News
News
X

BiggBoss5: ఫేవరేట్ స్టార్స్‌‌లా మారిపోయిన హౌస్ మేట్స్... డ్యాన్సులతో దద్ధరిల్లిపోయిన బిగ్‌బాస్ హౌస్, ఈ ఎపిసోడ్ చూడాల్సిందే

బిగ్‌బాస్ ముగింపు దశకు రావడంతో సీరియస్ టాస్కులు తగ్గాయి.

FOLLOW US: 

బిగ్‌బాస్ ఫన్నీ టాస్కులతో సరదాగా సాగుతోంది. మధ్యలో సిరి-షన్ను రొటీన్ వ్యవహారాలు, కాజల్-శ్రీరామ్ మధ్య గొడవలతో కాస్త ఆసక్తికరంగానే మారింది. రోల్ ప్లే టాస్కుతో ఇంటి సభ్యులు ప్రేక్షకులను తెగనవ్వించారు. అంతవరకు వారి పడిన గొడవలు కూడా మర్చిపోయేలా చేశారు. గురువారం ఎపిసోడ్ కూడా ఫన్నీఫన్నీగా సాగేలా  కనిపిస్తోంది. ముఖ్యంగా డ్యాన్సులతో దద్దరిల్లేలా ఉంది. నేటి ఎపిసోడ్ తాజా ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. 

ప్రేక్షకులను ఓట్లు వేయమని అప్పీల్ చేసే అవకాశం టాస్కులో ఉత్తమ ప్రదర్శన చేసేవారికి దక్కుతుంది. అందులో భాగంగా నేటి టాస్కులో ఇంటి సభ్యులు తమ ఫేవరేట్ సినిమా క్యారెక్టర్లను పోషించాల్సి ఉంటుంది. ఆ పాత్రల్లోనే జీవించాలి,నవ్వించాలి, డ్యాన్సులు చేయాలి. కాగా కాజల్ అతిలోక సుందరి శ్రీదేవి పాత్రను, సన్నీ బాలయ్యలా, శ్రీరామ్ ముఠా మేస్త్రీ,  సిరి జెనిలియాలా, మానస్ గబ్బర్ సింగ్, షణ్ముక్ పోలీస్ పాత్రలో కనిపించారు.

బిగ్ బాస్ ఏర్పాటు చేసిన వేదికపై ప్లే అవుతున్న పాటకు తగ్గట్టు డ్యాన్సులతో అదరగొట్టారు. అందరికన్నా కాజల్ ఫుల్ జోష్ తో డ్యాన్సు చేసింది. చివరలో మానస్ గబ్బర్ సింగ్ పాటకు డ్యాన్సును ఇరగదీశాడు. మధ్యలో సన్నీ ఫన్నీ డైలాగులు కూడా కడుపుబ్బా నవ్వించాయి. కాజల్ ను ఉద్దేశించి ‘శ్రీదేవి గారిని చూసిన కళ్లతో నిన్ను చూడలేక...’ అంటూ కొట్టిన డైలాగుకు అందరూ పడిపడి నవ్వారు. కాజల్ ను శ్రీరామ్ ‘తింగరబుచ్చి’ అని పిలిచాడు. దానికి కాజల్ ‘తింగరబుచ్చి అనగానేమి’ అంటూ నవ్వులు పూయించింది.

Published at : 09 Dec 2021 01:25 PM (IST) Tags: Biggboss 5 Biggboss Latest Promo Biggboss sunnym Biggboss winner

సంబంధిత కథనాలు

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్:  డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్

Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్

Boycott Vikram Vedha : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?

Boycott Vikram Vedha : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

టాప్ స్టోరీస్

Independence Day Google Doodle: ఇండిపెండెన్స్ డే సందర్భంగా గూగుల్ డూడుల్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా

Independence Day Google Doodle: ఇండిపెండెన్స్ డే సందర్భంగా గూగుల్ డూడుల్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా

Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది 

Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది 

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!