By: Haritha | Updated at : 30 Nov 2022 06:22 PM (IST)
(Image credit: Instagram)
Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డి టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నట్టు సమాచారం. ఆ టిక్కెట్ గెలుచుకుని బిగ్ బాస్ సీజన్ 6లో ఫైనల్లోకి ప్రవేశించిన మొదటి ఫైనలిస్టు అయ్యాడు. అయితే ఈ వారం అతను నామినేషన్లలో ఉన్నాడు. ఈవారం ఆయన సేవ్ అయితే చాలు నేరుగా ఫైనల్లోకి వెళ్లిపోతాడు. ఈ వారం సేవ్ అయితే వచ్చే వారం నామినేషన్లలో కూడా ఉండడు ఆదిరెడ్డి. ఈవారం ఓటింగ్ ప్రకారం చూస్తే ఆయన కచ్చితంగా సేవ్ అవుతాడు. డేంజర్ జోన్లో ఫైమా, శ్రీసత్య ఉన్నట్టు సమాచారం. కాబట్టి ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యే అవకాశం పూర్తిగా లేదనే చెప్పాలి. టాప్ 5లో ఆదిరెడ్డి కూడా ఒకరు అని కచ్చితంగా చెప్పవచ్చు.
ఈ వారం ఎనిమిది మంది ఇంట్లో ఉన్నారు. వారిలో ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలోంచి ఈవారం ఇద్దరినీ తీస్తారో లేక ఒకరిని ఎలిమినేట్ చేస్తారో ఇంకా క్లారిటీ లేదు. టాప్ 5ని ఫైనల్లోకి తీసుకెళితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. టాప్ 6 అయితే మాత్రం ఈ వారం ఒకరు, వచ్చే వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఆదిరెడ్డి విన్నర్ మెటీరియల్ అయినా ఆయన చేసే కొన్ని ఓవరాక్షన్ పనులు, మాటలు, నాగార్జునతో అధికంగా వాదించడం, తానేదో చాలా గొప్ప వ్యక్తినని చెప్పుకోవడం, తాను నిజాయితీ పరుడినని పదే పదే చెప్పుకోవడం ఇవన్నీ కాస్త అతి అయ్యాయి. నామినేషన్లలో కూడా ఆయన మాట్లాడే తీరు, గొడవపడే తీరు అతిగా అనిపిస్తుంది.
టిక్కెటు టు ఫినాలే టాస్కు రెండో రోజుల నుంచి సాగుతోంది. ఇందులో మొదటగా శ్రీసత్య, ఇనాయ అవుట్ అయిపోయారు. తరువాత ఆరుగురు ఆడాల్సి వచ్చింది. వారిలో నలుగురు మాత్రమే ఆడాలని, ఆ నలుగురు ఎవరో ఏకాభిప్రాయంతో చెప్పాలని అడిగారు బిగ్ బాస్. ఆ విషయంపై ఇంటి సభ్యులతో విసిగిపోయారు. ఏకాభిప్రాయం ఏంటి బిగ్ బాస్ అంటూ చికాకు పడ్డారు. చివరికి ఏమైందో తెలియదు కానీ, ఆదిరెడ్డి టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు.
Also read: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!
Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా
Income Tax Rule: బిగ్‌బాస్, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?
Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!
Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన