అన్వేషించండి

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్​లో కింగ్ నాగ్ ధరించిన షర్ట్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. సీజన్-7 లో నాగ్ ధరించే డ్రెస్సుల రేట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్​గా మారుతున్నాయి. 

కింగ్ అక్కినేని నాగార్జున 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. హోస్ట్​గా ఇప్పటికే నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్​గా నడిపిన నాగ్.. ఇప్పుడు 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7'తో అదరగొడుతున్నారు. తప్పు చేసినప్పుడు కంటెస్టెంట్స్ మీద ఫైర్ అవుతూ, హౌస్​లో వాతావరణాన్ని హీట్ ఎక్కిస్తున్నారు. అలానే ఫన్నీ గేమ్స్​తో తన సరదా మాటలతో వారిని నవ్విస్తూ బ్యాలన్స్​గా షోని నిర్వహిస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్స్​లో మంచి టీఆర్పీ రేటింగ్స్ నమోదయ్యేలా చేస్తున్నారు. ఇక నాగార్జున ఈ సీజన్​లో ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ ఆయన స్టైలింగ్​ను ఫాలో అవ్వాలనుకునే వారు మాత్రం, వాటి రేట్లు తెలుసుకొని నోళ్లు వెళ్లబెడుతున్నారు.

ఆరు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ పర్ఫెక్ట్ ఫిజిక్​తో, యంగ్​గా కనిపించడం కింగ్ నాగార్జున ప్రత్యేకత. సినిమాలతోనే కాదు తన స్టైలింగ్​తోనూ ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7' లోనూ ట్రెండీ కాస్ట్యూమ్స్​తో మరింత స్టైలిష్​గా, సరికొత్త లుక్ తో కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. అయితే ఆయన స్టయిలింగ్​ను ఫాలో అయ్యే అభిమానులు, ఇంటర్నెట్​లో వాటి ధర తెలుసుకొని షాక్ అవుతున్నారు. గత వీకెండ్ ఎపిసోడ్​లో నాగ్ వేసుకున్న ఒక్క షర్ట్ రేటే వందలు, వేలు కాదు.. అక్షరాలా 2 లకారాల కంటే ఎక్కువ ఉండటం నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. 

ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ధరించిన షర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిగ్ బాస్ థీమ్​కు తగ్గట్టుగా కన్ను కనిపించేలా ఒక ముఖాన్ని ప్రతిబింబించే ఆ ప్రింటెడ్ షర్ట్ చూడగానే అట్రాక్ట్ చేసింది. ఇది లూయిస్‌ వ్యూటన్‌ అనే ఫారిన్ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ షర్ట్‌. దీని ధర 2,25,406 ₹ అని తెలుస్తోంది. ముచ్చటపడి ఆ షర్ట్ కొనుక్కోవాలని అనుకున్న ఫ్యాన్స్ ఆ రేట్ చూసి ఆశ్చర్య పోతున్నారు. 'బిగ్ బాస్' హౌస్​లో నాగ్ ధరించిన షర్ట్, దాని రేటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ చేస్తూ, రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. 

Also Read: 'బలగం' వేణు బాటలో మరో కమెడియన్?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BiggBoss Kompa (@biggboss_kompa)

మామూలుగానే సెలబ్రెటీల లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది. వారు వేసుకునే బట్టలు బూట్ల దగ్గర నుంచి, ఉపయోగించే కార్ల వరకూ అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి. టాలీవుడ్​లోనే అత్యంత ఆస్తిపరుడైన అక్కినేని నాగార్జున లైఫ్ స్టైల్ మరింత లగ్జరీగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'కి హోస్ట్​గా చేస్తున్నారంటే ఒక్క షర్ట్ రేటే రెండు లక్షల రూపాయలు ఉండటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి.

ఇక సినిమాల విషయానికొస్తే, నాగార్జున ప్రస్తుతం 'నా సామి రంగా' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల బర్త్ డే స్పెషల్​గా రిలీజైన టైటిల్ గ్లిమ్స్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్​ను విశేషంగా ఆకట్టుకున్నాయి. గుబురు గడ్డం, కోర మీసాలు, పంచెకట్టులో నాగ్ ఊర మాస్ గెటప్​లో కనిపించాడు. ఈసారి మాస్ జాతర ఎలా ఉంటుందో చూపిస్తానంటూ వింటేజ్ వైబ్స్ కలిగించారు. 

ఇప్పటికే ఎందరో కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగార్జున.. 'నా సామి రంగా' సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని డైరక్టర్​గా లాంచ్ చేస్తున్నారు. ఇందులో నాగ్ సరసన ఆషికా రంగనాథ్, మిర్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2024 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

Also Read: బాలయ్య కొత్త పేరు బయటపెట్టిన 'భగవంత్ కేసరి' భామ!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget