Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్రా గెలుచుకుంటే మాత్రం అమర్ ఏమైనా సూపర్ స్టారా? - శివాజీ
Bigg Boss Telugu 7: ఛాన్స్ దొరికిన ప్రతీసారి అమర్‌దీప్‌ను ఏదో ఒకటి అనడం శివాజీకి అలవాటు అయిపోయింది. తాజాగా మరోసారి యావర్‌ను మోటివేట్ చేయడం కోసం అమర్‌ను తక్కువ చేసి మాట్లాడాడు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే అస్త్రా రేసులో నుంచి మొదటి రౌండ్‌లోనే శివాజీ తప్పుకోవాల్సి వచ్చింది. తన దగ్గర ఉన్న పాయింట్స్‌ను సంతోషంగా అమర్‌దీప్‌కు ఇచ్చేసి ఆట నుంచి పక్కకు తప్పుకున్నాడు. అప్పటినుంచి రేసులో ఉన్న కంటెస్టెంట్స్ ఆడే మిగతా ఫినాలే అస్త్రా టాస్కులకు ఎక్కువశాతం శివాజీనే సంచాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో జరిగిన ‘ఎస్కేప్ టాస్క్’ ప్రియాంక, శోభాలతో పాటు ఆయన కూడా సంచాలకుడిగా వ్యవహరించాడు. తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయిన యావర్, ప్రశాంత్‌లకు సంచాలకుడిగా ఉంటూ వీలైనంత వరకు సపోర్ట్ చేశాడు. అంతే కాకుండా ఈ టాస్క్‌లో ఓడిపోయి.. యావర్ ఫినాలే అస్త్రా నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చినప్పుడు అమర్‌తో తనను పోలుస్తూ అమర్‌ను తక్కువ చేసి మాట్లాడాడు శివాజీ.
ప్రశాంత్‌కు సపోర్ట్.. అర్జున్‌కు అన్యాయం..
‘ఎస్కేప్ టాస్క్’లో కంటెస్టెంట్స్ అంతా ఖైదీలుగా రెడీ అయ్యి తమకోసం ఏర్పాటు చేసి టనెల్స్‌లోని ఇసుకను తవ్వుకుంటూ అవతల వైపుకు వెళ్లి అక్కడ ఉన్న కీతో తమ కాళ్లకు ఉన్న తాళాలను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా మళ్లీ అదే టనెల్ నుంచి వచ్చి గంటను కొట్టాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ కాళ్లకు వేసి ఉన్న తాళాలకు సంబంధించిన నెంబర్లను వారు గుర్తుపెట్టుకున్నారు. కానీ ఎవ్వరూ ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. ముందుగా పల్లవి ప్రశాంత్ అందరికంటే త్వరగా ఈ టాస్క్‌ను ముగించాడు. అది చూసిన శివాజీ.. ‘‘కొట్టాడు వీడు. వాడు అంతే. నిజం చెప్తున్నా వాడు అంతే’’ అని అంతే అంతే అంటూ ప్రశాంత్ జపం చేశాడు. కానీ సంచాలకుడిగా ఉన్నప్పుడు అర్జున్‌కు అన్యాయం జరిగితే మాత్రం పట్టించుకోలేదు. అర్జున్ కీను యావర్ గార్డెన్‌లో పడేసి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని శివాజీ కూడా గమనించాడు కానీ ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉన్నాడు. అలా యావర్ వల్ల అర్జున్.. ఈ టాస్క్‌లో చివరి స్థానంలో ఉండవలసి వచ్చింది.
100 శాతం ఫినాలే అస్త్రా అతడిదే..
‘ఎస్కేప్ టాస్క్’ తర్వాత యావర్‌కు తక్కువ పాయింట్లు ఉండడంతో ప్రశాంత్‌కు తన పాయింట్స్‌లోని పావువంతు పాయింట్లను ఇచ్చేసి ఫినాలే అస్త్రా టాస్క్ నుంచి తప్పుకున్నాడు. నాకు లక్ కలిసిరావడం లేదు అని పదేపదే చెప్తూ బాధపడ్డాడు. శివాజీ దగ్గరకు వచ్చి తనను పట్టుకొని ఏడ్చాడు. యావర్‌కు ఎలాగైనా ధైర్యం చెప్పాలనుకున్న శివాజీ.. అమర్‌ను ఉదాహరణలాగా తీసుకున్నాడు. ‘‘సింపుల్‌గా చెప్తా. అర్జున్ 6వ వారంలో వచ్చాడు. అమర్‌కు క్లాస్ పీకాడు. 10వ వారంలో కూడా ఎప్పుడు ఆడతావు అని నాగార్జున అడిగారు. ఆడతాను, వచ్చేవారం నుంచి దులిపేస్తాను అని చెప్పాడు. అయితే ఇప్పుడు తను 100 శాతం ఫినాలే అస్త్రా గెలవబోతున్నాడు. అయితే సూపర్ స్టారా? నేను ఆడలేదు, నేను ఫౌల్స్ ఆడాను అని వాడే ఒప్పుకున్నాడు. అది కూడా నచ్చొచ్చేమో. కాబట్టి ఈరోజు అన్నది మాత్రమే నిజం’’ అని యావర్‌కు మోటివేషన్ ఇచ్చాడు శివాజీ. అయినా కూడా నా లక్ కలిసిరాలేదు అనే మాటపైనే ఉన్నాడు యావర్. దీంతో తనకు ఏం చెప్పలేక శివాజీ సైలెంట్ అయిపోయాడు. ఇక తనకు నచ్చినవారిని మాత్రమే తన పక్కన పెట్టుకొని, మిగతావాళ్లు ఏం చేసిన తప్పు అని చెప్పే శివాజీ.. మరో టాస్క్‌లో కూడా సంచాలకుడిగా ఉన్నాడు. ఆ సమయంలో గౌతమ్ పేరును మర్చిపోయి వాడి పేరేంటి అని పదేపదే పక్కవాళ్లను అడిగాడు. ఫైనల్స్ దగ్గర పడుతున్నా కూడా శివాజీలో ఇంకా మార్పు రాకపోవడం ప్రేక్షకులకు నచ్చడం లేదు.
Also Read: బెస్ట్ క్యాప్షన్ ఇవ్వండి, ఫ్రీగా 'సలార్' టికెట్స్ గెలుచుకోండి - ప్రభాస్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply