News
News
X

Bigg boss 6 Telugu: గుడ్డు జాగ్రత్త టాస్కులో శ్రీసత్యతో రేవంత్ వాదన - కొనసాగుతున్న టిక్కెట్ టు ఫినాలే రేస్

Bigg boss 6 Telugu: టిక్కెట్ ఫినాలే రేసు ఇంకా కొనసాగుతోంది.

FOLLOW US: 
Share:

Bigg boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తేలిపోవడానికి ఇంకా రెండు వారాలు ఉంది. ఈవారం ఒకరు టాప్ 5లో నిల్చునే కంటెస్టెంట్‌గా నిలవబోతున్నారు. అందుకోసమే టిక్కెట్ టు ఫినాలే టాస్కు జరుగుతోంది. ఇందులో గెలిచిన వ్యక్తి ఫైనల్లోకి వెళ్లిన మొదటి కంటెస్టెంటు అవుతారు. అందులో భాగంగా గుడ్డు జాగ్రత్త అనే టాస్కు ఇచ్చారు. ఇందులో గుడ్డును ఒక స్టాండుపై నిల్చోబెట్టి, అది కింద పడకుండా చివరి వరకు వెళ్లాలి. కిందపడితే అవుట్ అయినట్టే. 

ఆదిరెడ్డి, ఫైమా, రేవంత్, శ్రీహాన్ ఈ ఆట ఆడారు. రేవంత్ సగం దూరం వెళ్లాక గుడ్డు కింద పడిపోయింది. దీంతో అతనిలోని కోపం మళ్లీ కట్టలు తెంచుకుంది. సంచాలక్ అయిన శ్రీసత్యతో ఆయన వాదనకు దిగాడు. రేవంత్ ఓటమిని జీర్ణించుకోలేడు. ప్రతి దానికి వాదన పెట్టుకుంటాడు. ఈ ఒక్క గుణమే ఆయనలో పెద్ద మైనస్. లేకపోతే విన్నర్‌కి ఉండాల్సిన లక్షణాలు ఇతనిలో పుష్కలంగా ఉన్నాయి. గుడ్డు సంచాలక్ కి కనిపించకుండా అతను చేయి అడ్డుపెట్టడంతో శ్రీసత్య ‘మాకు కనిపించడం లేదు’ అని చెప్పింది. దానికి రేవంత్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించేలా వాదించసాగాడు. చీటికి మాటికి అలగడం, వాదనకు దిగడం చూడటానికి విసుగ్గా అనిపిస్తుంది. 

ఈ వారం ఎనిమిది మంది ఇంట్లో ఉన్నారు. వారిలో ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలోంచి ఈవారం ఇద్దరినీ తీస్తారో లేక ఒకరిని ఎలిమినేట్ చేస్తారో ఇంకా క్లారిటీ లేదు. టాప్ 5ని ఫైనల్లోకి తీసుకెళితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. టాప్ 6 అయితే మాత్రం ఈ వారం ఒకరు, వచ్చే వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఆదిరెడ్డి విన్నర్ మెటీరియల్ అయినా ఆయన చేసే కొన్ని ఓవరాక్షన్ పనులు, మాటలు, నాగార్జునతో అధికంగా వాదించడం, తానేదో చాలా గొప్ప వ్యక్తినని చెప్పుకోవడం, తాను నిజాయితీ పరుడినని పదే పదే చెప్పుకోవడం ఇవన్నీ కాస్త అతి అయ్యాయి. నామినేషన్లలో కూడా ఆయన మాట్లాడే తీరు, గొడవపడే తీరు అతిగా అనిపిస్తుంది. 

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

Also read: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ

Published at : 01 Dec 2022 04:22 PM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana

సంబంధిత కథనాలు

Bigg Boss Telugu: నాన్‌స్టాప్‌కు పుల్‌స్టాప్? ‘బిగ్ బాస్’ ఓటీటీ వెర్షన్ ఇక లేనట్లేనా!

Bigg Boss Telugu: నాన్‌స్టాప్‌కు పుల్‌స్టాప్? ‘బిగ్ బాస్’ ఓటీటీ వెర్షన్ ఇక లేనట్లేనా!

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!

టాప్ స్టోరీస్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?