(Source: ECI/ABP News/ABP Majha)
Bigg Boss 6 Telugu Episode 45: శ్రీ సత్య చేసిన పనితో ఆగిపోయిన టాస్క్, ఏ సీజన్లోనూ ఇలా జరుగలేదంటూ ఇంటిసభ్యులపై ఆగ్రహించిన బిగ్‌బాస్
Bigg Boss 6 Telugu: ఏ సీజన్లోనూ జరగనట్టు బిగ్ బాస్ సీజన్6లో జరిగింది.
Bigg Boss 6 Telugu: ఎపిసోడ్ మొదలవ్వగానే నామినేషన్లు పూర్తయ్యాక ఇంటి సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారో చూపించారు. బాలాదిత్య,ఆదిరెడ్డి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నామినేషన్లో నేను తప్పు మాట్లాడలేదుగా అంటూ బాలాదిత్య అడిగాడు. లేదని చెప్పాడు ఆది రెడ్డి. అలాగే శ్రీహాన్ కూడా చెమ్కీల కారణంతో తనను నామినేట్ చేయడం ఏంటంటూ బాధపడ్డాడు.
ఇక కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు ‘సెలెబ్రిటీ గేమింగ్ లీగ్’ ఇచ్చారు బిగ్‌బాస్. ఇంటి సభ్యులను రెండు టీములుగా విడదీశారు. సగం మందికి కొత్త సినిమాల్లోని ప్రముఖ పాత్రలను, కొందరికి పాత సినిమాల్లోని పాత్రలను ఇచ్చారు. ఇందులో సూర్య పుష్పరాజ్, గీతూ శ్రీవల్లి, రేవంత్ ఘరానా మొగుడులో చిరంజీవి, శ్రీహాన్ చెన్నకేశరెడ్డిలో బాలయ్య, ఇనాయా అతిలోకసుందరిలో శ్రీదేవి, బాలాదిత్య భీమ్లా నాయక్, శ్రీ సత్య ఫిదాలో సాయి పల్లవి, వాసంతి బొమ్మరిల్లు హాసిని, ఆదిరెడ్డి కూలీ నెంబర్ 1లో హీరో, ఫైమా నరసింహలో నీలాంబరి, మెరీనా జేజమ్మ, రోహిత్ మగధీర, కీర్తి రాములమ్మ... ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోటి ఇచ్చారు. ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తారో వారే కెప్టెన్సీ కంటెండర్లు అవుతారని చెప్పాడు బిగ్ బాస్.
గీతూ - సూర్య, పుష్పరాజ్- శ్రీవల్లిగా బాగానే నవ్వించారు. సూర్య ఆ పాత్రలో ఇమిడిపోయాడు. శ్రీహాన్ - ఫైమా కూడా చాలా నవ్వించారు. రేవంత్ మధ్యలో మధ్యలో పర్వాలేదనిపించాడు. రాజ్ కూడా చత్రపతిగా బాగానే నటించాడు. మధ్యలో ఓ టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. అందులో రేవంత్ అర్జున్‌ని ‘ అరేయ్ పప్పు’ అన్నాడు. వారిద్దరూ స్నేహితులు కావడంతో అర్జున్ మొదట పట్టించుకోలేదు. శ్రీసత్య అర్జున్‌తో ‘నిన్ను ఏమైనా అంటే రియాక్ట్ అవ్వవా, మనిషివి కావా’అంటూ కసురుకుంది. దాంతో అర్జున్ రేవంత్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ వల్ల టాస్కులో ఉన్న సంగతి కూడా చాలా మంది మర్చిపోయారు. చాలా సేపు ఎవరూ ఎంటర్టైన్ చేయకపోవడం బిగ్‌బాస్‌కు కోపం వచ్చింది.
వెళ్లిపొమ్మన్న బిగ్‌బాస్
అందరూ గార్డెన్ ఏరియాలో నిల్చున్నాక ఏకిపారేశాడు బిగ్ బాస్. ఏ సీజన్లోనూ ఈ టాస్క్ ఇంత చప్పగా సాగలేదని చెప్పారు. ప్రేక్షకులను, బిగ్‌బాస్‌ను చాలా నిరాశపరిచారంటూ గట్టిగానే క్లాసు తీసుకున్నాడు. శ్రీహాన్, ఫైమా, రేవంత్, సూర్య, గీతూ, రాజ్, కీర్తి, బాలాదిత్య ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, మిగతా వారు కనీసం ప్రయత్నం చేయడం లేదని అన్నారు. చాలా నిరాశపరిచిన కారణంగా కెప్టెన్సీ కంటెండర్ల టాస్కును రద్ధు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈవారం బిగ్ బాస్ ఇంటికి కెప్టెన్ ఉండరని చెప్పారు. ఈ షో పట్ల ఆసక్తి లేకపోతే ఇంటిని వదిలి బయటికి వెళ్లమని చెప్పారు. కాస్ట్యూమ్స్ తీసి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పారు. ఇంటి సభ్యులు ఎంతగా బతిమిలాడినా బిగ్‌బాస్ వెనక్కితగ్గలేదు. దీంతో ఆడిన ఇంటి సభ్యులు చాలా ఫీలవుతూ కనిపించారు.
Also read: మీకు షోపై ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్లిపోండి, మెయిన్ డోర్ ఓపెన్ చేసిన బిగ్‌బాస్