అన్వేషించండి

Bigg Boss Telugu 7: నీకంటే పెద్ద మెంటల్ ఉన్నారా? మోనితా స్టైల్‌లో శోభాశెట్టి వార్నింగ్ - నవ్వించిన అశ్వినీ శ్రీ

Bigg Boss Season 7: బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా జరిగిన నామినేషన్స్ అంతా పిచ్చిపిచ్చిగా ఉన్నాయని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత నామినేషన్స్ అనేవి మరింత రసవత్తరంగా మారాయి అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అందుకేనేమో ఒకరోజు ప్రసారం కావాల్సిన నామినేషన్స్.. రెండురోజులు ప్రసారం కానున్నాయి. నిన్న (అక్టోబర్ 16న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో ప్రియాంక, భోలే షావలి మధ్య జరిగిన గొడవ ఇప్పటికీ ముగిసినట్టుగా అనిపించడం లేదు. తాజాగా విడుదలయిన రెండు ప్రోమోల్లో ఇదే హైలెట్‌గా కనిపిస్తోంది. మొత్తంగా ఈ నామినేషన్స్‌లో ప్రియాంక, శోభా కలిసి భోలేను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది. దానికి పూర్తిగా తన ప్రవర్తనే కారణమని వారు చెప్తున్నారు. ఇక నామినేషన్స్‌కు సంబంధించి విడుదలయిన రెండో ప్రోమోలో అశ్విని నామినేషన్‌తో హౌజ్‌మేట్స్ ఫన్ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది.

అశ్విని ఫన్నీ నామినేషన్స్..

తాజాగా విడుదలయిన బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమోలో ముందుగా తన నామినేషన్స్ గురించి చెప్పడానికి అశ్విని ముందుకొచ్చింది. తన మొదటి నామినేషన్ అమర్‌దీప్ అని చెప్పగానే.. ‘‘కుండ పెట్టి కొట్టేముందు ఒక్కసారి క్లారిటీగా ఆలోచించి కొట్టు’’ అని జాగ్రత్త చెప్పాడు అమర్‌దీప్. అప్పుడు అశ్విని.. ‘‘బిగ్ బాస్ నా దగ్గర వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీడు అసలు ఒప్పుకోవడం లేదు. నేను మార్చుకోవచ్చా?’’ అని అమర్‌పై కంప్లైంట్ చేసింది. ఇది విని కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నారు. ఆ తర్వాత ‘‘నా నామినేషన్ అర్జున్’’ అని చెప్పింది అర్జున్. అది చూసి అర్జున్.. ‘‘ముందు నా దగ్గరికే రావచ్చు కదా’’ అన్నాడు. ‘‘నిన్ను చూస్తేనే భయమేస్తుంది. నేను ఏమైనా అంటే అటు ఇటు చేస్తావేమో అని’’ అశ్విని చెప్పింది. ‘‘ఏం చేస్తాను హౌజ్‌లో నిన్ను?’’ అని అర్జున్ వ్యంగ్యంగా అడగగానే.. కంటెస్టెంట్స్ అంతా మళ్లీ నవ్వుకున్నారు. ఇదంతా చూసిన అమర్‌దీప్.. ‘‘ఇది నామినేషన్ ప్రక్రియ కొంచెం సీరియస్‌గా ఉండండిరా’’ అని గుర్తుచేశాడు. దీంతో తన నామినేషన్స్‌ను కొనసాగించింది అశ్విని. ‘‘నేను స్ట్రాంగా కాదా డిసైడ్ చేసే హక్కు నీకు లేదు’’ అని అర్జున్‌తో చెప్పింది. దానికి అర్జున్.. ‘‘నువ్వు కూడా గ్రూప్‌లో ఒకదానివే కదా. గ్రూప్‌లో ఎవడూ కెప్టెన్ కాదు కదా’’ అని సమాధానమిచ్చాడు.

శోభా వర్సెస్ భోలే..

అలా ఫన్నీగా అశ్విని నామినేషన్స్ ముగిశాయి. ఆ తర్వాత భోలే షావలి వచ్చి శోభా శెట్టిని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. కారణం చెప్తుండగానే శోభా మధ్యలో జోక్యం చేసుకొని ‘‘క్లాస్ నేర్పించొద్దు. నామినేషన్‌కు కారణం చెప్పండి చాలు’’ అని చెప్పింది. దానికి ‘‘ఇక నీకు ఎర్రగడ్డే దిక్కు’’ అని అన్నాడు భోలే. ఆ మాటకు శోభాకు కోపం వచ్చింది. ‘‘నీకన్నా పెద్ద మెంటల్ ఉన్నారా ఈ హౌజ్‌లో’’ అని కౌంటర్ ఇచ్చింది. ‘‘ఆడవాళ్లు అయిపోయారు. ఎందుకురా మళ్లీ’’ అని భోలే ఏదో చెప్పబోతుండగా.. ప్రియాంక మధ్యలో జోక్యం చేసుకుంది. ‘‘ఆడవాళ్లు అనే పదాలు వాడొద్దు. గౌరవం లేనప్పుడు వాడొద్దు’’ అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. అయితే భోలేతో వాగ్వాదం ముగించని శోభా.. ‘‘నేను మాత్రమే తెప్పించాను నీ నిజస్వరూపం ఏంటని, అర్థమయ్యిందా? ఎక్కువరోజులు దాచుకోలేవు. బయటికి రావాల్సిందే. వచ్చేస్తది.’’ అని యాటిట్యూడ్‌తో చెప్పింది. ‘‘వచ్చేవారం ఎలిమినేట్ అయిన పర్వాలేదు కానీ నా వాల్యూ ఇక్కడ కాపాడే వెళ్తాను’’ అని కుండను పగలగొట్టి శోభాను నామినేట్ చేశాడు భోలే. ఆ తర్వాత ‘‘నువ్వు బాగుండాలి’’ అని శోభాను ఆశీర్వదించాడు. దానికి శోభా.. ‘‘నేను బాగుంటానయ్యా. నేను బాగుంటాను. నువ్వు బాగుండకు’’ అని కౌంటర్ ఇచ్చింది.

ఆ తర్వాత వచ్చిన యావర్.. గౌతమ్‌ను నామినేట్ చేశాడు. అది నచ్చని గౌతమ్.. ‘‘నాకు అది నచ్చలేదు నామినేట్ చేశాను. ఏంటి ఇప్పుడు’’ అని అడిగాడు. ‘‘నాకు కూడా అది నచ్చలేదు’’ అని యావర్ సింపుల్‌గా సమాధానమిచ్చాడు. ‘‘నీకు నచ్చలేదు కాబట్టి పెట్టి కొట్టుకో. నీ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి’’ అని వ్యంగ్యంగా అన్నాడు గౌతమ్. ఆ తర్వాత వచ్చిన గౌతమ్.. శివాజీని నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. ‘‘గత వారం అసలు ఆడలేకపోయారు’’ అని కారణం చెప్పాడు. అయితే ‘‘నువ్వు ఏ గేమ్ ఆడావు ఇప్పటివరకు అసలు’’ అని శివాజీ కౌంటర్ ఇచ్చాడు. దానికి సీరియస్ అయిన గౌతమ్.. ‘‘వినండి పాయింట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది’’ అని గట్టిగా అరిచాడు. అలా ఈ నామినేషన్స్‌లో కాస్త ఫన్, కాస్త ఫ్రస్ట్రేషన్ కూడా యాడ్ అయ్యింది.

Also Read: నేను తూ అంటే నీ బతుకు ఏం కావాలి? ప్రియాంక, భోలే మధ్య మాటల యుద్ధం - మోనిత తాండవం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget