Subhashree: ‘స్పై’ బ్యాచ్‌ను కలిసిన శుభశ్రీ - పల్లవి ప్రశాంత్‌ను చాలా మిస్ అయ్యానంటూ ఎమోషనల్
Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫైనల్‌గా జైలు నుంచి బయటికి వచ్చాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఒక్కొక్కరిగా వెళ్లి తనను కలుస్తున్నారు. అలాగే శుభశ్రీ కూడా కలిసింది.
Sivaji, Pallavi Prashanth, Prince Yawar : బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Season 7) విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టిన సమయంలోనే మిగతా కంటెస్టెంట్స్ అంతా పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో స్పై టీమ్ పాల్గొనలేదు. అంతే కాకుండా ఎవ్వరూ తన అరెస్ట్ విషయంపై పెద్దగా స్పందించలేదు. అందుకే పల్లవి ప్రశాంత్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కరిగా వెళ్లి తనను కలవడం మొదలుపెట్టారు. తాజాగా శుభశ్రీ, టేస్టీ తేజ, నయని పావని, భోలే షావలి వెళ్లి స్పై టీమ్‌ను కలిశారు. అంతే కాకుండా డిన్నర్ పార్టీ కూడా చేసుకున్నారు. ఈ పార్టీ వీడియోను శుభశ్రీతో పాటు తేజ కూడా తమ యూట్యూబ్ ఛానెళ్లలో పోస్ట్ చేశాడు.
ఆల్బమ్ సాంగ్‌కు ప్రశంసలు
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత భోలే షావలి, శుభశ్రీ కలిసి ఒక ఆల్బమ్ సాంగ్ చేశారు. ముందుగా ఆ సాంగ్‌ను ఈ పార్టీలో పాల్గొన్న కంటెస్టెంట్స్ అంతా చూశారు. అది చూసి కంటెస్టెంట్స్ అంతా బాగుందంటూ వారిని ప్రశంసించారు. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసి, రైడ్‌కు వెళ్లారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియకుండా పల్లవి ప్రశాంత్ తన చాటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నామని అడగగా.. కారు ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తున్నామని జోకులు వేశాడు. ఎప్పుడు చూసినా ఛాటింగ్ అంటూ కౌంటర్ ఇచ్చింది శుభశ్రీ. చాలాసేపటి తర్వాత ఫోన్ పట్టుకున్నానని, ఏదో కాల్ వస్తే చూస్తున్నానని తన ఐఫోన్‌ను చూపిస్తూ చెప్పాడు పల్లవి ప్రశాంత్.
కలలో కూడా అనుకోలేదు
ఆ తర్వాత యావర్ ఇంటికి వెళ్తున్నామని శివాజీ అందరికీ క్లారిటీ ఇచ్చాడు. ఓల్డ్ సిటీలోని యావర్ ఇంటికి వెళ్లి.. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను డ్రాప్ చేయడానికి గజ్వేల్‌కు వెళ్లి వస్తామని అన్నాడు. ‘‘నా లైఫ్‌లో అందరితో ఇలా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎక్కువగా ఒంటరిగా ఉండేవాడిని. నా మనస్థత్వానికి తగిన మనుషులు కనిపించకపోతే చాలా ఒంటరిగా ఉండేవాడిని. నా ఊరు ఫ్రెండ్స్ ఎనిమిదిమంది ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా వాళ్లతోనే. బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో నాకు ఆత్మీయులు అవుతారని నేను కలలో కూడా అనుకోలేదు. పరిచయాలు అనేవి మనచేతిలో కాదు. తలరాతలో ఉంటుంది’’ అని చెప్తూ.. శివాజీ, యావర్ తన బిడ్డలు అని మరోసారి స్టేట్‌మెంట్ ఇచ్చాడు శివాజీ.
ప్రశాంత్‌ను చాలా మిస్ అయ్యాను
యావర్‌ను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను కూడా డ్రాప్ చేసి అందరూ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో ఏదో మాట్లాడుతూ.. తేజను మావ అని పిలిచింది. అది ఒప్పుకోకుండా శివాజీ.. శుభశ్రీ చేత తేజను బాబాయ్ అని పిలిపించాడు. ఆ తర్వాత శుభశ్రీని కూడా తన ఇంటి వద్ద డ్రాప్ చేశారు. ఇదంతా వీడియోగా తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసింది సుబ్బు. చివరిగా అందరినీ కలవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ‘ఈ బాండ్, ఈ ఫీల్ ఎప్పటికీ ఉండాలి అనిపిస్తోంది. నేను ప్రశాంత్‌ను చాలా మిస్ అయ్యాను. తను మళ్లీ రియల్ వరల్డ్‌లోకి వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ ప్రశాంత్, అందరికీ లవ్ యూ’ అని చెప్తూ తన వీడియోను ముగించింది శుభశ్రీ.
Also Read: బిగ్‌బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసులు