనిపించింది. పిట్ట అన్నాను కానీ ఇనయాను వేలి చూపించి అనలేదంటూ కొత్త డ్రామాకు తెరతీశాడు. అదే తనను వాడు అనడం మాత్రం తప్పు అన్నాడు. తరువాత శ్రీహాన్ రాజ శేఖర్‌ను నామినేట్ చేశాడు.
సుదీప కూడా ఇనయానే నామినేట్ చేసింది. వీరిద్దరూ కాసేపు అరుచుకున్నారు. రేవంత్ ను కూడా నామినేట్ చేసింది సుదీప. అడవిలో ఆట గేమ్‌లో ఆయన ప్రవర్తన నచ్చలేదు అని చెప్పింది. ఇక గీతూ ఎప్పటిలాగే వచ్చి ఇనయాను నామినేట్ చేసింది. ఆమె దొంగాటలు ఆడిందని అందుకే నామినేట్ చేశానని చెప్పింది. నిజానికి ఆ హౌస్ లో గీతూని మించి దొంగాటలు ఆడే వాళ్లు ఎవరూ లేరు. ఇక చంటిని గేమ్ ఆడలేదంటూ నామినేట్ చేసింది గీతూ. వీళ్లీద్దరూ ఆమెను పెద్దగా పెట్టించుకోలేదు. చంటి కనీసం వివరణ కూడా ఇవ్వలేదు.
నన్ను పట్టించుకోలేదు
ఇక వాసంతి ఆటలో తనను కలుపుకోవడం లేదంటూ, కార్నర్ చేశారంటూ దొంగల టీమ్‌కు నాయకత్వం వహించిన సూర్యను నామినేట్ చేసింది. అలాగే ఆట మొత్తం చాలా కోపంగా ఉన్నారు, కొన్ని మాటలు అన్నారు అంటూ రేవంత్‌ను కూడా నామినేట్ చేసింది. శ్రీసత్య ఇనయా, రేవంత్ ను నామినేట్ చేసింది. బాలాదిత్య సూర్యను నామినేట్ చేశాడు. తరువాత రేవంత్‌ను నామినేట్ చేశాడు.
కీర్తికి కోపమొచ్చింది...
కీర్తి ఈ నామినేషన్స్ లో తన వాయిస్ గట్టిగా పెంచింది. రేవంత్ ను నామినేట్ చేసింది. నా బాధల వల్ల మీ గేమ్ ఎఫెక్ట్ అయిందా? నేను అంతగా బాధపడితే బిగ్ బాస్ హౌస్‌కే రాను అంటూ అరిచింది. ఇనయాను కూడా నామినేట్ చేసింది.
శ్రీహాన్ యాటిట్యూడ్...
ఇనయా శ్రీహాన్‌ను నామినేట్ చేసింది. నాగార్జున ముందు మేమంతా ఒకే ఏజ్ గ్రూప్ అన్నప్పుడు, పక్క నుంచి శ్రీహాన్ నేను చిన్న వాడిని అని వెటకారంగా అన్నాడు. ఆ విషయాన్ని లేవనెత్తింది ఇనయా. నా గురించి నీకు తెలుసా? నా ఏజ్ ఎక్కువని ఎలా అనుకుంటావ్? అంటూ వాదించింది. దానికి శ్రీహాన్ ఎప్పటిలాగే వెటకారంగా మాట్లాడుతూ యాటిట్యూడ్ చూపించాడు. ఇనయ సుదీపను కూడా నామినేట్ చేసింది.
ఫైమా వర్సెస్ ఆరోహి
ఈ ఎపిసోడ్ లో హైలైట్ ఫైట్ ఫైమా, ఆరోహి మధ్య జరిగిందే. ఫైమా సరైన పాయింట్లతో ఆరోహిని ఇరకాటంలో పెట్టేసింది. ఆరోహి మాటల గారడీతో నెట్టుకొచ్చిందే తప్ప ఫైమా అడిగినవాటికి సరిగా సమాధానాలు కూడా చెప్పలేకపోయింది. ఫైమా కాస్త గట్టిగానే ఇచ్చిపడేసింది. ‘నీ భాషతో ప్రాబ్లెమ్ కాదు నువ్వు మాట్లాడే విధానంతోనే సమస్య’ అని చెప్పింది.
ఈ సారి నామినేషన్స్ లో ఎక్కువమందే ఉన్నారు. ఆదివారం కీర్తి, అర్జున్ కళ్యాణ్ నేరుగా నామినేట్ అయ్యారు.
1. సుదీప
2. కీర్తి
3. ఆరోహి
4. గీతూ
5. శ్రీహాన్
6. ఇనయా
7. రాజశేఖర్
8. సూర్య
9. అర్జున్
10. రేవంత్
Also read: నామినేషన్లో ఇనయా వయసుపై చర్చ, యాటిట్యూడ్ చూపించిన శ్రీహాన్