Bigg Boss Telugu 7: నేను తూ అంటే నీ బతుకు ఏం కావాలి? ప్రియాంక, భోలే మధ్య మాటల యుద్ధం - మోనిత తాండవం
Bigg Boss Season 7: బిగ్ బాస్ సీజన్ 7లో నామినేషన్స్ ఇంకా వాడివేడిగా సాగుతూనే ఉన్నాయి. ప్రియాంక, భోలే మధ్య గొడవ రెండోరోజుకు చేరుకుంది. అయినా వీరి మాటల యుద్ధం ఆగడం లేదు.
బిగ్ బాస్ సీజన్ 7లో నామినేషన్స్ డే గొడవ ఒక్కరోజులో పూర్తికాలేదు. అందుకే మరో రోజు కూడా అదే గొడవ ప్రసారం కానుంది. నామినేషన్స్ అంటేనే ఒక కంటెస్టెంట్‌పై మరో కంటెస్టెంట్ ఆరోపించడం, ఆ ఆరోపణలను వారు ఒప్పుకోకపోవడం జరుగుతుంటాయి. కానీ ఒక్కొక్కసారి ఆ గొడవలు శృతిమించుతుంటాయి. కోపంలో విచక్షణ కోల్పోయిన కంటెస్టెంట్స్ నోరుజారుతుంటారు. తాజాగా జరిగిన నామినేషన్స్‌లో ప్రియాంక, భోలే షావలి మధ్య జరిగే గొడవ సమయంలో కూడా అదే జరిగింది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. విచక్షణ కోల్పోయి తిట్టుకున్నారు. ఇక శోభా శెట్టి చేసిన పనికి తేజ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ప్రతీది ఫన్..
తాజాగా విడుదలయిన బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమోలో ముందుగా శోభా శెట్టి.. తను ఎవరిని నామినేట్ చేస్తుందో చెప్పడానికి ముందుకొచ్చింది. తేజను నామినేట్ చేస్తున్నట్టుగా బయటపెట్టింది. పనిష్మెంట్ అనేది కామెడీగా తీసుకుంటున్నాడని కారణం చెప్పింది. ‘‘ఈరోజు కూడా వెళ్తా, నేను వీఐపీ రూమ్‌లోనే పడుకుంటా. అది నా ఇష్టం’’ అని తేజ చెప్పిన మాటలను శోభా గుర్తుచేసింది. అయితే అది ఫన్ కోసమే అని తేజ సమాధానమిచ్చాడు. ‘‘ప్రతీది నీకు ఫన్నే బ్రో’’ అని వెటకారంగా కౌంటర్ ఇచ్చింది శోభా. ఆ తర్వాత భోలే షావలిని నామినేట్ చేసింది శోభా. ఈ నామినేషన్స్ మధ్య ప్రియాంక కూడా జోక్యం చేసుకొని తన ప్రతాపం చూపించింది.
కావాలనే ఆడపిల్ల స్టేట్‌మెంట్..
శోభా తనను నామినేట్ చేసిన తర్వాత ‘‘నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుందిరా. ఆడపిల్లలు మంచి భవిష్యత్తు ఉంది’’ అని భోలే షావలి స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆడపిల్ల అని స్టేట్‌మెంట్స్ ఇస్తూ, ఇంతసేపు నటించావని ప్రియాంక.. భోలేపై అరవడం మొదలుపెట్టింది. ‘‘నీలాంటివాళ్లని చాలామందిని చూశా’’ అని ప్రియాంకను అన్నాడు భోలే. ‘‘ఏంటి నీలాంటి వాళ్లను చాలామందిని చూశాను? ఇదంతా నేను ఒప్పుకోను బిగ్ బాస్’’ అని అక్కడ నుండి వెళ్లిపోయింది ప్రియాంక. ‘‘ఎంత బాగున్నా ఇన్నిరోజులు’’ అని తన ప్రవర్తనను సమర్ధించుకోబోయాడు భోలే. దానికి ‘‘నువ్వు నటించావు’’ అంటూ సమాధానమిచ్చింది ప్రియాంక. ఎవరు అని భోలే ప్రశ్నించగా.. నువ్వే అని గట్టిగా చెప్పింది.
నేను తిరిగి తూ అంటే..?
ప్రియాంకతో మాట్లాడుతుండగా.. పొరపాటున తప్పు మాట అన్నాడు భోలే షావలి. ఆ తర్వాత సారీ సారీ అన్నాడు కూడా. కానీ అది గమనించిన శోభా.. ‘‘పక్కన అమ్మాయి ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకో’’ అని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత భోలేను తూ కొట్టింది ప్రియాంక. ‘‘నేను తిరిగి తూ అంటే నీ బ్రతుకు ఏం కావాలి’’ అని భోలే ప్రశ్నించాడు. ఆ తర్వాత నామినేషన్‌ను ప్రకటించి భోలే షావలి ముందు ఉన్న కుండను పగలగొట్టడానికి వచ్చింది శోభా. ‘‘నిజంగా బిగ్ బాస్‌లో కూడా మోనితనే అని ముద్రవేస్తున్నా’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు భోలే. ‘‘ఇదే మోనిత. ఇంతసేపు మాట్లాడింది శోభా శెట్టి’’ అని కోపంగా కుండ పగలగొట్టింది శోభా.
తేజ ఎమోషనల్..
నామినేషన్స్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత శోభా, తేజ మధ్య సంభాషణ జరిగింది. ‘‘ఇంట్లో ఉన్నవాళ్లంతా నాకు ఓటు వేయడం ఒక ఎత్తు నువ్వు ఓటు వేయడం ఒక ఎత్తు’’ అని శోభాతో చెప్తూ బాధపడ్డాడు తేజ. ‘‘లాస్ట్‌లో ప్రియాంక వేయలేదా నీకు?’’ అని ప్రశ్నించింది శోభా. ‘‘అందరు వేయడం ఒకటి.. నువ్వు వేయడం ఒకటి’’ అని తన మాటలను మళ్లీ స్పష్టంగా చెప్పాడు తేజ. ‘‘ప్రియాంకను ఎందుకు పోలుస్తావు అసలు. 12 మంది ఇదే రోజు నా కుండను పగలగొట్టినా ఒకటే. నువ్వు ఒక్కదానివి ఒకటి కొట్టినా ఒకటే’’ అని ఎమోషనల్ అవుతూ అక్కడ నుండి లేచి వెళ్లిపోయాడు తేజ.
Also Read: ‘బిగ్ బాస్’ హోస్ట్ అన్ని ఎపిసోడ్స్ చూస్తారా? అసలు విషయం చెప్పేసిన నాగార్జున
Join Us on Telegram: https://t.me/abpdesamofficial