By: Haritha | Updated at : 17 Dec 2022 11:40 AM (IST)
(Image credit: Star maa)
బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లలో అందగత్తె ఎవరు అంటే కచ్చితంగా అందరూ చెప్పే పేరు ‘శ్రీసత్య’. మల్లెతీగలా మెరిసిపోయే శ్రీసత్య చాలా మంది కుర్రాళ్లను బిగ్‌బాస్ చూసేలా చేసింది. కానీ అందం కన్నా, ప్రవర్తన చాలా ముఖ్యం.ఆమె ప్రవర్తన చాలా ఎపిసోడ్లో చిరాకు పడేలా ఉంది. దీంతో ఆమెకు త్వరగానే వ్యతిరేకత వచ్చేసింది. ఆపరేషన్ అసత్య పేరుతో కామెంట్లు కూడా మొదలయ్యాయి. ఆమె నామనేషన్లలో ఉంటే చాలు, బయటికి వచ్చేలా చేయాలంటూ సోషల్ మీడియా అంతటా యాంటీ శ్రీసత్య గ్యాంగ్ కామెంట్లు పెట్టేది. కేవలం బిగ్ బాస్ టీమ్ వల్లే ఆమె ఎలిమినేట్ కాకుండా ఉందని, ఓట్ల ప్రకారం అయితే ఎప్పుడో వెళ్లిపోవాలని అభిప్రాయపడుతున్నారు చాలా మంది ప్రేక్షకులు.
ఎట్టకేలకు శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా బయటికి వెళ్లిపోయింది. టాప్ 6లో ఉన్న శ్రీసత్య ఇక ఫైనల్‌కి వెళ్లిపోయానని అనుకుంది. కానీ తెల్లవారుజామున లేపి మరీ శ్రీసత్యను ఇంటికి పంపించేశారు. ఇంటి సభ్యులంతా కీర్తి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు, కానీ బిగ్ బాస్ ప్రేక్షకుల ఓట్ల మేరకు శ్రీసత్య ఎలిమినేట్ అయిందని చెప్పారు. ఆమె బిగ్ బాస్ కెఫెలో శివతో ఇంటర్య్వూ కూడా అయిపోయింది. దాన్నికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది.
డబ్బు కోసమే..
తాను బిగ్‌బాస్ హౌస్‌లోకి కేవలం డబ్బు కోసమే వచ్చానని, అలాగే ఫేమ్ కోసం కూడానని చెప్పింది. తనకు స్నేహాలు అవసరం లేదని అంది. తన తల్లి చికిత్సకు డబ్బు చాలా అవసరం అని, అందుకే గెలవాలనుకుంటున్నట్టు చెప్పింది. కానీ మొదటి మూడు వారాలు ఆమె ఆట ఆడింది ఏమీ లేదు. టైమ్ కి తినడం, రెస్టు తీసుకోవడం తప్ప. దీంతో నాగార్జున గట్టిగా క్లాసు తీసుకోవడంతో మెల్లగా ఆట మొదలుపెట్టింది. ఆటలో బాగానే జోరు పెంచింది కానీ ఇనాయ, కీర్తి విషయంలో వ్యక్తిగత దూషణలు, వెక్కిరింతలు చేసి చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీ వీక్ ఆమె అమ్మానాన్నలు వచ్చి చెప్పడంతో పద్ధతి మార్చకుంది.
ఎంత సంపాదించింది...
డబ్బు కోసం మాత్రమే బిగ్‌బాస్‌కి వచ్చిన శ్రీసత్య వారానికి లక్ష చొప్పున సంపాదించినట్టు సమాచారం. పదిహేను వారాలు ఉన్నందుకు ఆమెకు 15 లక్షల దాకా ముట్టజెప్పే అవకాశం ఉంది.
Also read: తొక్కే కదా అని తీసిపారేయకండి, వాటిలోనే పోషకాలన్నీ
Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!
Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్