Bigg Boss 6 Telugu: ఫుడ్ కావాలా? పోరాడి సంపాదించుకోండి - బిగ్‌బాస్ పనిష్మెంట్ మామూలుగా లేదు
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంట్లో ఆకలి కేకలు మొదలయ్యాయి.
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంటి సభ్యులు ఆకలితో అలమటించిపోతున్నారు. ప్రతి సీజన్లో ఇంట్లో దొంగలు పడే టాస్క్ ఉంటుంది. ఈ రోజు ఎపిసోడ్లో దొంగలు పడి ఇంట్లో ఉన్న ఆహారమంతా తీసుకెళ్లిపోయారు. చివరికి స్పూను పంచదార కూడా ఉంచలేదు. దీంతో ఇంటి సభ్యులు ఆకలితో అలమటించిపోయారు. నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఇంటి సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎంటర్టైన్ చేయలేకపోయారని, ఏ సీజన్లో ఇలా జరుగలేదని కోప్పడ్డారు. షోపై ఆసక్తి లేకపోతే వెళ్లిపొమ్మని మెయిన్ డోర్ గేట్లు కూడా ఓపెన్ చేశారు. అంతేకాదు కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు కూడా క్యాన్సిల్ చేసి, ఈ వారం ఇంటికి కెప్టెన్ ఉండరని చెప్పారు. ఆ మరుసటి రోజు దొంగలంగా వచ్చి ఇంట్లో ఉన్న ఆహారాన్ని తీసుకెళ్లిపోయే టాస్కు రావడంతో దాన్ని పనిష్మెంట్ గా భావిస్తున్నారు ఇంటి సభ్యులు.
సాపాటు ఎటూ లేదు...
ఆకలితో ఎక్కడి వాళ్లు అక్కడ పడుకుని బిగ్‌బాస్ ఆకలేస్తోంది అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. రేవంత్ ‘సాపాటు ఎటూ లేదు’ అంటూ పాటలు పాడాడు. అందరూ నీరసంతో కూర్చుండి పోయారు. ఇక సూర్య అయితే స్పూనుకు అంటుకున్న పంచదార తింటూ కనిపించాడు. డబ్బాలో అడుగున ఉన్న ఆహారాన్ని తింటూ గీతూ, సూర్య కనిపించారు. పనిష్మెంట్ తీసుకోకతప్పదు అంది కీర్తి. కాసేపటి తరువాత గార్డెన్లో ఒక కప్పు అన్నం, ఒక కప్పు పప్పు పెట్టారు బిగ్ బాస్. బైండ్లు ఓపెన్ కాగానే ఆకలి దేవత శ్రీ సత్య ‘ఫుడ్ ఉంది, ఫుడ్ ఉంది, ఫుడ్ ఉంది’ అంటూ చాలా ఆనందపడింది. ఇక బిగ్ బాస్ ఫుడ్ కావాలంటే, పోరాడి సంపాదించుకోవాలని చెప్పారు.
ఆటలు స్టార్ట్...
అన్నం, పప్పు కావాలంటే పోరాడలని చెప్పిన బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య కబడ్డీ పోటీ పెట్టారు. రెండు టీములుగా విడిపోయి కబడ్డీ ఆడారు ఇంటి సభ్యులు. ఇక గీతూ సంచాలక్ గా ఉంది. కాగా ఆడుతున్నప్పుడు రేవంత్ కాలు స్లిప్ అవ్వడంతో ఆయనకు తీవ్రంగ నొప్పి వచ్చి కింద పడిపోయాడు. అతనికి మొన్నటి వరకు కాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు అదే గాయం రగిలినట్టు కనిపిస్తోంది.
View this post on Instagram
Also read: శ్రీ సత్య చేసిన పనితో ఆగిపోయిన టాస్క్, ఏ సీజన్లోనూ ఇలా జరుగలేదంటూ ఇంటిసభ్యులపై ఆగ్రహించిన బిగ్‌బాస్