Nagarjuna: ‘బిగ్ బాస్’ హోస్ట్ అన్ని ఎపిసోడ్స్ చూస్తారా? అసలు విషయం చెప్పేసిన నాగార్జున
‘బిగ్ బాస్’ హోస్ట్ నాగార్జున.. అన్ని ఎపిసోడ్స్ చూస్తారా? దీనిపై నాగార్జున ఏమన్నారు? ఈ షో కోసం ఆయన ఎంత కష్టపడతారు?
తెలుగు బుల్లితెరపైకి ‘బిగ్ బాస్’ వచ్చి ఏడేళ్లు అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాని హోస్ట్‌గా వ్యవహరించారు. వీరిద్దరూ.. కేవలం ఒక్కో సీజన్‌కే పరిమితమయ్యారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున ఆ బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నారు. ఆయన కూడా ‘బిగ్ బాస్’ వదిలేస్తారులే అని మొదట్లో అనుకొనేవారు. అలాగే.. కొత్త సీజన్లు వచ్చే ప్రతిసారి హోస్ట్ మారిపోతారంటూ వార్తలు వచ్చేవి. అయితే, నాగ్.. కొనసాగుతూనే ఉన్నారు. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ (ఓటీటీ)తో కలిపి ఆరు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం సీజన్-7ను సైతం విజయవంతంగా నడిపిస్తున్నారు.
ఏదైనా కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించడం అంటే ఛాలెంజింగ్ విషయమే. అయితే.. ‘బిగ్ బాస్’ వంటి రియాలిటీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే.. అందులో ఉండే కంటెస్టెంట్లను జడ్జ్ చేయడం అంత ఈజీ కాదు. వారి తప్పొప్పులను బేరీజు వేసుకుంటూ.. సరైన నిర్ణయాన్ని వెల్లడించాలి.. హౌస్‌ను ఆర్డర్‌లో పెట్టేలా కంటెస్టెంట్లకు హితబోధ చేయాలి. అలాగే అందులో జరిగే చిన్న విషయాన్ని కూడా పరిశీలించాలి. ఎవరికీ సపోర్ట్ చేయకుండా.. న్యూట్రల్‌గా వ్యవహరించాలి. నాగార్జున అలా చేశారు కాబట్టే.. ఇన్నాళ్లు హోస్ట్‌గా రాణిస్తున్నారు. ప్రేక్షకులు కూడా నాగార్జునే ఈ షోకు సరైనవారనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.
అయితే, బిగ్ బాస్ షో చూసే చాలామందికి వచ్చే సందేహం.. అసలు నాగార్జున ‘బిగ్ బాస్’ ఎపిసోడ్స్ అన్నీ చూస్తారా? లేదా ‘బిగ్ బాస్’ టీమ్ చెప్పేవి విని.. అప్పటికప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసుకుని చెబుతారా అని అనుకుంటారు. అంతేకాదు.. ఒక్కోసారి ప్రేక్షకుల కూడా గమనించని విషయాలను నాగార్జున చెబుతుంటే.. అదేప్పుడు జరిగిందని సందేహిస్తుంటారు. ఈ సందేహాలపై నాగార్జున ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ‘బిగ్ బాస్’ హోస్టింగ్ అంటే మాటలు కాదని, అది తనకు పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారో చూడండి.
ప్రేక్షకులు చూడనవి కూడా చూస్తా: నాగార్జున
‘‘మీలో ఎవరు కోటేశ్వరుడు.. వంటి షోస్‌లో మనం ఎదుటి వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే. అలాగే.. మనం వేసిన ప్రశ్నకు అతడు చెప్పే సమాధానం కరెక్టా, కాదా అనేది కూడా మన ముఖంలో కనిపించకుండా జాగ్రత్తపడాలి. అయితే, ‘బిగ్ బాస్’లో అలా కాదు. ప్రతి ఒక్కటీ నోటీస్ చేయాలి. ముఖ్యంగా ఆ కంటెస్టెంట్ చెబుతున్నది కరెక్టేనా? లేదా నాతో ఆడుకుంటున్నారా అనేది తెలుసుకోవాలి. వీక్ మొత్తం బిగ్ బాస్‌ను ఫాలో కాకపోతే.. హోస్టింగ్ చేయడం చాలా కష్టం. అందుకే, ఉదయాన్నే నేను ‘హాట్ స్టార్’ ఆన్ చేసుకుని ఎపిసోడ్స్ చూస్తుంటాను. అలాగే రాత్రి ఏం జరిగిందో కూడా తెలుసుకుంటాను. అంతేకాదు, ప్రేక్షకులు చూడనవి కూడ చూస్తాను. ‘బిగ్ బాస్’లో చాలా విషయాలు మీకు చూపించరు. కానీ, బిగ్ బాస్ టీమ్ హైలెట్స్ అన్నీ కట్ చేసి నాకు ప్రత్యేకంగా పంపిస్తారు. హోస్టింగ్‌కు ముందు కూడా ఆ హైలెట్స్ అన్నీ ‘బిగ్ బాస్’ హౌస్ వెనక్కి వెళ్లి చూస్తాను’’ అని తెలిపారు.
అలాగే ఓటింగ్ ప్రక్రియపై కూడా నాగ్ మాట్లాడారు. ఫైనల్ ఓటింగ్ ప్యాటరన్ వీకెండ్‌లో కౌంట్ చేస్తారు. ‘బిగ్ బాస్’ మంచి ఎక్స్‌పియరెన్స్ నాకు. ఎందుకంటే.. మనిషి బయటకు ఒకలా.. లోపల మరోలా ఉంటారు. వారి లోపల ఏముందనేది మనకు తెలీదు. కానీ, బిగ్ బాస్ హౌస్‌లో అవన్నీ బయటపడతాయి. నేను.. ఎంత చక్కగా ఉన్నారు అనుకొన్నవారంతా.. ఆ తర్వాత మారిపోతారు. ఒరిజినాలిటీ బయటపడతారు. అది ఒక డిఫరెంట్ ఎక్స్‌పియరెన్స్. అది నాకు కొత్త లెసెన్స్ నేర్పిస్తోంది’’ అని పేర్కొన్నారు.
Also Read: నోరు జారిన భోలే షావలి - నేను జోకా? అంటూ మండిపడ్డ ప్రియాంక, అర్జున్ మాస్ వార్నింగ్