Asia Cup 2025 Pant Jaiswal out | బ్యాకప్ కీపర్ ప్లేస్ కోసం కూడా భారీ పోటీ | ABP Desam
రాహుల్ కి ఆడటానికి ప్లేస్ లేదు. ఓపెనర్ గా ఎవరిని తీసుకోవాలో అర్థం కావట్లేదు. కీపర్ కాదు బ్యాకప్ కీపర్ కావాలంటే ఇద్దరు పోటీలో ఉన్నారు. వామ్మో ఆసియా కప్ సెలక్షన్ సెలెక్టర్లకు పిచ్చ తలనొప్పి తెచ్చేలా ఉంది. వీళ్ల అదృష్టం ఏంటంటే ఇప్పటివరకూ ఇద్దరు ప్లేయర్లు ఈ ఆసియా కప్ కి అందుబాటులో ఉండమని చెప్పటం. ఒకరు రిషభ్ పంత్. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో కాలికి గాయమైన కారణంగా ఆసియా కప్ పంత్ ఆడట్లేదు. సో పంత్ ప్లేస్ లో గంభీర్ అన్న ఆశీస్సులు ఉంటే సంజూ శాంసన్ కీపర్ గా ఛాన్స్ కొట్టేయటం పక్కా. లేదు గతంలో స్ట్రాటజీ ఫాలో అవుదాం అంటే కేఎల్ రాహుల్ నే కీపర్ గా తీసుకుంటారు. ఒక వేళ శాంసన్ టీమ్ లో ఉంటే రాహుల్ కి ప్లేస్ లేనట్లే. ఇంకో తలనొప్పి బ్యాకప్ కీపర్ ఒకరు కావాలి కదా ఒకవేళ గాయమైతే అంటే...ఇద్దరు పోటీలో ఉన్నారు ఒకరు మొన్న ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ఆడిన ధృవ్ జురేల్ అయితే మరొకరు సిక్సర్లతో విరుచుకుపడే జితేశ్ శర్మ. అంతెందుకు ఓపెనర్ యశస్వి జైశ్వాల్ వ్యక్తిగత కారణాలతో ఆసియా కప్ ఆడనని చెప్పటంతో సరిపోయింది కానీ ఉండి ఉంటే గిల్, సాయి సుదర్శన్ , జైశ్వాల్, అభిషేక్ శర్మలలో ఎవరితో ఓపెనింగ్ చేయించాలో అర్థం కాక తలపట్టుకునే వాళ్లు సెలెక్టర్లు. ఐపీఎల్ లో బీభత్సమైన ఫామ్ దృష్ట్యా టీ20 ఫార్మాట్ లో జరిగే ఆసియాకప్ కు సాయి సుదర్శన్ ఎంపిక తప్పనిసరి అయ్యి కూర్చుంది. అంటే అంతటి ఫామ్ లో ఉన్న టెస్ట్ కెప్టెన్ గిల్ ను పక్కన పెడతారా..ఏమో ఏదైనా జరగొచ్చు. కెప్టెన్ కాబట్టి సూర్య కుమార్ యాదవ్, మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ, శివమ్ దూబే... ఆల్ రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా ప్లేస్ లు కన్ఫర్మ్. బుమ్రా కచ్చితంగా ఉండే బౌలర్. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లో జట్టులో ఉండదగ్గ స్పిన్నర్లు. బౌలర్ల మిగిలిన పేస్ కోటాకు గట్టి పోటీ ఉంది. ఈ ఐపీఎల్ లో 25వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాల్లో ఒకరు టీమ్ లో ప్లేస్ ఎక్సెప్ట్ చేస్తున్నారు.చూడాలి ఇంతటి తలనొప్పి తట్టుకుని ఆసియాకప్ లో ఈ నెల 19 లేదా 20ల్లో ఎలాంటి టీమ్ ను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుందో.





















