Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు వచ్చేసింది.
Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే రేసులో జరిగిన ఓ పోటీలో కీర్తికి చాలా కోపం వచ్చేసింది. టిక్కెట్ ఫినాలే టాస్కుల్లో ఆదికి తొమ్మిది పాయింట్లు వచ్చి టాప్ లో ఉన్నాడు. కాగా మిగతావారికి బిగ్ బాస్ టాస్కు ఇచ్చారు. ఈ రేసులో ముందుకు సాగేందుకు వారికి అవకాశం ఇచ్చారు.ఇందులో భాగంగా వారికి రోల్ బేబీ రోల్ అనే టాస్కు ఇచ్చారు. ఇందులో దొర్లుకుంటూ వెళ్లి బ్రిక్స్ తెచ్చుకుని, మళ్లీ దొర్లుకుంటూ వచ్చి వాటిని టవర్ లాగా నిల్చోబెట్టాలి. ఎవరూ బాగా ఎత్తయిన టవర్ కడతారో వారే గెలిచినట్టు. అయితే ఈ టాస్కుకు సంచాలక్‌గా ఇనాయ, శ్రీసత్య ఉన్నారు.
ఇందులో ఫైమా, కీర్తి, శ్రీహాన్, రోహిత్ ఆడారు. కాగా శ్రీసత్య శ్రీహాన్ టవర్ గ్యాప్స్ లేకుండా ఎత్తుగా ఉందని చెప్పింది. దానికి కీర్తి అడ్డుపడింది. అన్ని విషయాలు కూడా చూడాలని తన పాయింట్లు కొన్ని చెప్పింది. మీకు నచ్చిన వారికి మీరు ఇచ్చుకోండి అంటూ కోపంగా వెళ్లిపోయింది కీర్తి. ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. తరువాత కోపం వచ్చి తన టవర్ కాలితో తన్నింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ అయ్యేసరికి ఆదిరెడ్డికి తొమ్మిది పాయింట్లు, రేవంత్ ఎనిమిది, శ్రీహాన్ ఆరు, ఫైమా అయిదు, కీర్తి రెండు పాయింట్లతో నిలిచారు.
ఈ వారం ఎనిమిది మంది ఇంట్లో ఉన్నారు. వారిలో ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలోంచి ఈవారం ఇద్దరినీ తీస్తారో లేక ఒకరిని ఎలిమినేట్ చేస్తారో ఇంకా క్లారిటీ లేదు. టాప్ 5ని ఫైనల్లోకి తీసుకెళితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. టాప్ 6 అయితే మాత్రం ఈ వారం ఒకరు, వచ్చే వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఆదిరెడ్డి విన్నర్ మెటీరియల్ అయినా ఆయన చేసే కొన్ని ఓవరాక్షన్ పనులు, మాటలు, నాగార్జునతో అధికంగా వాదించడం, తానేదో చాలా గొప్ప వ్యక్తినని చెప్పుకోవడం, తాను నిజాయితీ పరుడినని పదే పదే చెప్పుకోవడం ఇవన్నీ కాస్త అతి అయ్యాయి. నామినేషన్లలో కూడా ఆయన మాట్లాడే తీరు, గొడవపడే తీరు అతిగా అనిపిస్తుంది.
ఇక ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందనే ప్రచారం జరుగుతోంది. టాప్ 5ని ఎంపిక చేయాలంటే ఒక వారం డబుల్ ఎలిమినేషన్ తప్పకపోవచ్చు. ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ జోన్లో శ్రీసత్య, ఫైమాలు ఉన్నారు.
A new challenge for the contenders to win a spot in the finals.
— starmaa (@StarMaa) December 1, 2022
Who will ace it? To find out, watch today's episode of Bigg Boss on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/d5W3PY3LVX
Also read: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?